Hyundai Offers August 2021: పలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించిన హ్యూందాయ్‌..! - Sakshi
Sakshi News home page

పలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించిన హ్యూందాయ్‌..!

Published Fri, Aug 6 2021 9:27 PM | Last Updated on Sat, Aug 7 2021 10:54 AM

Hyundai Car Offers August 2021 Avail Benefits Of Up To Fifty Thousand - Sakshi

Hyundai Offers August 2021: ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ హ్యూందాయ్‌ మోటార్స్‌ కస్టమర్లకు తీపికబురును అందించింది. అమ్మకాలను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పలు కార్ల మోడళ్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. హ్యూందాయ్‌ కంపెనీకి చెందిన పలు కార్ల మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 50 వేల వరకు బెనిఫిట్‌లను అందించనుంది.  హ్యుందాయ్ శాంట్రో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ మొదలైన కార్లపై డిస్కౌంట్లతో పాటు పలు బెనిఫిట్‌లను అందించనుంది. కాగా ఈ ఆఫర్‌ కేవలం ఆగస్టు 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ప్రాంతాలను బట్టి సంబంధిత కార్ల ధరలో మార్పులు ఉండవచ్చును. 

ఆయా కార్లపై హ్యూందాయ్‌ అందిస్తోన్న ఆఫర్లు ఇవే..!

  • హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్) వేరియంట్‌పై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. 
  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ) వేరియంట్లపై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. 
  • హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్)వేరియంట్‌పై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. 
  • హ్యుందాయ్ ఆరా (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ) వేరియంట్లపై సుమారు రూ. 50 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement