domestic trade
-
మార్చి వాణిజ్య ఎగుమతులు ఫ్లాట్
న్యూఢిల్లీ: దేశీ వాణిజ్య ఎగుమతులు గత నెల(మార్చి)లో నామమాత్ర క్షీణతతో41.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2023–24)కి సైతం 3 శాతం నీరసించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రాజకీయ, భౌగోళిక సవాళ్లు గ్లోబల్ షిప్‌మెంట్స్‌ను దెబ్బతీశాయి. మరోపక్క మార్చిలో దిగుమతులు సైతం 6 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 57.28 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో గత నెలలో వాణిజ్య లోటు 15.6 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం దిగుమతులు 5.4 శాతం తక్కువగా 677.24 బిలియన్ డాలర్లను తాకాయి. వెరసి గతేడాదికి ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం(వాణిజ్య లోటు) 240.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలియజేశారు. అవసరమైనప్పుడు తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
2 లక్షల కోట్ల డాలర్లకు ఎగుమతులు
న్యూఢిల్లీ: 2030 నాటికి వస్తు, సేవల ఎగుమతులను 2 లక్షల కోట్ల డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యం ఆచరణ సాధ్యమేనని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఎస్సీ అగర్వాల్ తెలిపారు. సులభంగా వాణిజ్య రుణాల లభ్యత ఇందుకు కీలకంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల్లో పోటీపడేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ వివరించారు. ఇటు దేశీయ వ్యాపారాలతో పాటు అటు సీమాంతర వాణిజ్యానికి కూడా సులభంగా రుణాలు లభించేలా చూడటంపై ప్రభుత్వం, ట్రేడర్లు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) ‘సీమాంతర వాణిజ్యంతో పోలిస్తే దేశీయంగా వ్యాపారాల కోసం రుణాలను పొందడం సులభతరంగా ఉంటుందని నాకు చెబుతుంటారు. సీమాంతర వాణిజ్యం చాలా రిస్కులతో కూడుకున్నదనే అభిప్రాయమే దీనికి కారణం కావచ్చు. మనం ప్రపంచ మార్కెట్లో పోటీపడాలంటే దీన్ని సరిదిద్దాలి. ఇందులో రుణాల లభ్యత కీలక పాత్ర పోషిస్తుంది‘ అని అగర్వాల్ చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021–22తో పోలిస్తే 2022–23లో వస్తు, సేవల ఎగుమతులు 14.68 శాతం పెరిగి 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఈ నేపథ్యంలో 2030 నాటికి వీటిని 2 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు)కు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. మరోవైపు, ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య నిర్వహణ తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ తెలిపారు. కార్మిక శక్తి, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, పర్యావరణ అభివృద్ధి మొదలైనవి వ్యాపారాల్లో కీలకంగా మారాయని, పలు దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. వాణిజ్యం విషయంలో భారత్‌ను ఏ దేశమూ వదులుకునే పరిస్థితి లేదని, మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగు రక్షణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సింగ్ చెప్పారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
♦ వర్ధమాన దేశాలు దెబ్బతీసినా ఆదుకున్న దేశీయ వ్యాపారం ♦ 34 శాతం వృద్ధితో రూ. 580 కోట్లకు... ♦ మొత్తం ఆదాయం రూ.3,986 కోట్లు; 3శాతం వృద్ధి ♦ యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలపై సానుకూలంగా స్పందిస్తున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; రష్యా, ఇతర వర్ధమాన దేశాల వ్యాపారం దెబ్బతీసినా దేశీయ వ్యాపారం ఆదుకోవడంతో డాక్టర్ రెడ్డీస్ స్థిరమైన ఫలితాలను ప్రకటించగలిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా ఒక శాతం పెరిగి రూ. 574 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో రూ. 3,843 కోట్ల నుంచి రూ. 3,968 కోట్లుగా నమోదయ్యింది. వర్ధమాన దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం ఫలితాలపై పడినట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ అండ్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. సమీక్షా కాలంలో రష్యా, వెనెజులాతో సహా ఇతర వర్థమాన దేశాల వ్యాపారం 28 శాతం క్షీణించి రూ. 884 కోట్ల నుంచి రూ. 640 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశీయంగా అమ్మకాలు 34 శాతం పెరిగి రూ. 433 కోట్ల నుంచి రూ. 580 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో ఇండియాలో 5 ఉత్పత్తులు విడుదల చేయడం వల్ల వ్యాపారం వృద్ధి చెందడానికి కారణంగా పేర్కొన్నారు. కీలకమైన ఉత్తర అమెరికా వ్యాపారం 18 శాతం వృద్ధితో రూ. 1,942 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఆర్అండ్డీ కేటాయింపులు 5.1 శాతం క్షీణించి రూ.409 కోట్లకు పరిమితమయ్యింది. ఈ త్రైమాసికంలో మొత్తం నాలుగు ఔషధాలకు అనుమతులు లభించాయి. దిద్దుబాటు చర్యలు మూడు యూనిట్లకు జారీ చేసిన హెచ్చరికల లేఖపై స్పందించామని, యూఎస్ఎఫ్డీఏ సూచనల మేరకు తగు చర్యలు చేపట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. హెచ్చరికల తర్వాత గడువు విధించిన డిసెంబర్ 7లోగా వివరణ జారీ చేశామని, అంతే కాకుండా 45 రోజుల్లో చేపట్టిన దిద్దుబాటు చర్యలను తెలియచేస్తూ మరో లేఖ రాసినట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ త్వరలోనే మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలకు యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలు, ఆయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.