దేశంలో హిండెన్‌బర్గ్ వెర్స్‌స్ అదానీ వ్యవహారం తీవ్ర దుమారేన్ని రేపుతోంది. గత నెలలో అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అంతే కాకుండా ఈ ప్రకంపనలు దేశీయ స్టాక్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. చివరికి హిండెన్ బర్గ్ నివేదిక సెగ పార్లమెంటుకు కూడా తాకింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.
అదానీ వ్యవహారంలో అర్బీఐ జోక్యం
ఖాతాల్లో, షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా అదానీ గ్రూపునకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. గత వారం నుంచి మార్కెట్ వాల్యుయేషన్‌లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయిన సంగతి
తెలిసిందే. ఈ పరిణామం తర్వాత, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని ఆర్బీఐ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నుంచి అధికారిక ప్రకటన రాలేదని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో అదానీ గ్రూప్ గతంలో ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన రూ.20,000 కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది.
India's central bank (Reserve Bank of India) has asked local banks for details of their exposure to the Adani group of companies, government and banking sources, reports Reuters pic.twitter.com/EHxDfVNmhD
— ANI (@ANI) February 2, 2023
చదవండి: వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు!
Comments
Please login to add a commentAdd a comment