ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ రూపొందించిన హ్యుందాయ్ IONIQ 5 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఇటీవల జరిగిన న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా హ్యుందాయ్ IONIQ 5 ది ఆల్-ఎలక్ట్రిక్ కార్ ను బ్రెంబో ప్రకటించింది. ఈ మోడల్ 2022 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్, 2022 వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది.
హ్యుందాయ్ IONIQ 5 ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది (28) ఆటోమొబైల్స్ కంపెనీలతో పోటీ పడింది. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ గా మూడు కార్లు ఫైనలిస్ట్‌లోకి షార్ట్‌లిస్ట్ ఆయ్యాయి.. ఫోర్డ్ ముస్టాంగ్ మాక్-ఇ, హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా ఈవీ6 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో 2022లో మొదటి మూడు ఫైనలిస్టులుగా ఉన్నాయి.
డిజైన్ ఆకర్షణీయమైన లుక్స్ తో కనిపించనుంది హ్యుందాయ్ IONIQ 5. ఈ నెల ప్రారంభంలో...హ్యుందాయ్ ఈ ఏడాది అక్టోబర్ చివరిలో ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం..హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు ధర రూ. 35-40 లక్షల మధ్య ఉండనుంది.
ప్రపంచవ్యాప్తంగా, హ్యుందాయ్ Ioniq 5ని రెండు కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది. వెనుక చక్రాల డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ను కలిగి ఉన్నాయి. ఇది గరిష్టంగా 169 bhp శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. , ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ డ్యూయల్-మోటార్ సెటప్‌ను కూడా పొందుతుంది. ఇది రెండు యాక్సిల్స్‌పై ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. వీటితో మొత్తంగా 306 bhp గరిష్ట శక్తిని, 605 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment