బీమా పాలసీదారులకు శుభవార్త. ఇస్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డిఎఐ), జీవిత బీమా కంపెనీల ముందు కొత్త ముసాయిదా మార్గదర్శకాలను ఉంచింది. ఐఆర్‌డిఎఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. ముందస్తుగా ప్రీమియంలు చెల్లించే వారికి రాయితీలు లేదా వడ్డీ చెల్లిచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీమా సంస్థలతో చర్చించింది. అనేక మంది వివిధ రకాల కారణాలతో ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను గడువులోగా చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. దీని వల్ల కొన్నిసార్లు మధ్యలోనే పాలసీ రద్దు చేసుకునే అవకాశం ఉంది. అందుకోసమే పాలసీదారులు గడువు కన్నా ముందుగానే ప్రీమియంలు చెల్లించేలా ప్రోత్సహించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలిపింది. దానిలో భాగంగానే సకాలంలో చెల్లించిన వారికీ రాయితీలు ఇవ్వాలని ఐఆర్‌డిఎఐ పేర్కొంది. దీనివల్ల ఇరువురికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై ముసాయిదా సర్క్యులర్ విడుదల కానుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment