దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు హమ్మయ్య అనిపించాయి. రెండు రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు శాంతించాయి. క్రితం రోజున రూ.800 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 22) అదే స్థాయిలో దిగివచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది.
ఇతర నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,500 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 క్షీణించి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు దిగొచ్చింది.
బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.850 తగ్గి రూ.66,950 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.930 తగ్గి రూ.73,970 లకు క్షీణించింది.
భారీగా దిగొచ్చిన వెండి
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి గణనీయంగా రూ.2000 చొప్పున పతనమైంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500లకు దిగొచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment