స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. కలలో కూడా ఊహించని లాభాలని నిజజీవితంలో తెచ్చిపెడతాయి. ఓపిక, తెలివి ఉండాలగానే కొద్ది కాలంలోనే కరోడ్ పతి కావచ్చు. అయితే, ఇలాంటి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కొన్ని స్టాక్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తున్నాయి. ఊహించని రీతిలో రిటర్నులను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ మూలాలు బలంగా ఉంటుండటం వీటికి ప్లస్‌గా నిలుస్తున్నాయి. అలాంటి పెన్నీ స్టాక్స్‌లో ఒకటి ఏకే స్పింటెక్స్. ఏకే స్పింటెక్స్ టెక్స్‌టైల్ రంగానికి చెందినది.
గత వారం 30 డిసెంబర్ 2021న బిఎస్ఈలో ఏకే స్పింటెక్స్ టెక్స్ టైల్ మల్టీ బ్యాగర్ స్టాక్ ప్రతి షేర్ ధర ₹24.50 వద్ద ముగిసింది. నేడు(జనవరి 7) ఆ షేర్ ధర ₹52.35 వద్ద ఉంది. కేవలం ఈ వారంలో కేవలం ఐదు సెషన్‌లోనే వాటాదారుల 100 శాతం రిటర్నులను అందించింది. ఈ కాలంలో సుమారు 136 శాతం పెరిగింది. అంటే గత వారం ఈ కంపెనీకి చెందిన లక్ష రూపాయలు విలువ చేసే వారికి నేడు వాటి విలువ రూ.2,13,000లుగా ఉండేది. ఈ స్టాక్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో జూలై 10 2017న రూ.84.35 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. అయితే ఈ గరిష్ట స్థాయిల నుంచి ఈ స్టాక్ పడిపోయింది. ఏప్రిల్ 10, 2020న ఈ స్టాక్ రూ.10 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. మళ్లీ ఇప్పుడు తిరిగి పుంజుకుంటుంది.
(చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. రాకెట్ కంటే వేగంగా పడిపోతున్న ధర!)
Comments
Please login to add a commentAdd a comment