ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తన తాజా ప్రకటనలో పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన వృద్ధి అంచనాలను 8.5 శాతం నుంచి 9 శాతానికి పెంచింది. కోవిడ్–19 వ్యాక్సినేషన్ విస్తృతి, ఖరీఫ్ పంటసాగు బాగుంటుందన్న అంచనాలు, ప్రభుత్వ వ్యయాల వేగవంతం వంటి అంశాలు వృద్ధి అంచనా మెరుగుదలకు కారణమని పేర్కొంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా 9.5 శాతంకన్నా ఇక్రా తాజా అంచనా తక్కువగా ఉండడం గమనార్హం.
రేటింగ్ ఏజెన్సీ తాజా ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- ఆర్థిక సంవత్సరం రెండవ ఆరు నెలల్లో (2021అక్టోబర్–మార్చి2022) ఆర్థిక వ్యవస్థకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ విస్తృతి ఎకానమీ పురోగతిపై విశ్వాసాన్ని పెంపొందిస్తుండగా, కీలక రంగాల్లో డిమాండ్ కూడా మెరుగుపడుతోంది.
- వ్యవసాయ రంగం నుంచి వినియోగ డిమాండ్ పటిష్టంగా ఉంది. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల నుంచి రెండు, మూడవ త్రైమాసికాల్లో (జూలై–డిసెంబర్)వృద్ధి 3శాతంగా నమోదయ్యే వీలుంది (క్రితం అంచనా 2 శాతం మాత్రమే)
- పారిశ్రామిక రంగం మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది. సెమీ–కండక్టర్ లభ్యం కాకపోవడం ఆటో రంగంపై ప్రతికూలత చూపుతోంది. ఇది జీఎస్‌టీ ఈ–వే బిల్లులపై ప్రభావం చూపవచ్చు.
- భారీ వర్షాలు విద్యుత్ డిమాండ్‌ను దెబ్బతీస్తోంది. మైనింగ్, నిర్మాణ రంగాలకు ఈ పరిస్థితి ప్రతికూలమే. ∙అయితే తాజా 9 శాతం వృద్ధి అంచనా మూడవ వేవ్ సవాళ్లకు లోబడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment