Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజూ ధరలు ఊపందుకోవడంతో పసిడి నేడు (సెప్టెంబర్ 25) మరో కొత్త మార్కును తాకింది. దీంతో తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు నిరాశే ఎదరైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ఎంత మేర పెరిగిందన్నది పరిశీలిస్తే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.70,600 వద్దకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.660 పెరిగి రూ. 77,020 లను తాకింది.
బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బంగారం రేట్లు పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.70,750 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.660 పెరిగి రూ.77,170 లకు ఎగిశాయి.
ఇదీ చదవండి: EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము
రూ. లక్షకు వెండి
Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు బెంబేలెత్తిస్తున్నాయి. కేజీ వెండిపై ఒకేసారి రూ.3,000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment