Hyundai Motor Company
-
రాష్ట్రంలోహ్యుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్ మోటార్ కంపెనీ’తన భారతీయ అనుబంధ విభాగం ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్’(హెచ్ఎంఐఈ) ద్వారా తెలంగాణలో కార్ల ‘మెగా టెస్టింగ్ సెంటర్’ను స్థాపించనుంది. ఈ సెంటర్లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం (ఎలక్ట్రిక్ వాహనాలతో సహా) కూడా ఉంటుంది. దీంతో పాటు హైదరాబాద్‌లోని తమ ఇంజనీరింగ్ కేంద్రం ఆధునీకరణ, విస్తరణ ద్వారా భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హెచ్ఎంఐఈ మరింత ఉపాధి కల్పించనుంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్‌కు తమకు ముఖ్యమైన మార్కెట్ అని, వినియోగదారుల కోసం అత్యుత్తమ ఉత్పత్తులకు, సాంకేతిక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు హెచ్ఎంఐఈ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు. మెగా టెస్ట్ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. పెట్టుబడులపై అగ్రశ్రేణి కంపెనీల ఆసక్తి: సీఎం ‘ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి. ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థ, పగతిశీల విధానాలతో తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం హెచ్ఎంఐఈ లాంటి అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పెట్టుబడులకు అనువుగా మెగా టెక్స్టైల్ పార్కు కొరియాలోని టెక్స్టైల్ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు అనువైన ప్రదేశమని సీఎం అన్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (కొఫోటి) ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. వరంగల్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో టెక్స్టైల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో యంగ్వన్ చైర్మన్ కిహక్ సంగ్, కొఫొటి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయంగ్ జూతో పాటు 25 దిగ్గజ కొరియన్ టెక్స్టైల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. చెంగ్చియాన్ నదిని సందర్శించిన రేవంత్ బృందం మూసీ నది పునరుద్ధరణ తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుంది?, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పునరుద్ధరణ ఎలా చేయాలి? వంటి అంశాలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. మూసీ పునరుద్ధరణకు అవసరమైన పరిష్కారాల అన్వేషణ, సాధ్యాసాధ్యాలపై అధ్యయనంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి దక్షిణ కొరియా సియోల్ నగరంలోని చెంగ్చియాన్ నదిని ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. కాగా మూసీ విషయంలో అనేక ఆలోచనలు, ప్రణాళికలు తమ దృష్టికి వచ్చినట్లు సీఎం వెల్లడించారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘లో చెంగ్చియాన్ రివర్ ఫ్రంట్ వీడియోను ఆయన షేర్ చేశారు. -
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్-2022 ఇదే..!
ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ రూపొందించిన హ్యుందాయ్ IONIQ 5 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఇటీవల జరిగిన న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా హ్యుందాయ్ IONIQ 5 ది ఆల్-ఎలక్ట్రిక్ కార్ ను బ్రెంబో ప్రకటించింది. ఈ మోడల్ 2022 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్, 2022 వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది. హ్యుందాయ్ IONIQ 5 ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది (28) ఆటోమొబైల్స్ కంపెనీలతో పోటీ పడింది. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా మూడు కార్లు ఫైనలిస్ట్‌లోకి షార్ట్‌లిస్ట్ ఆయ్యాయి.. ఫోర్డ్ ముస్టాంగ్ మాక్-ఇ, హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా ఈవీ6 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో 2022లో మొదటి మూడు ఫైనలిస్టులుగా ఉన్నాయి. డిజైన్ ఆకర్షణీయమైన లుక్స్ తో కనిపించనుంది హ్యుందాయ్ IONIQ 5. ఈ నెల ప్రారంభంలో...హ్యుందాయ్ ఈ ఏడాది అక్టోబర్ చివరిలో ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం..హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు ధర రూ. 35-40 లక్షల మధ్య ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా, హ్యుందాయ్ Ioniq 5ని రెండు కాన్ఫిగరేషన్లలో అందిస్తోంది. వెనుక చక్రాల డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ను కలిగి ఉన్నాయి. ఇది గరిష్టంగా 169 bhp శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. , ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ డ్యూయల్-మోటార్ సెటప్‌ను కూడా పొందుతుంది. ఇది రెండు యాక్సిల్స్‌పై ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. వీటితో మొత్తంగా 306 bhp గరిష్ట శక్తిని, 605 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం
ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ క్రెటా సంచలనం సృష్టించింది. భారత్ నుంచి ఒక ఏడాదిలో రికార్డు స్థాయి యూనిట్ల ఎగుమతితో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హ్యుందాయ్ క్రెటా 2021కిగానూ మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఎస్యూవీ ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరుగుదల 26.17 శాతం నమోదు కావడం విశేషం. మొత్తం 32, 799 యూనిట్లు ఓవర్సీస్కి ఎగుమతి అయ్యాయి. 2020లో యూనిట్ల సంఖ్య 25,995 యూనిట్లుగా ఉంది. ఇక 2021లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తంగా 42, 238 ఎస్‌యూవీల ఎగుమతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో క్రెటా గ్రాండ్తో పాటు వెన్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వెన్యూ 7,698 యూనిట్లు, క్రెటా గ్రాండ్ 1,741 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. క్రెటా, ఐ20, వెర్నా, అల్కాజర్ మోడల్స్‌ను ఎంపిక చేసిన మార్కెట్లలోకి వదిలింది హ్యుందాయ్ ఇండియా. సౌతాఫ్రికాతో పాటు పెరూ, డొమినికా రిపబ్లికా, చాద్, ఘనా, లావోస్‌కు సైతం ఎన్ లైన్, ఎల్పీజీ వేరియెంట్లను ఎగుమతి చేసింది. -
హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!
ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టిసారించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇంజిన్ డెవలప్మెంట్ సెంటర్ మూసివేత..! హ్యుందాయ్ కొత్త అంతర్గత దహన ఇంజిన్లను అభివృద్ధి చేయడం ఆపివేస్తోందని కొరియన్ ఎకనామిక్ డైలీ పేర్కొంది. దీంతో డెవలప్మెంట్ సెంటర్లోని ఇంజిన్ డెవలప్మెంట్ విభాగం మూసివేసినట్లు తెలుస్తోంది. పవర్‌ట్రెయిన్ విభాగంను ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ డెవలప్మెంట్ టీమ్‌గా మార్చినట్లు కొరియన్ ఎకనామిక్ డైలీ వెల్లడించింది. వీటితో పాటుగా బ్యాటరీ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా హ్యుందాయ్ అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త కేంద్రంలో బ్యాటరీ డిజైన్ బృందం, బ్యాటరీ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ అనే రెండు బృందాలు పనిచేయనున్నాయి. 2030 నాటికి 30 శాతం వరకు.. 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల నుంచే ఆదాయాలను రాబట్టేందుకు హ్యుందాయ్ ప్రణాళికలను రచిస్తోంది. 2030 నాటికి మొత్తం అమ్మకాలలో 30 శాతం జీరో-ఎమిషన్ వాహనాల నుంచి పొందాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వాహనాలు కనుమరుగు..! హ్యుందాయ్ అనేక రకాలైన కంబ్యూషన్ ఇంజిన్ వాహనాలను తయారుచేస్తోంది. వాటిలో ముఖ్యంగా 1.1-లీటర్ల నుంచి 2.0-లీటర్ల సామర్ధ్యం కల్గిన ఇంజిన్స్ ఉన్నాయి. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు, సీఎన్జీ, డిజీల్ ఇంజిన్ వాహనాలు ఉన్నాయి. కంపెనీ నిర్ణయం మేరకు ఈ వాహనాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోనుంది. కొత్తగా ఆరు మోడల్స్‌తో..! భారత ఆటోమొబైల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై కసరత్తు ప్రారంభించినట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. 2028 నాటికి భారత్‌లో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి 4,000 కోట్లను కంపెనీ ఖర్చు చేయనుంది. ఇప్పటికే IONIQ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లో తారసపడ్డాయి. చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..! -
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, ఉబర్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్ల తయారీపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేసింది. కాగా, ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. 2028 నాటికి తన మొదటి వాణిజ్య విమానాన్ని మార్కెట్లోకి లాంచ్ చేయలని లక్ష్యంగా చేసుకుంది. హ్యుందాయ్ యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ కోల్ ఈ దశాబ్దం చివరినాటికి ఎగిరే కార్లు వాస్తవ రూపం దాల్చుతాయి అని తాను నమ్ముతున్నానని గతంలో తెలియజేశారు. "ఇవి భవిష్యత్తులో మన జీవితంలో భాగం కానున్నట్లు మేము నమ్ముతున్నాము" అని అతను చెప్పారు. హ్యుందాయ్ ఇప్పటికే ఎస్-ఎ1 కాన్సెప్ట్ అభివృద్ధిపై పనిచేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. అలాగే, 600 మీటర్ల వరకు వెళ్లగలదు. ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. (చదవండి: భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!) -
పలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించిన హ్యూందాయ్..!
Hyundai Offers August 2021: ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ హ్యూందాయ్ మోటార్స్ కస్టమర్లకు తీపికబురును అందించింది. అమ్మకాలను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పలు కార్ల మోడళ్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. హ్యూందాయ్ కంపెనీకి చెందిన పలు కార్ల మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 50 వేల వరకు బెనిఫిట్లను అందించనుంది. హ్యుందాయ్ శాంట్రో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మొదలైన కార్లపై డిస్కౌంట్లతో పాటు పలు బెనిఫిట్లను అందించనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ప్రాంతాలను బట్టి సంబంధిత కార్ల ధరలో మార్పులు ఉండవచ్చును. ఆయా కార్లపై హ్యూందాయ్ అందిస్తోన్న ఆఫర్లు ఇవే..! హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్) వేరియంట్‌పై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వేరియంట్లపై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్)వేరియంట్‌పై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. హ్యుందాయ్ ఆరా (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వేరియంట్లపై సుమారు రూ. 50 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. -
4.71 లక్షల ఎస్‌యూవీల రీకాల్
న్యూయార్క్: గత సెప్టెంబర్‌లో యూఎస్‌లో ప్రారంభించిన హ్యుండాయ్ టస్కన్ ఎస్‌యూవీల రీకాల్‌ను కొనసాగిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ తాజాగా వెల్లడించింది. యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన కార్ల కంప్యూటర్లలో అంతర్గతంగా సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లకు అవకాశమేర్పడుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా 2016-2018 మధ్య తయారైన కొన్ని మోడళ్లలో ఈ సమస్యలు కనిపిస్తున్నట్లు వివరించింది. దీంతో అగ్రిప్రమాదానికి అవకాశముంటుందని తెలియజేసింది. వీటికి జతగా 2020-21 మోడళ్లను సైతం రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే హ్యుండాయ్కు చెందిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగిన టస్కన్ వాహనాలను వెనక్కి పిలవడం లేదని పేర్కొంది. యూఎస్‌లో 2020 సెప్టెంబర్‌లో ప్రారంభించిన కార్ల రీకాల్‌లో భాగంగా మరో 4.71 లక్షల ఎస్‌యూవీలకు రిపేర్ సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. రిపేర్లు పూర్తయ్యేవరకూ కార్లను బయటే పార్క్ చేయవలసిందిగా ఈ సందర్భంగా యజమానులకు సూచించింది. చదవండి: (ఇక భారత్‌లోనూ ఎలక్ట్రిక్ కార్ల హవా) సమస్యపై దర్యాప్తు ఎస్‌యూవీలలో ఎదురవుతున్న సమస్యలపై కొనసాగిస్తున్న దర్యాప్తులో భాగంగా తాజా రీకాల్‌ను చేపట్టినట్లు హ్యుండాయ్ యూఎస్ వెల్లడించింది. కొన్ని కార్లలో అగ్రిప్రమాదాలు జరగడంతో రిపేర్‌కు సన్నాహాలు చేసినట్లు పేర్కొంది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలియజేసింది. ఫిబ్రవరి చివరికల్లా యజమానుల జాబితాను సిద్ధం చేయగలమని వెల్లడించింది. తద్వారా యజమానులు డీలర్ల దగ్గరకు కార్లను తీసుకుని వెళితే కంప్యూటర్లలో ఫ్యూజు మార్పిడిని చేపడతారని తెలియజేసింది. నిజానికి సెప్టెంబర్‌లో ఇదే సమస్యతో 2019-21 మధ్య కాలంలో తయారైన 1.8 లక్షల టస్కన్ ఎస్‌యూవీలను యూఎస్‌లో రీకాల్ చేసింది. తుప్పు కారణంగా రక్షణాత్మక యాంటీలాక్ బ్రేక్ సర్క్యూట్ బోర్డులలో షార్ట్ సర్క్యూట్లకు వీలు ఏర్పడుతున్నట్లు వివరించింది. ఇంజిన్లు ఆఫ్‌చేసి ఉన్నప్పటికీ ఈ సమస్య ఎదురయ్యే వీలున్నట్లు పేర్కొంది. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) -
లీజుకు షి‘కారు’!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డౌన్ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది నచ్చే వార్తే. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇపుడు వాహన తయారీ కంపెనీలు కార్ల లీజింగ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కార్ల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవి లీజు మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. లీజు ప్రయోజనం ఏంటంటే... కస్టమర్‌పై ముందస్తు (డౌన్ పేమెంట్) చెల్లింపు భారం ఉండదు. బీమా, రోడ్ ట్యాక్స్, యాక్సిడెంటల్ రిపేర్లు, మెయింటెనెన్స్ అంతా కార్ల కంపెనీయే చూసుకుంటుంది. ఓ ఐదేళ్ల పాటు నెలవారీ కంపెనీ నిర్దేశించిన సొమ్మును చెల్లిస్తే చాలు. ఐదేళ్ల తరువాత వాహనాన్ని తిరిగి కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. అంతే!!. కాల పరిమితి, ఈఎంఐ మొత్తం అనేవి మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విధానంలో కంపెనీలు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కార్లను లీజుకిస్తున్నాయి. లీజు పూర్తి కాకముందే కస్టమర్ మరో మోడల్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు కూడా!!. వినియోగదారు తనకు నచ్చిన మోడళ్లను తరచూ మార్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ చెప్పారు. లీజు విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందన్నారు. రిటైల్ కస్టమర్లకు సైతం.. దేశీయంగా 2018–19లో అన్ని కంపెనీలూ కలిసి 33,77,436 ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో విక్రయాలు ఏకంగా 19 శాతం పడిపోయాయి. బలహీన సెంటిమెంటు, వాహన ధరలు పెరగడం, ఆర్జించే వ్యక్తులపై పన్ను భారం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు ఉబెర్, ఓలా వంటి రైడ్ షేరింగ్ కంపెనీల కార్యకలాపాలు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తృతమవుతున్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవటానికి కంపెనీలు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో లీజింగ్ ఒకటి. కార్పొరేట్ క్లయింట్లకు లీజుపై వాహనాలను దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్ కస్టమర్లకూ ఈ సేవల్ని విస్తరించాయి. ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఎల్‌డీ ఆటోమోటివ్, రెవ్ కార్స్ వంటి లీజింగ్ కంపెనీల భాగస్వామ్యంతో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎఫ్సీఏ ఇండియా ప్రస్తుతం ఈ రంగంలోకి వచ్చాయి. మారుతీ, టాటా వంటి సంస్థలూ త్వరలో వస్తామనే సంకేతాలిస్తున్నాయి. ‘లీజింగ్ విధానం మంచిదే. మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తున్నాం’ అని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. తక్కువ ఖర్చుతో... ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్లను లీజుకు తీసుకోవచ్చు. నగరం, వాహనం మోడల్, కాల పరిమితిని బట్టి నెలవారీ లీజు మొత్తం మారుతుంది. అయిదేళ్ల కాల పరిమితిపై హ్యుందాయ్ శాంత్రో బేసిక్ మోడల్ కారు నెలవారీ అద్దె సుమారు రూ.7,670 ఉంది. క్రెటా విషయంలో రూ.17,640 చార్జీ చేస్తారు. ఇదే వర్షన్ క్రెటా కొనాలంటే డౌన్ పేమెంట్ రూ.2.7 లక్షలిచ్చాక, ఈఎంఐ రూ.18,900 దాకా అవుతోంది. ఇక మహీంద్రా కేయూవీ100ఎన్ఎక్స్టీ రూ.13,499, ఎక్స్‌యూవీ500 రూ.32,999లుగా నిర్ణయించారు. స్కోడా మోడల్ ప్రారంభ అద్దె రూ.19,856. ప్రస్తుతం సూపర్బ్ మోడల్ మాత్రమే ఈజీ బై కింద అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఫియట్, జీప్ మోడళ్లను ఎఫ్సీఏ ఇండియా లీజు కింద ఆఫర్ చేస్తోంది. -
కార్ల విక్రయాలు వెలవెల
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు డిసెంబర్లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొత్త ఏడాది ఒక నెల దూరంలోనే ఉండటంతో వినియోగదారులు డిసెంబర్లో వాహనాల కొనుగోళ్లకు ముందుకు రాలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. డిసెం బర్లో కొన్న వాహనాలను పాత ఏడాది మోడల్‌గానే గుర్తిస్తారని, రీసేల్ చేసేటప్పుడు ఇది ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వినియోగదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్ కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రమే ఓ మోస్తరుగా పెరగ్గా, మిగిలిన కంపెనీల అమ్మకాలు తగ్గాయి. మందగమనాన్ని ప్రతిబింబిస్తూ మహీంద్రా, ఫోర్డ్ ఇండియా, టయోటా కిర్లోస్కర్, జనరల్ మోటార్స్ తదితర కంపెనీల అమ్మకాలు తగ్గాయి. ప్రభుత్వమే దిక్కు ప్రయాణికుల వాహనాల విక్రయాలు పుంజుకోవడంతో దేశీయ అమ్మకాలు 5.5 శాతం పెరిగాయని మారుతీ పేర్కొంది. ఇక గత సంవత్సరం తమకు సమస్యలతోపాటు ఊరటనిచ్చిన ఏడాదని హ్యుం దాయ్ మోటార్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రాకేష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 99 శాతం ఉపయోగించుకున్నామని, భారత్‌లో 50 లక్షల కార్లను అత్యంత వేగంగా ఉత్పత్తి చేయగలిగామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ వాహన విక్రయాల్లో ప్రతికూల వృద్ధి నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఆర్థిక కార్యకలాపాల తగ్గుముఖం, వినియోగదారుల, వాణిజ్యపరమైన సెంటిమెంట్లు బలహీనంగా ఉండడం దీనికి కారణమన్నారు. వాహన పరిశ్ర మను గట్టెక్కించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. భారీస్థాయిలో డిస్కౌం ట్లు ఇచ్చినా, అమ్మకాలు మెరుగుపడలేదని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ చెప్పారు.