బంగారం ధర ఎప్పుడూ లేనంతగా రికార్డు గరిష్ఠాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.66,400 దాటింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేసిస్తున్నారు.
కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో హెడ్జింగ్ కోసం పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది.
గురువారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.
- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,440గా ఉంది
- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,710గా ఉంది.
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment