న్యూఢిల్లీ: భారత్‌ను అంతరిక్ష రంగంలో అగ్రదేశాల సరసన నిలిచేందుకు ఇస్రో ఎంతగానో కృషి చేసింది. పలు మైలురాళ్లను జయించి భారత్‌ను అంతరిక్షరంగ చరిత్రపుటల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఇస్రో నెలకొల్పింది. ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థ తెలిసిన విషయమే.. స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తే మరిన్ని విజయాలను సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంతరిక్షరంగంలోకి ప్రైవేటు కంపెనీలు భవిష్యత్తులో రానున్నాయి.
ప్రైవేటు సంస్థలు రాకెట్ ప్రయోగాలను, లాంచింగ్ స్టేషన్లను దేశ భూభాగంలో లేదా ఇతర దేశాల్లో ప్రయోగాలను చేసే వెసులబాటును కేంద్రం ప్రభుత్వం కల్పించనుంది. కేంద్ర అంతరిక్ష మంత్రిత్వ శాఖ (డీవోఎస్) ఆధీనంలోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనే స్వతంత్ర సంస్థ నుంచి ప్రైవేటు సంస్థలు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-2020 పేరుతో తెచ్చిన ముసాయిదాలో ప్రైవేటు కంపెనీలు రాకెట్ ప్రయోగాల కోసం లాంచింగ్ స్టేషన్లను సొంతంగా, లేదా లీజు ద్వారా భూమిని సేకరించుకోవచ్చునని తెలిపింది.
ఈ ముసాయిదాపై ప్రముఖ భారత ప్రైవేటు కంపెనీలు అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఎరోస్పేస్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. కేంద్ర తెచ్చిన ముసాయిదాతో రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన స్టేషన్లను, లాంచింగ్ ప్యాడ్‌లను సులువుగా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉందని కంపెనీలు పేర్కొన్నాయి. అగ్నికుల్ కాస్మోస్ చిన్న ఉపగ్రహలను భూ నిర్ణీత కక్ష్యలోకి ప్రయోగిస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ చిన్నచిన్న రాకెట్ నౌకలను తయారు చేస్తోంది.
భారత అంతరిక్షరంగంలోకి ప్రైవేటు కంపెనీలు..!
Published Sun, Jun 27 2021 9:57 PM | Last Updated on Sun, Jun 27 2021 10:00 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment