2022లో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. రెండు రోజుల క్రితమే రూ.300లకు పైగా తగ్గిన బంగారం ధర నేడు సుమారు 380 రూపాయలు తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండంతో ప్రపంచవ్యాప్తంగా బంగార ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ ప్రభావం మనదేశంలో కనిపించింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఊహించినదాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయించుకుందనే వార్తలు వ్యాపించడంతో అమెరికాలో పుత్తడి ధరలు తగ్గాయి. రాయిటర్స్ ప్రకారం.. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.8% పడిపోయి $1,810.00కు చేరుకుంది.
న్యూఢిల్లీ బులియన్ ఇండియన్ జ్యూవెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,847గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర సుమారు రూ.380కు పైగా తగ్గింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.43,828గా ఉంది. ఇక హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.210 పైగా తగ్గి రూ.49,040కు చేరుకుంటే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.44,950కు చేరుకుంది.
విజయవాడ, విశాఖ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నేడు కేజీ వెండి ధర రూ.800కి పైగా తగ్గి రూ.60,846కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.
(చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్..! ఉచితంగా 5జీబీ డేటా..! ఎన్ని రోజులంటే..!)
Comments
Please login to add a commentAdd a comment