Multibagger Aarti Industries Stock Turns RS 1 Lakh to RS 6 Crores Above in 20 Years - Sakshi
Sakshi News home page

Multibagger: రూ.లక్షతో రూ.6.5కోట్లు లాభం.. కళ్లుచెదిరే రాబడి!

Published Sun, Nov 21 2021 3:04 PM | Last Updated on Sun, Nov 21 2021 3:34 PM

Multibagger Aarti Industries Stock Turns RS 1 lakh to  RS 6 Crores Above in 20 years - Sakshi

తక్కువ రోజుల్లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం ఉన్న పెట్టుబడి పథకాలలో మీకు స్టాక్ మార్కెట్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. అయితే, ఇందులో రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనే విషయం మరిచిపోవద్దు. కాకపోతే, ఎవరైతే మార్కెట్ మీద పట్టు సాధించాక పెట్టుబడులు పెడతారో వారు కచ్చితంగా భారీ లాభాలను చూసే అవకాశం ఉంటుంది. అందుకే, స్టాక్ మార్కెట్‌లోకి డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఆర్తి ఇండస్ట్రీస్ మల్టీబ్యాగర్ స్టాక్‌
అయితే కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తాయి. అలాంటి వాటిని పెన్నీ స్టాక్స్ లేదా మల్టీబ్యాగర్ స్టాక్ అని అంటారు. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఆర్తి ఇండస్ట్రీస్ కూడా ఒక ఒకటి. ఈ షేరు వల్ల ఇన్వెస్టర్ల పంట పండిందని చెప్పుకోవాలి. ఎవరైతే, స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయి అనడానికి ఈ స్టాక్ ఒక మంచి ఉదాహరణ. ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ ₹1.13(ఎన్ఎస్ఈపై 1 జనవరి 1999న క్లోజ్ ధర) నుంచి నవంబర్ 18 నాటికి ₹972.20కు పెరిగింది. ఈ కాలంలో సుమారు 650 రెట్లు పెరిగింది. అంటే 1 జనవరి 1999న రూ.20000 వేల విలువైన స్టాక్స్ కొని ఉంటే నేడు వాటి విలువ సుమారు రూ.1,30,00,000గా మారి ఉండేది. అదే రూ. లక్ష రూపాయలు పెడితే 6 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చి ఉండేవి.

అదే రూ.20 వేలను మనం 20 సంవత్సరాలకు బారువడ్డీకి ఇచ్చిన మనకు మొత్తం కలిపి రూ.16 లక్షలు మాత్రమే వచ్చేవీ. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో మనకు ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది. ఈ మల్టీబేగర్ స్టాక్ షేర్ ధర చరిత్ర ప్రకారం.. ఇది గత నెల రోజులుగా అమ్మకాల ఒత్తిడిలో ఉంది. గత ఒక నెలలో ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు సుమారు ₹1021 నుంచి ₹972.20 పడిపోయాయి. ఈ కాలంలో సుమారు 5 శాతం నష్టపోయాయి. ఇక గత 6 నెలల్లో ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు సుమారు ₹832 నుండి ₹972.20 కు పెరిగాయి. ఈ కాలంలో సుమారు 16 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. 201 జనవరి 1 నుంచి ఈ స్టాక్ సుమారు ₹630 నుంచి ₹972.20 స్థాయికి పెరిగింది. దీంతో తన మదుపరులకు 55 శాతం లాభం కలిసి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement