
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన అగ్రశ్రేణి ఎస్ క్లాస్ విభాగంలో సరికొత్త మాస్ట్రో ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద మోడల్ ధర రూ.1.51 కోట్లుగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో ‘‘మెర్సిడెస్ మీ కనెక్ట్’’ టెక్నాలజీ తాజా వర్షెన్‌ను అప్‌లోడ్ చేశారు. మొమరీ ప్యాకేజ్‌తో ముందు సీట్లను ఏర్పాటు చేయడంతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్‌ను లాంటి అధునాతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. కస్టమర్లకు కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి అభిరుచికి అనుగుణంగా కొత్త మోడళ్లను రూపొందించడమే ఈ కొత్త ఏడాదిలో తమ లక్ష్యమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగపు ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ సరికొత్త మాస్ట్రో ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉండే అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్‌ల వద్ద లభ్యమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment