న్యూఢిల్లీ: భారత్‌లోని డెవలపర్లు తమ ’ప్లే’ బిల్లింగ్ విధానానికి మారేందుకు గడువును పొడిగిస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. డెడ్‌లైన్‌ను 2022 మార్చి నుంచి అక్టోబర్ 31 వరకూ పొడిగించినట్లు పేర్కొంది. భారత్‌లో తరచుగా చేసే డిజిటల్ చెల్లింపుల మార్గదర్శకాల్లో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
భారత్‌లోని డెవలపర్లకు ప్రత్యేక అవసరాలను గుర్తించి, తదనుగుణంగా వారి వృద్ధికి తోడ్పాటు అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. డెడ్‌లైన్ పొడిగింపు అంశం డెవలపర్లకు కాస్త ఊరట కలిగించగలదని అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) తెలిపింది. అయితే, ఇందుకు చూపుతున్న కారణం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించింది. నిర్దిష్ట యాప్‌లపై 15–30 శాతం ట్యాక్స్ విధించడం, చెల్లింపు ఆప్షన్‌లపై పరిమితులు విధించడం వంటి అంశాలపైనే డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment