హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఇన్వెస్టర్లు రియల్టీలో పెట్టుబడులను మాత్రం ఆపడంలేదు. 2024లో జులై నెలాఖరు వరకు హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన గృహాల సంఖ్య ఏకంగా 46,000గా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే రెవెన్యూ పరంగా 40 శాతం వృద్ధి చెందినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్న భౌగోళిక అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు అంత సురక్షితం కాదని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దాంతో ఎక్కువ ఒడిదొడుకులకు లోనుకాని, స్థిరంగా పెరిగే రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందులోనూ వేగంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ వంటి నగరాలవైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో స్థానికంగా రియల్టీ రంగం జోరందుకుంది.
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ప్రకారం.. భాగ్యనగరంలో 2024 జనవరి నుంచి జులై చివరి నాటికి ఏకంగా 46,368 గృహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. రెవెన్యూలో మాత్రం 40 శాతం వృద్ధి కనిపించింది. జులై నెలలోనే రూ.4,266 కోట్ల ఇళ్లు నమోదయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం వృద్ధి చెందింది. గృహాల సంఖ్యాపరంగా 7,124 ఇళ్లతో 28 శాతం వృద్ధి కనబరిచింది.
20245 జులైలో రూ. 50 లక్షల ధర కేటగిరిలో రిజిస్టర్ అయిన ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విక్రయాల రిజిస్ట్రేషన్‌ల వాటా జూలై 2023లో 69 శాతంగా ఉండేది. అదే 2024 జూలై నాటికి అమ్మకాలు 61 శాతానికి తగ్గింది. రూ. కోటి, అంతకంటే ఎక్కువ ఎక్కువ ధర కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్‌ల వాటా గణనీయంగా పెరిగి 13కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment