బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా దిగి వచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. తాజాగా నేడు తగ్గుముఖం పట్టింది. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా 10 గ్రాముల పసిడి ధర రూ.500కి పైగా తగ్గుముఖం పట్టింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండియన్ బులియన్ & గోల్డ్ జ్యువెలరీ ప్రకారం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర సుమారు రూ.500కి పైగా తగ్గి రూ.47817కు చేరుకుంది.
అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల పసిడి ధర రూ.44,285 నుంచి రూ.43,800కు తగ్గింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.330 తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గడంతో రూ.44,750కి చేరింది. ఇక వెండి ధర కూడా బంగారంతో పాటు పెరిగింది. నేడు రూ.1,200కి పైగా తగ్గి రూ.64,542 చేరుకుంది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment