
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం జనవరిలో మందగించింది. ఎస్‌అండ్‌బీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్‌లో 58.5 వద్ద ఉండగా, జనవరిలో ఇది 57.2కి పడిపోయింది. అయితే సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ లెక్కనన వరుసగా 18 నెలల నుంచి సేవల రంగం అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది.
సేవలు–తయారీ కలిపినా మైనస్సే..
కాగా సేవలు– తయారీ రంగం కలగలిపిన బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జనవరిలో 57.2కు తగ్గింది. డిసెంబర్‌లో ఇది 58.5 వద్ద ఉంది. ఒక్క తయారీ ఇండెక్స్ జనవరిలో 55.4గా నమోదయ్యింది. డిసెంబర్‌లో ఈ సూచీ 57.8 వద్ద ఉంది.
చదవండి: అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
Comments
Please login to add a commentAdd a comment