దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 50 కోట్లకు మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకున్న పౌరులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. పౌరులు మూడు సులభమైన దశలలో వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందవచ్చని ఆరోగ్య మంత్రి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది. MyGov కరోనా హెల్ప్‌డెస్క్ ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Revolutionising common man's life using technology!
— Office of Mansukh Mandaviya (@OfficeOf_MM) August 8, 2021
Now get #COVID19 vaccination certificate through MyGov Corona Helpdesk in 3 easy steps.
📱 Save contact number: +91 9013151515
🔤 Type & send 'covid certificate' on WhatsApp
🔢 Enter OTP
Get your certificate in seconds.
వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎలా పొందాలి:
- ముందుగా +91 9013151515 కాంటాక్ట్ నెంబరు సేవ్ చేసుకోండి
- వాట్సాప్‌లో 'covid certificate' టైప్ చేసి పంపండి
- తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి
- ఇప్పుడు మీరు వాక్సిన్ సర్టిఫికెట్ పొందుతారు
Comments
Please login to add a commentAdd a comment