Diageo
-
అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో,భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు
ప్రపంచంలోని అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ డియాజియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,భారత సంతతి చెందిన ఇవాన్ మెనెజెస్ ఇక లేరు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాలనుకుంటున్న 64 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ మెనెజెస్ లండన్‌లో (బుధవారం జూన్ 7) కన్నుమూశారు. రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీతోపాటు, పలువరు ప్రముఖులు, కంపెనీ సహచరులు ఇవాన్ మరణంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కడుపులో అల్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అత్యవసర శస్త్రచికిత్స తర్వాత, ఏర్పడిన సమస్యల కారణంగా ఇవాన్ కోలుకోలేకపోయారని డియా జియో ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని పూణేలో పుట్టారు ఇవాన్.తండ్రి, మాన్యువల్ మెనెజెస్, భారతీయ రైల్వే బోర్డు అధిపతి. ఇవాన్ మెనెజెస్ తన చదువుల కోసం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీతో పాటు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యనభ్యసించారు. 1997నుంచి మెనెజెస్ డియాజియోలో కీలక వ్యక్తిగా ఉన్నారు. భారీగా ఆదాయాన్ని పెంచడంతోపాటు, అనేక బ్రాండ్స్‌తో విజయవంతంగా నడిపించారు. 2012 జూలైలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, 2013 జూలైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైనారు. అయితే అనారోగ్యం కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.(ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం మెనెజెస్ తన పదవీ కాలంలో సాధించిన విజయాలను గుర్తిస్తూ ఇటీవల జారీప్రకటనలో "ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన, విశ్వసనీయమైన ,గౌరవనీయమైన వినియోగదారు ఉత్పత్తి కంపెనీలలో ఒకటిగా అవతరించడం లక్ష్యంగా డియాజియో పురోగతి సాధించిందంటూ మెనెజెస్‌ను అభింనందించింది. ఇవాన్ నాయకత్వంలో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసిందని, ఫలితంగా 180 కంటే ఎక్కువ మార్కెట్లలో 200 బ్రాండ్లను విక్రయిస్తోందనీ, స్కాచ్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, కెనడియన్ విస్కీ, లిక్కర్లు టెక్విలాలో నికర అమ్మకాల విలువలో నంబర్ వన్ కంపెనీగా ఉందపి మార్చి 28 ప్రకటనలో పేర్కొంది. జానీ వాకర్ విస్కీ, టాంక్వెరే జిన్, డాన్ జూలియో టేకిలా వంటి బ్రాండ్లకు పేరు గాంచింది డియాజియో. జూన్ 2023 నాటికి డియాజియో మార్కెట్ వాల్యుయేషన్ 96.16 బిలియన్ డాలర్లు. మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలో 144వ అత్యంత విలువైన సంస్థ డియాజియో. -
40 మిలియన్ డాలర్లూ తిరిగివ్వండి
మాల్యాకు డియాజియో డిమాండ్ లండన్/న్యూఢిల్లీ: యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగే డీల్‌లో భాగంగా చెల్లించిన 40 మిలియన్ డాలర్లను తమకు వాపస్ చేయాలని వ్యాపారవేత్త విజయ్ మాల్యాను డియాజియో కోరింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నష్టపరిహారం కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సర ప్రాథమిక ఫలితాల వెల్లడి సందర్భంగా డియాజియో ఈ విషయాలు పేర్కొంది. రుణ సంక్షోభంతో మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ప్రమోటర్ కూడా అయిన మాల్యా... ప్రస్తుతం ఉద్దేశపూర్వక ఎగవేతదారు ఆరోపణలతో బ్రిటన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి తప్పుకుంటున్నందుకు గాను మాల్యాకు డియాజియో 75 మిలియన్ డాలర్లు ఇచ్చేలా గతంలో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2016 ఫిబ్రవరి 25న 40 మిలియన్ డాలర్లు చెల్లించిన కంపెనీ.. మిగతా 35 మిలియన్ డాలర్లను ఏటా 7 మిలియన్ డాలర్ల చొప్పున అయిదేళ్లు చెల్లించాల్సి ఉంది. అయితే, మాల్యా నిబంధనలను ఉల్లంఘించడంతో మిగతా చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు డియాజియో పేర్కొంది. -
చిన్న ఇన్వెస్టర్లకూ పరిహారం!
తాజా ఓపెన్ ఆఫర్‌కు త్వరలో సెబీ ఆదేశాలు న్యూఢిల్లీ: రుణ ఎగవేతలతో బ్యాంకులను ముంచేసిన విజయ్ మాల్యాపై స్టాక్‌మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొరఢా ఝలిపిస్తోంది. గతంలో యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్, బోర్డు పదవుల నుంచి వైదొలగడం కోసం బ్రిటన్ కంపెనీ డియాజియోతో కుదుర్చుకున్న 75 మిలియన్ డాలర్ల డీల్‌కు సంబంధించి అవకతవకలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ డీల్ కారణంగా యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్)లో చిన్న ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లిందన్న ఆందోళనల నేపథ్యంలో సెబీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. తాజా ఓపెన్ ఆఫర్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లకు అదనంగా చెల్లించాలంటూ డియాజియోను త్వరలో సెబీ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. కాగా, యునైటెడ్ స్పిరిట్స్ నుంచి నిధులను అక్రమంగా దారిమళ్లించిన ఆరోపణలపై మాల్యాతోపాటు మరో ఆరుగురిని సెక్యూరిటీస్ మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ బుధవారం నిషేధం విధించడం తెలిసిందే. అదేవిధంగా మల్యా, యునైటెడ్ స్పిరిట్స్ మాజీ ఎండీ అశోక్ కపూర్‌ను లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్ పదవులేవీ చేపట్టకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటాను 2012లో డియాజియోకు విక్రయించడంతో నియంత్రణ మొత్తం ఆ కంపెనీ చేతికి వెళ్లిపోయింది. అయితే, బోర్డు, చైర్మన్ పదవి నుంచి మాత్రం వైదొలిగేందుకు మల్యా నిరాకరించారు. దీంతో మాల్యాతో కుదుర్చుకున్న సెటిల్మెంట్ మేరకు ఆయనకు 75 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు డియాజియో ఒప్పందం కుదుర్చుకుంది. ఆతర్వాత మాల్యా యూఎస్ఎల్ నుంచి పూర్తిగా వైదొలిగారు. అయితే, ఈ డీల్ కారణంగా యూఎస్ఎల్ కొత్త ప్రమోటర్లయిన డియాజియోకు భారీగా యాజమాన్య ప్రయోజనాలు లభించాయని, అదేవిధంగా పాత ఓనర్ మాల్యాకు కూడా పెద్దమొత్తంలో లాభం చేకూరినట్లు దర్యాప్తులో సెబీ తేల్చింది. చిన్న(మైనారిటీ) వాటాదారులకు మాత్రం దీనివల్ల నష్టం వాటిల్లిందన్న అంచనాకు వచ్చింది. దీంతో తాజా ఓపెన్ ఆఫర్ద్వారా ఇన్వెస్టర్లకు అదనపు చెల్లింపు చేయాలని త్వరలో ఆదేశించే అవకాశాలు ఉన్నాయని సెబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సెబీ నిషేధంపై మాల్యా ఉక్రోషం... సెబీ నిషేధంపై మాల్యా తీవ్ర ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. యూఎస్ఎల్ నుంచి నిధులు మళ్లింపు ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. తాజా పరిణామాలపై ఆయన ట్వీటర్లో వరుసపెట్టి అనేక ట్వీట్లు చేశారు. ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి నిధులను మళ్లించానని సీబీఐ ఆరోపిస్తోంది. మరోపక్క, యూఎస్ఎల్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్లోకి నిధులను మళ్లించారనేది సెబీ ఆరోపణ. ఇది జోక్ కాకపోతే మరేంటి?’ అని మల్యా ట్వీట్ చేశారు. చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తనను ప్రభుత్వంతో పాటు అన్నివైపుల నుంచి వెంటాడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘30 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ, భారత్‌లో అతిపెద్ద బ్రూవింగ్ కంపెనీతో పాటు అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పా. దీనికి నాకు లభించిన ప్రతిఫలం ఇది’ అంటూ మల్యా మరో ట్వీట్ చేశారు. బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగానే రుణ ఎగవేతల కేసుల్లో చిక్కుకున్న మాల్యా.. లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
మాల్యా కేసులో మా ఆర్డర్ ఫలించలేదు
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయమాల్యాతో బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో ఒప్పందం మేరకు అతనికి తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను నిలిపివేయాలన్న రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు వ్యర్థమయ్యాయని డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) సీఆర్ బెనకనహళ్లి తెలిపారు. మార్చి 7 న జారీచేసిన ఈ ఆదేశాలకు ముందే సదరు మొత్తం మాల్యా బ్యాంక్ ఖాతాలో జమఅయ్యాయని వెల్లడించారు. ముంబై సర్వీస్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. మార్చి 7 ట్రిబ్యునల్ ఆర్డర్ కంటే చాలా ముందుగానే బదిలీ జరగడంతో తమ ఆదేశాలు ఫలించలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం మాల్యా ఖాతాలోఆ సొమ్ము మొత్తం జమ అయ్యాయన్నారు. అలాగే ట్రిబ్యునల్ నిబంధనలు, షరతులు ప్రకారం , మిగిలిన 35 మిలియన్ డాలర్ల చెల్లింపును నిలిపివేయమని ఆదేశించలేమన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వారి ఒప్పందం అమల్లో ఉంటుంది గనుక అటు మాల్యాకు గానీ, డియాజియో కు ఈ తరహా ఆదేశాలివ్వలేమని బెనకనహళ్లి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలోరుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని బ్యాంకులకు మొట్టికాయలు వేసిన బెనహనకల్లి తాజాగా టాక్స్ డిపార్ట్ మెంట్ వైఖరిని కూడా దుయ్యబట్టారు. ఎటాచ్ చేయబడిన మాల్యా స్థిర,చరాస్తులను ఎందుకు విక్రయించలేదని సేవా పన్ను శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇల్లు, విమానం, హెలికాప్టర్లు అమ్మకం ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఇవాల్టికి(14 జూలై గురువారం) వాయిదా వేశారు. డియోజియో కంపెనీమాల్యాకు చెల్లించాల్సిన ఒప్పంద మొత్తాన్ని చెల్లించవద్దని ఇటివల డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఒప్పందాన్నిప్రకారం ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది.ఈ నేపథ్యంలోఆ చెల్లింపులను నిలిపివేయాలని డియోజియోను డీఆర్ టీని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు రూ.270 కోట్లు చెల్లించొద్దు..
డియాజియోకు డీఆర్టీ ఆదేశం బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయల రుణ ఎగవేత ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియోతో ఒప్పందం మేరకు ఆయనకు తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను చెల్లించవద్దని ఆ కంపెనీని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) మంగళవారం ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు సంబంధించిన సంస్థ వాట్సన్ లిమిటెడ్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన షేర్లను ట్రిబ్యునల్‌కు అటాచ్ చేయాల్సిందిగా డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహల్లి ఆదేశించారు. బ్యాంకులకు మొట్టికాయలు... మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి మాల్యా నిరాకరించారు. దీంతో కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఆయనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది. ఈ నేపథంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, డియాజియోతో మల్యా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మీకు తెలిసినప్పటికీ.. ఆ సొమ్ముకు సంబంధించిన లావాదేవీలు తెలుసుకోవడం, తగిన చర్యలు చేపట్టడం వంటివి ఎందుకు చేయలేదని బ్యాంకర్లను బెనహనకల్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని కూడా ఆయన తప్పుబట్టారు. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు. -
డీఆర్టీ ఉత్తర్వుపై డియాజియో అభ్యంతరం
బెంగళూరు: రుణ ఎగవేత వివాదాన్ని ఎస్బీఐతో పరిష్కరించుకునే దాకా లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెల్లించాల్సిన 75 మిలియన్ డాలర్లను విడుదల చేయవద్దని తనకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాలపై బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం- డియాజియో మంగళవారం తన అభ్యంతరాలను దాఖలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకుగాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడిం ది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్టీని ఆశ్రయించింది ఎస్బీఐ. దీనికి సానుకూల రూలింగ్‌ను డీఆర్టీ గతనెల్లో జారీ చేసింది. దీనిపై తాజాగా డియాజియో, దాని అనుబంధ రెండు కంపెనీలు తమ తరఫు అభ్యంతరాలను దాఖలు చేశాయి. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా పడింది. -
మాల్యా ఒప్పందం పరిశీలనలో డయాజియో
న్యూఢిల్లీ/లండన్: యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్ఎల్) చైర్మన్ హోదా నుంచి విజయ్ మాల్యాను తప్పించేందుకు కసరత్తు చేస్తున్న డయాజియో గతంలో ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తోంది. మాల్యా, ఆయనకు చెందిన యూబీ గ్రూప్ పట్ల నిర్వర్తించాల్సిన విధులను పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒప్పందం ప్రకారం యూఎస్ఎల్ చైర్మన్‌గా తనను కొనసాగించేందుకు డయాజియో మద్దతు పలికి తీరాల్సిందేనని మాల్యా చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎగవేతల్లాంటివేవీ లేకపోతేనే ఒప్పంద నిబంధనలు వర్తిస్తాయని యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటాలున్న డయాజియో తెలిపింది. ఈ నేపథ్యంలోనే డీల్ విధివిధానాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తదితర అనుబంధ సంస్థలకు అక్రమంగా నిధుల (రూ.1,337 కోట్లు) మళ్లించారన్న ఆరోపణల మీద యూఎస్ఎల్ చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి మాల్యాను తప్పించేందుకు డయాజియో చర్యలు ప్రారంభించింది. యూబీ షేర్ల పతనం: యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్‌గా విజయ్ మాల్యా వైదొలగాలన్న డిమాండ్ నేపథ్యంలో యునెటైడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు చెందిన వివిధ షేర్లు సోమవారం పతనమయ్యాయి. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడం లేని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ షేర్ ధర కూడా తగ్గిపోయింది. -
యూబీ రుణాలపై డియాజియో దర్యాప్తు
ముంబై: యూబీ గ్రూప్ కంపెనీలకు యునెటైడ్ స్పిరిట్స్ అందించిన రుణాలపై దర్యాప్తునకు యూకే దిగ్గజం డియాజియో నిర్ణయించడంతో ఈ కంపెనీ షేరు 5% పతనమైంది. బీఎస్ఈలో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 2,279 వద్ద ముగిసింది. ఒక దశలో దాదాపు 7% దిగజారి రూ. 2,226 వద్ద కనిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో 4% వరకూ క్షీణించి రూ. 2,300 వద్ద నిలిచింది. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి 2 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. డియాజియో ఇటీవల యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వెరసి గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై దర్యాప్తునకు యునెటైడ్ స్పిరిట్స్ బోర్డ్ ద్వారా తాజాగా ఆదేశించింది. కాగా, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నష్టాల నేపథ్యం గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 4,489 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. వీటిలో రూ. 1,013 కోట్లను డౌట్ఫుల్ రుణాలుగా చూపించగా, స్కాటిష్ అనుబంధ సంస్థ వైట్ అండ్ మెకే విక్రయానికి సంబంధించి రూ. 3,236 కోట్ల ప్రత్యేక నష్టాన్ని యునెటైడ్ స్పిరిట్స్ నమోదు చేసింది. తాజాగా కంపెనీ బోర్డు ఈ అంశాలపై దర్యాప్తును చేపట్టనుంది. దీనిలో భాగంగా కంపెనీ అధికారులు, సలహాదారులను ప్రశ్నించనున్నట్లు డియాజియో తెలిపింది. పూర్తిస్థాయి అనుబంధ సంస్థలకు సంబంధించి 2013 మార్చి31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న రుణాలు, డిపాజిట్లు తదితర అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనున్నట్లు కంపెనీ బోర్డ్ తెలిపింది. -
ఐడీబీఐ బ్యాంక్‌కు సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుకు ఎంక్వైరీ నోటీసు జారీ చేసింది. ఆర్థిక భారంతో సర్వీసులు నిలిచిపోయిన విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రూ.950 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంతభారీ మొత్తం రుణం మంజూరు చేయడంలో విశ్వసనీయత కొరవడిందన్నది సీబీఐ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నెట్‌వర్త్ ప్రతికూలంగా ఉన్నప్పుడు రూ.950 కోట్ల భారీ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఎలా మంజూరు చేసిందో తేలాల్సి ఉందని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇందుకోసమే ప్రాథమిక విచారణ (పీఈ)కు నోటీసులు జారీ అని తెలిపారు. వివరణ పంపుతాం: బ్యాంక్ సీఎండీ కాగా తాజా వ్యవహారంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్ వివరణ ఇచ్చారు. ‘‘దీని గురించి సమాచారం అంతా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సీబీఐ కోరింది. వాటికి మేము రానున్న కొద్ది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా ఈ తరహాలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరడం జరిగింది. బ్యాంకు కూడా సమాధానాలు పంపింది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. కన్సార్షియం లేదా మల్టిప్లై బ్యాంకింగ్‌లో భాగంగా రుణాలను బ్యాంక్ సమకూర్చింది’’ అని ఆయన అన్నారు. సిండికేట్ బ్యాంక్ నేపథ్యం... ప్రాధాన్యత నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల రుణ పరిమితి పెంచేందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్‌తో పాటు మరో ఏడుగురి అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సీబీఐ తాజా నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. భూషణ్ స్టీల్ కంపెనీ సిండికేట్ బ్యాంకుకు కోట్లాది రూపాయల రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించకపోయిన్పటికీ ఆ కంపెనీ రుణ పరిమితిని పెంచేందుకు రూ.50 లక్షల కోసం సంప్రదింపులు జరుపుతున్న జైన్‌ను సీబీఐ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో పాలనాపరమైన కొన్ని సమస్యలున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలి పాలసీ విధాన ప్రకటన సందర్భంలోనూ పేర్కొన్నారు. రుణాల మంజూరులో మరింత పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలన వ్యవస్థపై మరోమారు దృష్టిసారించి లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. రుణ బకాయిల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ 2012 అక్టోబర్ నుంచీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల బృం దానికి కేఎఫ్ఏ దాదాపు రూ.7,000 కోట్ల బకాయి ఉంది. దీనిలో ఎస్బీఐ వాటా దాదాపు 1,600 కోట్లు.