economic freedom
-
మీకు ఆర్థిక స్వేచ్ఛ ఉందా..?
సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బు సంపాదించడమే ఆర్థిక స్వేచ్ఛ అని చాలామంది భావిస్తుంటారు. కొందరు అప్పులు లేకుండా ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఇంకొందరు లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా భావిస్తారు. మంచి ఇల్లును సొంతం చేసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే ఖర్చుల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బు.. ఇందంతా ఒకింత ఆర్థిక స్వేచ్ఛేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తుల వ్యక్తిగత ఆదాయం, వయసు, జీవన శైలి, కోరికలు, అలవాట్లు ఇలా విభిన్న అంశాలపై ఆర్థిక స్వేచ్ఛ ఆధారపడుతుందని చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఏమేరకు స్వేచ్ఛగా ఉన్నారో నిత్యం బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు.వీటిపై ఓ కన్నేయండి..ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేకుండా ఖర్చులు అధికమవుతుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛకు దూరమవుతున్నారనే సంకేతాలు వస్తున్నట్లు గ్రహించాలి. నెలవారీ బడ్జెట్‌ను మించి చిన్న అత్యవసరం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉందంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. దీనివల్ల మీరు అనుకుంటున్న ఆర్థిక స్వేచ్ఛ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి సంకేతాలు వస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తిరిగి ఆర్థిక పరిస్థితిని గాడినపడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.అప్పులతో జాగ్రత్తప్రతి చిన్న కొనుగోలుకు అప్పు చేస్తుంటే మాత్రం పరిస్థితి దిగజారి పోతుందని గ్రహించాలి. అప్పులు ఉండకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చినా చాలా తక్కువగానే ఉండాలి. ప్రస్తుతకాలంలో ఈఎంఐ లేకుండా ఏదీ కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్ని ఈఎంఐలు కలిపి ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. బయట అప్పులు తీసుకొస్తే మాత్రం వెంటనే వాటిని తీర్చేయాలి. ఎందుకంటే అప్పు చెల్లింపులు జాప్యం చేస్తున్న కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది.అత్యవసర నిధి ఉందా..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు, అప్పుల వాయిదాలు, ఈఎంఐలు.. వంటి వాటిని భరించడం కష్టం. కాబట్టి ముందుగానే దాదాపు ఆరు నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిన్న మొత్తంతోనైనా ప్రారంభించి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం సాగాలి.ఇదీ చదవండి: సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?కుటుంబానికి ఆర్థిక భరోసాప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మీ కుటుంబం మీపైనే ఆధారపడి ఉంటే మీ తదనంతరం వారికి ఆర్థిక భారం మోపకుండా మంచి టర్మ్పాలసీను ఎంచుకోవాలి. మీరులేని లోటును ఎవరూ మీ కుటుంబానికి తీర్చలేరు. కనీసం కొంతవరకు ఆర్థిక వెసులుబాటు కల్పించి రోడ్డునపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే జీవితబీమా తప్పనిసరి. -
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
ఆర్థిక స్వేచ్ఛ సూచీలో ఒక మెట్టు తగ్గిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక స్వేచ్ఛ సూచీ (ఈఎఫ్ఐ)లో ఉన్న 165 దేశాలలో భారతదేశం 2021లో ఒక మెట్టు దిగజారి 87వ స్థానానికి చేరుకుంది. 2020లో దేశం ర్యాంక్ 86. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్: 2021 వార్షిక నివేదికను న్యూఢిల్లీకి చెందిన ఆర్థిక విశ్లేషణా సంస్థ– సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. కాగా, 1980 నుంచి చూస్తే భారత్‌కు సంబంధించి సూచీ 4.90 నుంచి గణనీయంగా 6.62కు పెరిగింది. వివిధ విభాగాల్లో కొన్ని దేశాలతో పోల్చితే వెనకబడ్డం తాజాగా భారత్ ర్యాంక్ తగ్గుదలకు ఒక కారణం. కాగా, సింగపూర్ ఇండెక్స్‌లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, అమెరికా, ఐర్లాండ్, డెన్మార్క్, ఆ్రస్టేలియా, బ్రిటన్, కెనడా ఉన్నాయి. చైనాకన్నా (111) భారత్ పరిస్థితి మెరుగ్గా ఉండడం గమనార్హం. జాబితాలో వెనుజులా చివరన నిలిచింది. ఇతర ముఖ్యమైన ర్యాంకింగ్స్‌లో జపాన్ (20), జర్మనీ (23), ఫ్రాన్స్ (47), రష్యా (104) ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, నియంత్రణలు, రుణం, కారి్మక రంగం, న్యాయ వ్యవస్థ, మోథో హక్కులు వంటి 10 అంశాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
హీరోయిన్ కాకపోతే ప్రియాంక చోప్రా ఏం అయ్యేదో తెలుసా?
ప్రియాంకా చోప్రా ఏ విషయాన్ని ఆభరణంగా భావిస్తారు? అదృష్టం.. విధి గురించి ఆమె ఏం చెబుతారు? ... ఇవే కాదు.. జీవితంలో తాను పాటించే విషయాలు, కొన్ని జీవితసత్యాలను ఈ విధంగా చెప్పారామె. ► జీవితంలో కిందకు పడిపోవడం, తప్పులు చేయడం సహజమే. కానీ తప్పుల నుంచి నీ లోపాలను గ్రహించి నిన్ను నువ్వు మెరుగుపరచుకోవాలి. కానీ నీలా నువ్వు ఉండే స్వభావాన్ని మాత్రం కోల్పోకు. కిందపడినప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో పైకి లేవాలి. ► అదృష్టం, విధి.. రెండూ చేతిలో చేయి వేసుకుని తిరుగుతుంటాయని నేను అనుకుంటున్నాను. చదువుకునే రోజుల్లో నేను ఇంజినీర్‌ను కావాలనుకున్నాను. కానీ నా ఫొటోలను మా అమ్మ, నా తమ్ముడు మిస్ ఇండియా పోటీలకు పంపారు. అసలు ఆ పోటీ అంటే ఏమిటో కూడా అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత ఏ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను హీరోయిన్ని. ఇక నేను విధిని నమ్మకుండా ఎలా ఉండగలను? ► మనం ఎక్కువగా తోటివారి గురించే ఆలోచిస్తుంటాం. వారు చేసే ప్రతి పని వెనక ఏదోఒక ఎజెండా ఉందని తెగ ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనలను మానుకుందాం. ► జీవితం నీకు నిమ్మకాయలను ఇస్తే వాటితో నువ్వు ద్రాక్షరసం చేయడానికి ట్రై చేసి, తర్వాత నిశ్శబ్దంగా ఉండు. అంటే.. మనకు దక్కినవాటి నుంచి ఏదైనా అద్భుతం చేయడం అన్నమాట. ఆ తర్వాత ఆశ్చర్యపోవడం, ఈ అద్భుతం ఎలా జరిగిందా? అని ఆలోచించడం పక్కవారి పని. ► నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నిన్ను నువ్వు అంగీకరించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకు. ► మనం ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయలేం. కానీ శక్తివంచన లేకుండా వచ్చిన అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ► మన జీవితంలో దాగి ఉన్న మలుపులు మనల్ని ఏ క్షణాన ఎటు తీసుకుని వెళతాయో మనకు తెలియదు. అందుకే ఎప్పుడూ మన జాగ్రత్తల్లో ఉండాలి. మనం ప్రేమించినవారిని జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ► ఆత్మవిశ్వాసం, మన ప్రతిభపై నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఏదీ కష్టం కాదు. ► నా కుటుంబమే నా బలం, నా బలహీనత. ► నువ్వెంత సాధించగలవో ఎవరూ చెప్పరు. అది నువ్వే గుర్తించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ► ఆత్మవిశ్వాసమే నా ఆభరణం. దీన్నే నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ► నేను సాధించాలనుకున్నదాని కోసం ఎంతైనా కష్టపడతాను. లక్ష్యానికి చేరువగా ఉన్నాయి కదా అని షార్ట్‌కట్ రూట్స్‌ను పాటించి ప్రమాదాలను కొని తెచ్చుకోను. ► ఒంటరి ప్రయాణానికి భయపడకు. నీ విజయాలతో పాటు అపజయాలకూ నీవే బాధ్యత వహించు. ఒక మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నట్లయితే వారు వారికి నచ్చినట్లు తమ జీవితాన్ని జీవించగలరు అని మా అమ్మ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఎక్కడున్నా, ఏం చేసినా, వివాహం చేసుకున్నప్పటికీ మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలి. ఉపయోగించినా, ఉపయోగించకపోయినా మన దగ్గర డబ్బు ఉండాలి. మన దగ్గర డబ్బు ఉంటే జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల నుంచి కోలుకోగలం, ధైర్యంగా ఉండగలం. మరొకరి సహాయం లేకుండా మన కాళ్ల మీద మనం నిలబడగలం. -
జీఎస్టీతో ఆర్థిక స్వేచ్ఛ: అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులో భారత్‌కు ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గురువారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ నుంచీ అమల్లోకి రానున్న ఈ పరోక్ష పన్ను విధానం– దేశంలో అతిపెద్ద స్వేచ్ఛా, పారదర్శక మార్కెట్‌ను సృష్టిస్తుందని అన్నారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రతినిధులు నిర్వహించిన ఒక కార్యక్రమంలో రియలన్స్ గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ, తాజా పన్ను విధానం వల్ల దేశానికి పలు విధాలుగా ఉపయోగం కలుగుతుందని అన్నారు. ఒక దేశ చరిత్ర ఆర్థికవృద్ధికి దారితీసే క్షణాలు అరుదుగా వస్తాయని, జూన్ 30 అర్ధరాత్రి అటువంటి క్షణాల ముందు నుంచున్న మనం ఇందుకు ఎంతో గర్వపడాల్సి ఉంటుందని అంబానీ అన్నారు. -
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు
• గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా లింగ వివక్ష • ఇప్పటికీ మహిళలకు నిర్ణయాధికారాలు లేవు • కుటుంబాల్లో ఆడ, మగ పిల్లలిద్దరినీ సమానంగా చూడాలి • మహిళా పార్లమెంటులో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారికి ఆర్థిక స్వేచ్ఛ లభించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే స్థాయికి మహిళలు ఎదగాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటులో రెండో రోజైన శనివారం ఆమె మాట్లాడారు. శతాబ్దాల నుంచి మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇప్పటికీ నిర్ణయాధికారాలు వారికి ఉండడం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో వచ్చిన మహిళా రిజర్వేషన్ల వల్లే తాను జడ్జినయ్యానని చెప్పారు. స్త్రీ, పురుష సమాన త్వం గురించి వేదికలపై మాట్లాడుకుం టున్నా.. వాస్తవంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. పనిచేసే చోట వేధింపులు, సౌకర్యాల కొరత ఇబ్బందికరం గా ఉందన్నారు. తాను నగరంలో పుట్టలేదని, తన తండ్రి ఇంజనీరుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడంతో ప్రభుత్వ స్కూళ్లలోనే చదివానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తానిక్కడ ఉండడానికి తన కుటుంబమే కారణమని చెప్పారు. తన తల్లితండ్రులు తనను, తన అన్నదమ్ములను వేర్వేరుగా చూడలేదన్నారు. కుటుంబాల్లో ఆడ, మగపిల్లలిద్దరినీ సమానంగా చూడాలని సూచించారు. ప్రతి విద్యార్థికి తల్లే మొదటి గురువని చెప్పారు. ఐక్యరాజ్య సమితితో ఒప్పందం ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంతో ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం సహకారం అందించనుంది. ఈ సందర్భంగా సమితి మహిళా విభాగం ప్రతినిధి ఆసా టొర్కెలెన్స్ మాట్లాడుతూ.. స్త్రీ పురుష సమానత్వంతోనే సమాజాలు ఆర్థికంగా వృద్ధి చెందుతాయని, లింగ వివక్ష ఉన్న సమాజాలు వృద్ధి చెందలేవన్నారు. çసదస్సులో ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. మహిళా శక్తిని వినియోగించుకోలేకపోయాం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మహిళలను ఒక శక్తిగా సద్వి నియోగం చేసుకోవడం లో విఫలమయ్యామని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. అన్ని రంగాల్లోనూ వారిని నిర్ణయాత్మక శక్తులుగా తీర్చిదిద్దాల్సి వుందన్నారు. మనిషికి జన్మనిచ్చే మహిళ చివరికి ప్రేక్షకురాలిగానే ఉండిపో తోందని, ఈ పరిస్థితి మారాలన్నారు. పనిచేసే చోట మహిళలపై అత్యాచారాలు దేశంలో మహిళలపై అరాచకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ ఎడిటర్ సాగరికా ఘోష్ అన్నారు. నిర్భయ కేసు తర్వాత రేప్ అనే పదం నిర్వచనమే మారిపోయిందని తెలిపారు. పనిచేసే చోట మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా మహిళల మిస్సింగ్ కేసులు భారత్‌లో ఎక్కువగా ఉంటున్నాయని, ఇది చాలా బాధాకరమన్నారు. అమెరికాలోనూ లింగవివక్ష ఉంది అమెరికాలోనూ ఇంకా లింగ వివక్ష ఉందని, ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్, ఏపీ సీఎం కోడలు నారా బ్రహ్మణి చెప్పారు. తన ఇంట్లో మహిళలకు గౌరవం ఇస్తారని, ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం, సీఎం చంద్రబాబు కోడలినవ్వడం గర్వించదగిందన్నారు. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందీ ఆయనే అన్నారు. శనివారం మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జస్టిస్ రోహిణికి జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో చక్రపాణి, గవర్నర్ నరసింహన్, కోడెల నిస్వార్థంగా సేవ చేసే గుణం మహిళలదే: డీకే అరుణ సాక్షి, అమరావతి: సమాజంలో నిస్వార్థంగా సేవ చేసే గుణం ఒక్క మహిళకే దక్కుతుందని మాజీ మం త్రి, ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శనివారం మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరై ఆమె ప్రసంగిం చారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న ప్పటికీ మహిళగా రాజకీయాల్లో విజయవంతంగా ముందుకెళ్తు న్నానన్నారు. ప్రతి ఒక్క మహిళా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని కోరారు. మహిళలు రాజకీయాల్లో ముందు వరుసలో ఉన్నప్పటికీ హింస తగ్గలేదని పేర్కొన్నారు. మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం ఇంకా రాలేదన్నారు. పొగడ్తలు సరే.. రిజర్వేషన్లు కల్పించండి: అల్కా లాంబా సాక్షి ప్రత్యేక ప్రతినిధి–అమరావతి: ‘‘మహిళలు దేవతా స్వరూపులనీ, మహాలక్షు్మలని, ఆదిశక్తులని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాశానికెత్తేస్తే సరిపోదు.. ప్రధాని మోదీకి చెప్పి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేయాలి’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ (చాందినీ చౌక్) ఎమ్మెల్యే అల్కా లాంబా డిమాండ్ చేశారు. మహిళా పార్లమెంటు సదస్సు రెండో రోజు ‘మీరే హీరోలు’ (బీ యువర్ ఓన్ హీరోస్) అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ తొలి రోజు సమావేశాల్లో వెంకయ్య చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూనే చురకలంటించారు. పోరాడండి, సాధించుకోండి! కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోస్ (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘భారతీయ మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మనకు ఏదీ బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వరు. అత్యున్నత స్థాయికి చేరేందుకు పోరాటం చేయాలి. చదువే ఇందుకు ఆయుధం. చదవండి, పోరాడండి. అత్యున్నత స్థాయికి చేరండి’’ అని కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జోస్ చెర్నో లబోసో పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ నియామకాల్లో ఇప్పటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, చట్టసభల్లో అమలు చేయడమే తమ ముందున్న సమస్య అని డాక్టర్ జోస్ పేర్కొన్నారు. సత్తా నిరూపించుకోవాలి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘హనుమంతుడి మాదిరే మహిళలకున్న శక్తి ఏమిటో వాళ్లు తెలుసుకోవాలి. వాళ్ల సత్తాను నిరూపించుకోవాల్సిన సమయమి దే..’ అని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అభిప్రాయపడ్డారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో సమాజం వారి కి అండగా నిలవాలన్నారు. మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహిళా పార్లమెంటు లో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రస్తుత పార్లమెంటులో 400 మందైనా మహిళలు ఉండాలని చెప్పారు. -
డైవర్సీని పెళ్లాడే ముందు...
విడాకులు ఈ దేశంలో ఒకప్పుడు నిషేధిత పదం. ఇపుడు మారుమూల పల్లెలకు కూడా పరిచయం. సమంజసమైన కారణముంటే విడిపోవడం పాపం, నేరం కానేకాదు. అయితే, ప్రపంచీకరణ వల్ల కావచ్చు, మితిమీరిన ఆర్థిక స్వేచ్ఛ వల్ల కావచ్చు, లేదా మరేదైనా కారణం కావచ్చు కాని విడాకులు బాగా పెరిగిపోయాయి. విడాకుల అనంతరం జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడానికి దాదాపు ఎవరూ ఇష్టపడరు. మరి తప్పు పునరావృతం కాకూడదంటే ఏం చేయాలి? విడాకులు తీసుకున్న మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అసలు చేసుకోవచ్చా? విడాకులు తీసుకోవడం అంటే మానసిక బంధాన్ని అధికారికంగా విడగొట్టడమే. కానీ, 498ఎ, గృహహింస చట్టాలు వచ్చాక వీటిని దుర్వినియోగం చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో విడాకులు తీసుకున్న వారికి మళ్లీ పెళ్లి అనేక ఆటంకాలతో కూడినది. ప్రతి అమ్మాయినీ అనుమానిస్తున్నారు. అయితే, తెలుసుకోకుండా నిందలేయొద్దు. నిజానిజాలు తెలుసుకుంటే డైవర్సీని పెళ్లి చేసుకున్నా హాయిగా జీవితం గడపొచ్చు. విడాకులకు గొడవ కారణం కావచ్చు, చెడు ప్రవర్తన, మర్యాద లేకపోవడం, దుబారా మనిషి కావడం, భాగస్వామిని సరిగా చూసుకోకపోవడం వంటి కారణాలెన్నో ఉంటాయి. వీటిలో కొన్ని కారణాలతో విడిపోయిన వారిని మళ్లీ చేసుకుంటే ఆ కుటుంబంలో కూడా మళ్లీ కలతలు, విడాకులకే అవకాశం ఉంటుంది. మరలాంటపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. విడిపోయిన జంటల్లో ఎక్కువగా ఒకరిమీద ఒకరు అబాంఢాలు వేస్తుంటారు. ఎవరిది నిజమనేది కొత్తవారికి తెలియదు కాబట్టి ఎవరికి అనుకూలంగా వారు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి డైవర్సీ మహిళ చెప్పే బాధాతప్త కథనానికి కరిగిపోయి పెళ్లికి ఓకే చెప్పకుండా... కాస్త ఆలోచించాలి. కోర్టు విడాకుల పత్రాలను పరిశీలించాలి. విడిపోవడానికి కారణాలు ఆ పత్రాల ద్వారానో, లాయర్ ద్వారానో ఏదో విధంగా తెలుసుకోవాలి. కోర్టులో చెప్పిన కారణం నిర్ధారణ చేసుకున్న తర్వాత చేసుకోబోయే అమ్మాయిని రెండు మూడు సార్లు కలవాలి. ఆమెలో పాత జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే అవి కొత్త సంసారాన్ని పాడు చేసే అవకాశం ఎక్కువ. అమ్మాయి కూడా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాకుండా రెండో పెళ్లికి సిద్ధం కావడం మంచిది కాదు.మ్యూచువల్ డైవర్స్ అని చెబితే వెంటనే నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకసారి విడాకుల కేసు ఫైలయ్యాక యువతి కుటుంబంపై అనేకమంది ప్రభావం ఉంటుంది. వారి మాట విని ఎక్కువ కాలం కేసును వాయిదా వేయించడం, లాగడం ద్వారా ‘ఫైనాన్షియల్ సెటిల్మెంట్’ కోసం చూస్తారు. అంటే ప్రతి మ్యూచువల్ డైవర్స్ ఇద్దరి పరస్పర సహకారం వల్లే అయిందని నమ్మకూడదు. కొన్ని పరస్పర ‘ఆర్థిక’ ఒప్పందాలతో రాజీ వల్ల జరిగినవి కూడా ఇక్కడ మ్యూచువల్ కిందే పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ అమ్మాయి గతంలో ఆర్థిక వేధింపులకు పాల్పడింటే అది తెలుసుకోవడం ముఖ్యం. ఎంత టైంలో విడాకులు మంజూరయ్యాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎలాంటి లిటిగేషన్లు లేని విడాకుల కేసు ఏడాదిలోపే సెటిలవుతుంది. అంతకంటే ఎక్కువ సమయం పడితే కాస్త అనుమానించాల్సిందే. అయితే, అది అబ్బాయి తప్పా-అమ్మాయి తప్పా తేల్చుకోవాలి. అమ్మాయి తప్పయితే ఆ సంబంధం జోలికి వెళ్లొద్దు. అదే పునరావృతం కాదని గ్యారంటీ ఏంటి? ఇండియాలో నమోదవుతున్న గృహహింస, వరకట్న కేసుల్లో అత్యధిక కేసులు తప్పుడు కేసులని అనేక ప్రభుత్వ రిపోర్టులు స్పష్టంచేశాయి. భార్య మీద కేసులు పెట్టేందుకు భర్తల కోసం ఇండియాలో ఏ ప్రత్యేక సెక్షను లేదు. కానీ భార్యలకు పదమూడు రకాల ఐపీసీ సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విడాకులు తీసుకున్న మహిళ తన పూర్వపు భాగస్వామిపై ఎన్ని కేసులు ఫైల్ చేసిందో తెలుసుకోవాలి. వీలైతే ఆ పోలీస్ స్టేషన్లో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ కేసుల్లో డబ్బులు లాగాలని చూసిన వారికి దూరంగా ఉండటం మంచిది. పెళ్లి చేసుకున్నాక....! - పాత జ్ఞాపకాలు ప్రస్తుత భాగస్వామి వద్ద ప్రస్తావించడం సమంజసం కాదు. - మునుపటి భాగస్వామితో పోలిక అతిపెద్ద ముప్పు. - వ్యక్తులు వేర్వేరు అయినపుడు అలాంటి అవే లక్షణాలు, సహకారం కోరుకోవడం తప్పు. - పాత అనుభవాలతో అయినా పరస్పర సహకారం, గౌరవం కలిగి ఉండాలి. - పిల్లలకు తెలివొచ్చాక రెండో పెళ్లి చేసుకుంటే కొత్త వ్యక్తిని పిల్లలు పేరెంట్‌గా స్వీకరించడం దాదాపు కష్టం. కాబట్టి వారిని అర్థం చేసుకుని కొన్ని భరించాల్సి ఉంటుంది.