మళ్లీ బంగారు జోరు! ఇంకెంత పెరుగుతుందో.. | Gold Rate and Silver Price Today On 27 September 2024 | Sakshi
Sakshi News home page

మళ్లీ బంగారు జోరు! ఇంకెంత పెరుగుతుందో..

Published Fri, Sep 27 2024 1:01 PM | Last Updated on Fri, Sep 27 2024 2:39 PM

Gold Rate and Silver Price Today On 27 September 2024

Gold Price Today: దేశంలో బంగారం ధరల జోరుకు బ్రేక్‌ పడినట్లే పడి మళ్లీ జోరందుకున్నాయి. క్రితం రోజున శాంతించిన పసిడి నేడు పరుగందుకుంది. తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. బంగారం తగ్గుముఖం చూసి ఎనిమిది రోజులైంది. ఈ ఎనిమిది రోజుల్లో 10 గ్రాములకు దాదాపు రూ.3000 దాకా పెరిగింది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లోని  హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు (సెప్టెంబర్‌ 27) బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.71,000 వద్దకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారమైతే  రూ.430 ఎగిసి రూ. 77,450 లకు చేరింది.

బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బంగారం ధరలు ఎగిశాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడిపై రూ.400 పెరిగి రూ.71,150 వద్దకు చేరగా 24 క్యారెట్ల బంగారం రూ.430 పుంజుకుని రూ.77,600 లను తాకింది.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులకు కొత్త రూల్స్‌..

వెండి ‘కొండ’లా..
Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు కొండలా పెరిగిపోతున్నాయి. కేజీకి రూ.లక్ష దాటినా శాంతించడం లేదు. హైదరాబాద్‌లో ఈరోజు ఈకేజీకి రూ.1000 పెరిగి రూ.1,02,000 వద్దకు చేరుకుంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement