ప్రపంచంలోని అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ డియాజియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,భారత సంతతి చెందిన ఇవాన్ మెనెజెస్ ఇక లేరు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాలనుకుంటున్న 64 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ మెనెజెస్ లండన్‌లో (బుధవారం జూన్ 7) కన్నుమూశారు.
రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీతోపాటు, పలువరు ప్రముఖులు, కంపెనీ సహచరులు ఇవాన్ మరణంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కడుపులో అల్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అత్యవసర శస్త్రచికిత్స తర్వాత, ఏర్పడిన సమస్యల కారణంగా ఇవాన్ కోలుకోలేకపోయారని డియా జియో ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశంలోని పూణేలో పుట్టారు ఇవాన్.తండ్రి, మాన్యువల్ మెనెజెస్, భారతీయ రైల్వే బోర్డు అధిపతి. ఇవాన్ మెనెజెస్ తన చదువుల కోసం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీతో పాటు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యనభ్యసించారు.
1997నుంచి మెనెజెస్ డియాజియోలో కీలక వ్యక్తిగా ఉన్నారు. భారీగా ఆదాయాన్ని పెంచడంతోపాటు, అనేక బ్రాండ్స్‌తో విజయవంతంగా నడిపించారు. 2012 జూలైలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, 2013 జూలైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైనారు. అయితే అనారోగ్యం కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.(ఐవోఎస్ 17 అదిరిపోయే అప్‌డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం
మెనెజెస్ తన పదవీ కాలంలో సాధించిన విజయాలను గుర్తిస్తూ ఇటీవల జారీప్రకటనలో "ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన, విశ్వసనీయమైన ,గౌరవనీయమైన వినియోగదారు ఉత్పత్తి కంపెనీలలో ఒకటిగా అవతరించడం లక్ష్యంగా డియాజియో పురోగతి సాధించిందంటూ మెనెజెస్‌ను అభింనందించింది. ఇవాన్ నాయకత్వంలో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసిందని, ఫలితంగా 180 కంటే ఎక్కువ మార్కెట్లలో 200 బ్రాండ్‌లను విక్రయిస్తోందనీ, స్కాచ్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, కెనడియన్ విస్కీ, లిక్కర్లు టెక్విలాలో నికర అమ్మకాల విలువలో నంబర్ వన్ కంపెనీగా ఉందపి మార్చి 28 ప్రకటనలో పేర్కొంది.
జానీ వాకర్ విస్కీ, టాంక్వెరే జిన్, డాన్ జూలియో టేకిలా వంటి బ్రాండ్‌లకు పేరు గాంచింది డియాజియో. జూన్ 2023 నాటికి డియాజియో మార్కెట్ వాల్యుయేషన్ 96.16 బిలియన్ డాలర్లు. మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలో 144వ అత్యంత విలువైన సంస్థ డియాజియో.
Comments
Please login to add a commentAdd a comment