న్యూఢిల్లీ: ఆర్థిక స్వేచ్ఛ సూచీ (ఈఎఫ్‌ఐ)లో ఉన్న 165 దేశాలలో భారతదేశం 2021లో ఒక మెట్టు దిగజారి 87వ స్థానానికి చేరుకుంది. 2020లో దేశం ర్యాంక్ 86. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్: 2021 వార్షిక నివేదికను న్యూఢిల్లీకి చెందిన ఆర్థిక విశ్లేషణా సంస్థ– సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రేజర్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసింది. కాగా, 1980 నుంచి చూస్తే భారత్‌కు సంబంధించి సూచీ 4.90 నుంచి గణనీయంగా 6.62కు పెరిగింది.
వివిధ విభాగాల్లో కొన్ని దేశాలతో పోల్చితే వెనకబడ్డం తాజాగా భారత్ ర్యాంక్ తగ్గుదలకు ఒక కారణం. కాగా, సింగపూర్ ఇండెక్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, అమెరికా, ఐర్లాండ్, డెన్మార్క్, ఆ్రస్టేలియా, బ్రిటన్, కెనడా ఉన్నాయి. చైనాకన్నా (111) భారత్ పరిస్థితి మెరుగ్గా ఉండడం గమనార్హం. జాబితాలో వెనుజులా చివరన నిలిచింది. ఇతర ముఖ్యమైన ర్యాంకింగ్స్‌లో జపాన్ (20), జర్మనీ (23), ఫ్రాన్స్ (47), రష్యా (104) ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, నియంత్రణలు, రుణం, కారి్మక రంగం, న్యాయ వ్యవస్థ, మోథో హక్కులు వంటి 10 అంశాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment