41.68 బిలియన్ డాలర్లకు చేరిక
న్యూఢిల్లీ: దేశీ వాణిజ్య ఎగుమతులు గత నెల(మార్చి)లో నామమాత్ర క్షీణతతో41.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2023–24)కి సైతం 3 శాతం నీరసించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రాజకీయ, భౌగోళిక సవాళ్లు గ్లోబల్ షిప్‌మెంట్స్‌ను దెబ్బతీశాయి. మరోపక్క మార్చిలో దిగుమతులు సైతం 6 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 57.28 బిలియన్ డాలర్లను తాకాయి.
దీంతో గత నెలలో వాణిజ్య లోటు 15.6 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం దిగుమతులు 5.4 శాతం తక్కువగా 677.24 బిలియన్ డాలర్లను తాకాయి. వెరసి గతేడాదికి ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం(వాణిజ్య లోటు) 240.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్‌త్వాల్ తెలియజేశారు. అవసరమైనప్పుడు తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment