ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ పేరిట యాన్యుటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ అవసరాల కోసం క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసి, దీర్ఘకాలంలో నిధిని సమకూర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని సంస్థ తెలిపింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా యాక్సిలరేటెడ్ హెల్త్ బూస్టర్స్, బూస్టర్ పేఅవుట్స్ వంటి ఏడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బూస్టర్ పేఅవుట్ ఆప్షన్‌లో యాన్యుటీకి అదనంగా అయిదు సార్లు పెద్ద మొత్తంలో చెల్లింపులు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment