తమిళనాడులో ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి గూగుల్, రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్ ఎనేబుల్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించి.. రాష్ట్రంలో బలమైన ఏఐ ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టీఆర్‌బీ రాజాల సమక్షంలో.. గూగుల్ మౌంటైన్ వ్యూ కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. గూగుల్ క్లౌడ్ జీఎ అండ్ హెడ్ ఆఫ్ ప్లాట్‌ఫారమ్ అమిత్ జవేరీ, గూగుల్ పిక్సెల్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ నందా రామచంద్రన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.
తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల మంత్రి డాక్టర్ టిఆర్‌బి రాజా మాట్లాడుతూ.. గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుంది, భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్ సహకారం ఉంటుందని అన్నారు.
గూగుల్ క్లౌడ్ జీఎ అండ్ హెడ్ ఆఫ్ ప్లాట్‌ఫారమ్ అమిత్ జవేరీ మాట్లాడుతూ.. ఏఐలో ముందుకు సాగటానికి.. భవిష్యత్తు వైపు వారి ప్రయాణంలో మేము తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాము. సాంకేతిక పురోగతిని పెంపొందించడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని అన్నారు.
గూగుల్, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఏర్పడిన సహకారం అనేక కీలక అంశాల మీద దృష్టి సారిస్తుంది. ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా పిక్సెల్ 8 పరికరాల తయారీ తమిళనాడు ప్రభ్యత్వ భాగస్వామ్యం ద్వారా జరుగుతోంది. ఇప్పుడు ఏర్పరచుకున్న కొత్త భాగస్వామ్యం ఏఐ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment