న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ (ఎన్‌టీసీ)పై దివాలా చర్యలు చేపట్టడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఢిల్లీ బెంచ్ ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 14 లక్షలను డిఫాల్ట్‌గా క్లెయిమ్ చేస్తూ ఎన్‌టీసీపై ఆపరేషనల్ క్రెడిటార్స్‌లో ఒకరైన హీరో సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ ఈ చర్యలకు ఆదేశించిం ది.
ఐఆర్‌పీగా (ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫె షనల్) అమిత్ తల్వార్ నియమించిన ట్రిబ్యున ల్, ఎన్‌టీసీ బోర్డ్‌ను సస్పెండ్ చేసింది. సంస్థపై మారటోరియం ప్రకటించింది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోని ప్రభుత్వ రంగ సంస్థపై (పీఎస్‌యూ)పై దివాలా చర్యలు ప్రారంభించడం బహుశా ఇదే మొదటిసారి. జౌళి మంత్రిత్వశాఖ ఆధీనంలో ఎన్‌టీసీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment