Google 23rd Birthday: Google Turns 23 Celebrates Birthday With Doodle On Homepage - Sakshi
Sakshi News home page

Google Doodle : గూగుల్‌లో 23! పుట్టినతేదీని ఎందుకు మార్చేశారంటే..

Published Mon, Sep 27 2021 9:00 AM | Last Updated on Mon, Sep 27 2021 10:46 AM

Google Turns 23 Celebrates Birthday With Doodle On Homepage - Sakshi

Google Birthday 2021: వరల్డ్‌ నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన 23వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. అందకే ఈ రోజు డూడుల్‌లో 23 ప్రత్యేకంగా కనిపింపించేలా డిజరైన్‌ చేసింది. ఐస్‌క్రీమ్స్‌, కేక్స్‌, క్యాండిల్స్‌తో ఈ రోజు డూడుల్‌ కొత్తగా కనిపిస్తోంది. 


23 ఏళ్లు పూర్తి
స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులు సెర్జే బ్రిన్‌, లారీపేజ్‌లో ఓ చిన్న స్టార్టప్‌గా 1998లో ప్రారంభించారు. వాస్తవానికి 1998 సెప్టెంబరు 4న గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ అందుబాటులోకి వచ్చింది. మొదటి ఏడేళ్ల పాటు సెప్టెంబరు 4నే గూగుల్‌ వార్షిక వేడుకుల నిర్వహించే వారు. 

ఏడేళ్ల తర్వాత
1998లో గూగుల్‌ ప్రారంభించినా తొలి ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పేజ్‌ వ్యూస్‌ రావడంతో 2005లో గూగుల్‌ యానివర్సరీ డేట్‌ని సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 27కి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తేదిని గూగుల్‌ పుట్టినరోజుగా జరుపుతున్నారు.


చదవండి: గూగుల్‌లో వెతికిన తొలి పదం ఇదే!

23 స్పెషల్‌ డూడుల్‌
గూగుల్‌ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అన్నీ జింజర్‌బ్రెడ్‌, ఐస్‌క్రీం శాండ్‌విచ్, కిట్‌కాట్‌, లాలిపాప్‌, మార్ష్‌మాలో, ఓరియో, పై ఇలా ఐస్‌క్రీంల పేర్లతోనే ఉంటాయి. తన థీమ్‌కి తగ్గట్టే ఈ రోజు డూడుల్‌లో కూడా ఐస్‌క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్‌ను డూడుల్‌లో పెట్టింది, ఎల్‌ అక్షరం స్థానంలో క్యాండిల్‌ని ఉంచి వేడుకల ఫ్లేవర్‌ని తెచ్చింది గూగుల్‌. 

బర్నింగ్‌ మ్యాన్‌
నెవడాలోని బ్లాక్‌ రాక్‌ సిటీలో జరిగిన బర్నింగ్‌మ్యాన్‌ ఈవెంట్‌ థీమ్‌తో తొలిసారి 1998లో గూగుల్‌ డూడుల్‌ని రూపొందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల డూడుల్స్‌ని ఈ సెర్చ్‌ ఇంజన్‌ రూపొందించింది.

చదవండి : మొండి గూగుల్‌.. ఆ ఫోన్లలో కరెక్ట్‌ పాస్‌వర్డ్‌ కొట్టినా వేస్టే! ఎందుకంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement