
ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా డీలాపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 371 క్షీణించి రూ. 53,200 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,305 నష్టపోయి రూ. 68,200 వద్ద కదులుతోంది.
కామెక్స్‌లోనూ వీక్
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం క్షీణించి 2,002 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.4 శాతం బలహీనపడి 1,994 డాలర్లకు చేరింది. ఇక వెండి ఔన్స్ 1.2 శాతం వెనకడుగుతో 27.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment