నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..! | Market ends lower in a highly volatile session | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Published Wed, Feb 16 2022 4:11 PM | Last Updated on Wed, Feb 16 2022 4:12 PM

Market ends lower in a highly volatile session - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమ నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్​ సెషన్​లో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. ఆఖరి గంటలో నష్టాల్లోకి జారుకున్నాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఓ దశలో​ 350 పాయింట్లకుపైగా కోల్పోయింది. చివర్లో మళ్లీ పుంజుకుంది. చివరలో, సెన్సెక్స్ 145.37 పాయింట్లు(0.25%) క్షీణించి 57,996.68 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 30.30 పాయింట్లు (0.17%) నష్ట పోయి 17,322.20 వద్ద ముగిసింది.

ఉక్రెయిన్​- రష్యా సంఘర్షణ ప్రభావం మార్కెట్లపై పడింది. తమ బలగాలను డ్రిల్స్​ అనంతరం వెనక్కి పిలిపించినట్లు రష్యా ప్రకటించినా.. అమెరికా, నాటో సహా పలు దేశాధినేతలు దీనిని నమ్మడం లేదు. ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసే అవకాశాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. దీంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొనడంతో ఆ ప్రభావం దేశీయ సూచీల మీద పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద ఉంది. నిఫ్టీలో దివిస్​ ల్యాబ్స్​, అదానీ పోర్ట్స్​, ఓఎన్​జీసీ, ఐఓసీ, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ షేర్లు లాభ పడితే.. పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, అల్ట్రాటెక్​ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ డీలాపడ్డాయి. ఆటో, ఐటీ, పవర్, మెటల్, పిఎస్‌యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ రంగాలలో అమ్మకాలు కనిపించాయి. ఆరోగ్య సంరక్షణ, చమురు & గ్యాస్, రియాల్టీ సూచీలు లాభాల్లో ముగిశాయి. 

(చదవండి: బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement