Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati1
తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా.. ఇదేనా పద్దతి?

గోశాలకు భూమన అప్‌డేట్స్‌.. భూమన కామెంట్స్‌..మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్‌ విసిరారు.ఛాలెంజ్‌ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఉదయం నుంచి నేను కూడా వెయిట్‌ చేస్తున్నా అని వారికి చెప్పాను.నాకు సవాల్‌ విసిరిన పల్లా శ్రీనివాస్‌ తోకముడిచి గోశాల రాలేదు.ఛాలెంజ్‌ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్‌ చేసి గోశాలకు రమ్మన్నారు.నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్‌ హామీ ఏమైంది?.170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.గోవుల మృతిపై ఈవో, చైర్మన్‌, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు. తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామాగోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీభూమనకు ఫోన్‌ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్‌.ఇటు ఫోన్‌లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులుగోశాల గేటు వద్ద అభినయ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.అభినయ్‌ రెడ్డి కామెంట్స్‌..సవాల్‌ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.కూటమి నేతలు భూమనకు ఫోన్‌ చేసి రమ్మంటారు.అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్‌..గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. ఉద్రిక్తత..కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలుమరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్లాకు భూమన ఫోన్‌ కాల్‌..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమనగోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమనఈ క్రమంలో భూమన కాల్‌ కట్‌ చేసిన పల్లా. మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్‌..టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారుగోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.సవాల్‌ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌?.కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్‌ ఏం చేస్తోంది?.శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.క్యూలైన్‌లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్‌ జరిగిందా?.సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌ కల్యాణ్‌?.భూమన కామెంట్స్‌..టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ పిలిచారు.పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్‌?.టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. తిరుపతి..👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు 👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి👉తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీషను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్‌..భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.కూటమి సర్కార్‌ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.👉కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.👉మరోవైపు.. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు.

Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates2
వక్ఫ్ పిటిషన్ల విచారణ.. లైవ్‌ టెలికాస్ట్‌ కోరుతూ రిక్వెస్ట్‌

వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ దాఖలైన 73 పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరపనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం మధ్యాహ్నాం నుంచి వాదనలు విననుంది. బుధవారం ఇరువైపులా వాదనలు విన్న సీజేఐ బెంచ్‌.. కొన్ని నిబంధనలపై స్టే విధించే అంశం పరిశీలిస్తామని హాట్‌ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌వక్ఫ్ విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖబుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు వక్ఫ్ చట్టం పై విచారణకు భారీగా హాజరవుతున్న పిటిషనర్లు , న్యాయవాదులు, మీడియాకనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదన్న SCBAఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావనఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వక్ఫ్ కేసు పై జరగనున్న విచారణ 👉అధికారంలోకి రాగానే వక్ఫ్‌ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్‌ అల్లర్లతో మరో బెంగాల్‌(ముర్షిదాబాద్‌)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్‌ అన్నారు. 👉వక్ఫ్‌ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్‌, బీజేపీలు వక్ఫ్‌ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్‌ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. సుప్రీం కోర్టు ఏమని అందంటే..ముస్లిమేతరులు బోర్డుల్లో ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలికొత్త వక్ఫ్‌ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలుకేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నలుహిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా?శతాబ్దాల కిందటి మసీదులకు సేల్‌ డీడ్లు ఎలా ఉంటాయి?వక్ఫ్‌ నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారాలపై అభ్యంతరం గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్యసమగ్రంగా ఏమందంటే..సమగ్ర విచారణ అనంతరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన కేంద్రం. ఉత్తర్వులేవీ జారీ చేయని ధర్మాసనం. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. పిటిషనర్ల తరఫున కపిల్‌ సిబల్, అభిషేక్‌ సింఘ్వీ తదితర సీనియర్‌ న్యాయవాదుల వాదనలు వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ధ్రువపత్రాలు చాలామంది వద్ద ఉండవని.. అంతమాత్రాన ‘వక్ఫ్‌ బై యూజర్‌’గా వాటిని ఎందుకు అనుమతించరని సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్‌ కాదంటూ వాటిని రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. అధికారిక/రాతపూర్వక ధ్రువీకరణ లేనప్పటికీ దీర్ఘకాలంగా వక్ఫ్‌గా కొనసాగుతున్న ఆస్తులను ‘వక్ఫ్‌ బై యూజర్‌’గా పిలుస్తారు. ‘వక్ఫ్‌ బై యూజర్, వక్ఫ్‌ బై డీడ్‌.. ఏదైనాసరే కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను రద్దు చేయకూడదు. తాజా పిటిషన్లపై విచారణ కొనసాగినంతకాలం ఇదే పాటించాలి’ అని సీజేఐ ప్రతిపాదనవక్ఫ్‌ విషయంలో కొంత దుర్వినియోగం జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే నిష్కళంకమైనవీ ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం న్యాయస్థానాల తీర్పులు, ఉత్తర్వులు చెల్లవని ప్రకటించే అధికారం చట్టసభలకు లేదని వ్యాఖ్య. 14-16 శతాబ్దాల మధ్య చాలా మసీదులు నిర్మితమయ్యాయని.. వాటికి సేల్‌డీడ్లు ఉండవని గుర్తు చేసిన ధర్మాసనం 100-200 ఏళ్ల కిందట వక్ఫ్‌గా ప్రకటించిన ఒక ట్రస్టును ఇప్పుడు వక్ఫ్‌ కాదని చెప్పడం సరికాదు. గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్యప్రస్తుతం వక్ఫ్‌గా ఉన్న ఏదైనా ఆస్తి.. ప్రభుత్వ భూమి అవునో కాదో జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి తేల్చేవరకూ దాన్ని వక్ఫ్‌గా పరిగణించబోమంటూ కొత్త చట్టంలో ఉన్న నిబంధననూ తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రతిపాదనకోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను రద్దుచేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడంపై అభ్యంతరం సాధారణంగా ఒక చట్టం ఆమోదం పొందిన తొలి దశల్లో కోర్టులు జోక్యం చేసుకోవని, కానీ ఈ కేసు అందుకు మినహాయింపని సీజేఐ పేర్కొన్నారు. తాజా పిటిషన్లపై విచారణ 6-8 నెలలపాటు కొనసాగే అవకాశముందని సూచించారు.వక్ఫ్‌ (సవరణ) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో హింస చెలరేగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కోర్టులో విచారణ జరుగుతుండగా ఇలాంటి పరిణామాలు కలచివేస్తాయని పేర్కొంది. ముస్లింల మతస్వేచ్ఛ ఉల్లంఘన‘‘ఒక వ్యక్తి ముస్లిమా, కాదా.. ముస్లి అయితే.. ఎలా ముస్లిం.. అతడు వక్ఫ్‌ ఇవ్వొచ్చా.. అనేవి ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? ముస్లింలకు ఉన్న మతపరమైన స్వేచ్ఛను (ఆర్టికల్‌ 26) కొత్త చట్టం ఉల్లంఘిస్తోంది’’ అని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అంశం కాబట్టి.. ప్రస్తుత పిటిషన్లను ఏ హైకోర్టుకూ సిఫార్సు చేయకూడదని మరో న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ విన్నవించారు. సొలిసిటర్‌ జనరల్‌పై సుప్రీం సీరియస్‌వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను అనుమతించడం వెనుక తర్కాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఇకపై హిందూ దేవాలయ బోర్డుల్లోకి ముస్లింలను అనుమతిస్తామని దీనిద్వారా సూచిస్తున్నారా.. ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి’ అని తుషార్‌ మెహతాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఆయన స్పందిస్తూ.. ‘‘ఇద్దరి కంటే ఎక్కువ ముస్లిమేతరులను (ఎక్స్‌-అఫీషియో సభ్యులు కాకుండా) వక్ఫ్‌ మండలిలో చేర్చబోం. కావాలంటే ప్రమాణపత్రంలో దీన్ని పొందుపరుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే కేంద్ర వక్ఫ్‌ మండలిలోని 22 మంది సభ్యుల్లో 8 మందే ముస్లింలు ఉంటారని కొత్త చట్టంలో ఉన్న సంగతిని ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘8 మంది ముస్లింలయితే.. ఇద్దరు జడ్జీలు ఉంటారేమో. వారు ముస్లింలు కాకపోవచ్చు. అంటే- మండలిలో ముస్లిమేతరులే మెజార్టీ వర్గంగా ఉంటారు. వక్ఫ్‌ మండలి మత స్వభావానికి ఇది సముచితమేనా?’’ అని ప్రశ్నించింది. అయితే ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులూ హిందువులే కావడాన్ని తుషార్‌ మెహతా ఎత్తిచూపారు. దాంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘మేం ధర్మాసనంపై ఆసీనులమైనప్పుడు.. మా వ్యక్తిగత గుర్తింపులన్నింటినీ వదిలేస్తాం. చట్టం ముందు అందరూ సమానులే. మీ పోలిక పూర్తిగా అసంబద్ధం’’ అని కాస్త కటువుగానే వ్యాఖ్యానించింది. అయితే వక్ఫ్‌ చట్టాన్ని చాలామంది ముస్లింలు వ్యతిరేకించిన మాట వాస్తవమని విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు.

bhumana abhinay reddy arrest at Tirumal goshala3
భూమన అభినయ్‌రెడ్డి అరెస్ట్

తిరుపతి,సాక్షి: టీటీడీ గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోశాలలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అభినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా.. భూమని అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించి గోశాలకు వచ్చాం. కానీ టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమని అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు స్వీకరించినప్పుడు పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి. ఫోన్ చేసి రమ్మంటారు. వస్తే పోలీసులతో అడ్డుకుంటారు. ఇదే మీ సంస్కారం’అని దుయ్యబట్టారు. భూమన ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్‌రెడ్డిలను కూటమి నేతల నిర్భంద కాండకు పాల్పడ్డారు.ఓవైపు పోలీసులతో కూటమి నేతలు నిర్భందించారు. మరో వైపు గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతలు ఫోన్లు చేస్తున్నారు. గోశాలకు బయల్దేరిన భూమనను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కూటమి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. గోశాలకు రాకుండా భూమనను కూటమి నేతలు అడ్డుకున్నారు. వేరే దారిలో గోశాలకు వచ్చా. నిజాల్ని నిరూపించేందుకు మేం సిద్ధం’అని వ్యాఖ్యానించారు.

Pakistan Army Chief Asim Munir Sensational Comments On Hindus Kashmir4
కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌

కశ్మీర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌(General Asim Munir) భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్‌, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్‌ మీడియా హౌజ్‌ డాన్‌(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్‌ మునీర్‌ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్‌ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్‌ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్‌, కశ్మీర్‌ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్‌కు బెలూచిస్తాన్‌ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్‌ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్‌ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్‌ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్‌ మునీర్‌.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్‌ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్‌ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ ఎలా ‍స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025

Not Cummins Starc Rohit Names This Star As Toughest Australian Bowler To Face5
కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్‌

దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆస్ట్రేలియా 2025లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT)ని గెలిచింది. టీమిండియాను 3-1తో ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇందుకు ప్రధాన కారణం ఆసీస్‌ పేసర్లే అని చెప్పడంలో సందేహం లేదు.బుమ్రా@32నిజానికి భారత పేస్‌ దళ నాయకుడు జస్‌‍ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 32 వికెట్లు కూల్చాడు. తద్వారా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా ఓడిపోవడంతో బుమ్రా ప్రదర్శనకు విలువ లేకుండా పోయింది.హాజిల్‌వుడ్‌ స్థానంలో వచ్చిఇక.. ప్రపంచంలోని అత్యుత్తమ పేస్‌ త్రయంగా ఆస్ట్రేలియా పేసర్లు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins), మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లకు పేరు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో హాజిల్‌వుడ్‌ మూడు మ్యాచ్‌కు ముందు గాయపడగా.. అతడి స్థానంలో స్కాట్‌ బోలాండ్‌ వచ్చాడు. కమిన్స్‌, స్టార్క్‌తో కలిసి భారత్‌తో టెస్టుల్లో అతడు రాణించగా.. ఉత్తమ ఆఫ్‌ స్పిన్నర్లలో ఒకడైన నాథన్‌ లియోన్‌ వారికి సహకరించాడు. బ్యాటర్లు కూడా తమ పనిని చక్కగా నెరవేర్చారు.ఫలితంగా టీమిండియాపై ఆసీస్‌ పైచేయి సాధించడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు.. రోహిత్‌ సేనను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం చేసింది. ఈ సిరీస్‌ గురించి టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టంబీజీటీలో తమను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్‌ ఎవరన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘స్కాట్‌ బోలాండ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టమైంది. అతడి పిచ్‌ మ్యాప్‌ను మేము చెక్‌ చేస్తూనే ఉన్నాం. అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టే విషయమై సమాలోచనలు చేశాం.ఫుల్‌ బాల్స్‌ లేవు. అంతా బంతిని వేసే కోణంలోనే ఉంది. అతడు నేరుగా పరిగెత్తుకు వస్తాడు. కాస్త జంప్‌ చేసి.. తన సీమ్‌ బౌలింగ్‌తో మ్యాజిక్‌ చేస్తాడు’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో బుమ్రా తొమ్మిది ఇన్నింగ్స్‌లో 32 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్‌ సారథి పది ఇన్నింగ్స్‌లో కలిపి 25 వికెట్లు కూల్చగా.. బోలాండ్‌ ఆరు ఇన్నింగ్స్‌లోనే 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 10 ఇన్నింగ్స్‌లో 20 వికెట్లు.. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 10 ఇన్నింగ్స్‌లో 18 వికెట్లు కూల్చారు. తదుపరి ఇంగ్లండ్‌తోఇదిలా ఉంటే.. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌-2025తో బిజీగా ఉన్నారు. ఈ టీ20 లీగ్‌కు ముందు టీమిండియా.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టైటిల్‌ గెలిచింది. ఇక ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది.చదవండి: వికెట్‌ కాపాడుకోవటానికే ప్రాధాన్యం.. ఇలా అయితే కష్టం రాహుల్‌: పుజారా

S. S. Rajamouli Praises Jr NTR in Komuram Bheemudo Song at Japan6
తారక్‌ పూనకం వచ్చినట్లే చేశాడు.. నాదేం లేదు: రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie)లో రోమాలు నిక్కబొడుచుకునే పాట+ సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది కొమురం భీముడో సాంగ్‌.. ఈ పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను చిత్రహింసలు పెడుతున్నా.. అతడు ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు.. నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటాయి. ఆ సమయంలో తారక్‌ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడంటున్నాడు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli).తారక్‌ వల్లే ఈజీ..జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ డాక్యుమెంటరీ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట (Komuram Bheemudo Song) షూటింగ్‌ చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే తారక్‌ (Jr NTR) పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్లుగానే యాక్ట్‌ చేశాడు. అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు. తనిచ్చే ఒక్కో ఎక్స్‌ప్రెషన్‌.. నుదుటిపై కండరాల కదలిక.. అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.కొరియోగ్రాఫర్‌ నైపుణ్యం కూడా..నేను కేవలం కెమెరాను అతడి ముఖం ముందు పెట్టి పాట ప్లే చేశానంతే.. చివరకు ఆ పర్ఫామెన్స్‌ అద్భుతంగా వచ్చింది. ఈ విషయంలో కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshit)కు కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే! అతడిని ఎలా కట్టేయాలి, గాల్లో ఎలా వేలాడదీయాలి.. ఇలా అన్నింటినీ తను చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు అని మెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికి వస్తే.. విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాజమౌళి తెరకెక్కించాడు. వెయ్యికోట్లకు పైనే..సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందించగా డీవీవీ దానయ్య నిర్మించాడు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌, శ్రియా, సముద్రఖని, ఒలీవియా మోరిస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా రాబట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ (RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.రాజమౌళి నెక్స్ట్‌ మూవీ..ప్రస్తుతం రాజమౌళి.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే.. అతడు వార్‌ 2 చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్‌ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. Everyone Knows Tarak Is Good, Fantastic Actor But In #KomuramBheemudo Sequence He's On Different Level 🔥👏🛐 - @ssrajamouli In Japan ❤️.Goat Actor @tarak9999 🐐❤️‍🔥.#RRRBehindAndBeyond pic.twitter.com/2yDLhx0Dae— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 13, 2025 చదవండి: సమంత 'సిటాడెల్‌ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్‌

KTR Serious Comments Over Hcu Lands7
రేవంత్‌.. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయ్‌: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి హెచ్‌సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం తలకెక్కి, అధికార మదంతో విర్రవీగి చక్రవర్తులం అని భావిస్తే.. న్యాయ వ్యవస్థ ముందు అహంకారం తగ్గక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సీఎం రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఆయన అన్ని పట్టించుకోని వ్యక్తి. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది విద్యార్థుల, అధ్యాపకుల, సపోర్ట్ చేసిన అందరి విజయం’ అని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ టాక్స్ అని , హెచ్‌సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని మోదీ మాట్లాడటం కాదు. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జీతో ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. సెంట్రల్ కమిటీతో విచారణ చేయాలి. రాహుల్ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటా అన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పత్తా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ ఆరాటపడుతోంది. భారత ప్రభుత్వం డైలాగులు కొడితే సరిపోదు. గుంట నక్కలు అని డైలాగ్‌ కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్ట్ వాతలు పెట్టింది. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు వారు కూడా ఊచాలు లెక్కబెట్టాల్సి వస్తుంది. సుప్రీంతీర్పును స్వాగతిస్తున్నాము. రేవంత్ అధికారులను బలి పశువులను చేస్తున్నారు. అంతా మంచి జరిగితే క్రెడిట్ నాది అంటారు రేవంత్. ఏదైనా జరిగితే అధికారులది తప్పు అంటున్నారు.రెండు జాతీయ పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల మాటలు వింటే చెవుల నుండి రక్తం కారుతుంది. ప్రజలే తిరగబడి బాంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లు సీఎంగా ఉండాలి ఆ తర్వాత వచ్చే 20ఏళ్ళు కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా ఓటు వేయరు. రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.

Monitoring Certain Countries Commodities For Potential Dumping Risks To India8
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?

న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్‌–మంత్రిత్వ శాఖల మానిటరింగ్‌ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్‌ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌ సత్య శ్రీనివాస్‌ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్‌ గ్రూప్‌ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు.

The Indian-Origin biotech trailblazer Reshma Kewalramani On TIME's list9
ఎవరీ రేష్మా కేవల్‌రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..

ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్‌ మ్యాగజైన్‌(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్‌ బయోటక్‌ దిగ్గజం కేవల్‌ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్‌ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్‌ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్‌రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో ఒక ప్రధాన బయోటెక్‌ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్‌రమణి. ఆమె ఈ ఏడాది టైమ్‌ మ్యగజైన్‌ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్‌​ ప్రోఫైల్‌ కూడా దీన్నే హైలెట్‌ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది. అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్‌ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.రేష్మా విద్యా నేపథ్యం..ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్‌లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్‌ జాగ్రత్త..!)

TDP Leaders Resign Over JanaSena Leaders Over Action At Nidadavole10
కూటమిలో ట్విస్ట్‌.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా

సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర​ రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement