
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మళ్లీ అమ్మకాల - కొనుగోళ్ల ట్రెండ్ ప్రారంభమైంది. నెలన్నర కాలంలో పెట్టుబడి దారులు స్టాక్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. కానీ ఈ వారంలో అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్ట్‌ర్లలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరి రానున్న రోజుల్లో మార్కెట్‌లో ట్రెండ్ ఏవిధంగా ఉండబోతుంది. మదుపరులు ఇన్వెస్ట్ చేస్తారా? లేదంటే కొనుగోలు చేస్తారా? అనే అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు, ఆషికా మోహన్ ఇనిస్టిస్ట్యూషనల్ ఈక్విటీస్ కౌశిక్ మోహన్‌లు విశ్లేషించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
కారుణ్య రావు : గడిచిన సెషన్స్‌లో మార్కెట్‌లు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కానీ రెండు సెషన్స్‌లో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. రానున్న రోజుల్లోనూ ఈ ఒడిదుడుకులు ఇలాగే కొనసాగుతాయా? లేదంటే మార్కెట్‌లు తిరిగి పుంజుకుంటాయా?
కౌశిక్ మోహన్ : నాకు తెలిసి గత రెండు రోజుల నుంచి మార్కెట్‌లో ఒడిదుడుకులు (కన్సాలిడేషన్) లోనయ్యాయి. ఈ ప్రభావం ఎక్కువగా మిడ్, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్‌లోఉంది. దీనంతటికి దేశంలో కోవిడ్-19 కేసులు నమోదు ఇందుకు కారణమని చెప్పుకోవాలి. కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్న భయాలు ఒక్కరోజు మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు లాభాల్లోనే ట్రేడయ్యాయి.
కారుణ్యరావు : ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు సెల్ చేయాలా? బై చేయాలా? లేదంటే వేచి చూడాలా? వారికి మీరిచ్చే సలహా?
కౌశిక్ మోహన్ : మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు రుణాలు తక్కువగా ఉండి, తగినంత క్యాష్ కంపెనీలో ఉంటే .. ఆ ఫండమెంటల్ కంపెనీ అమ్మకాలు మూడేళ్లలో అమ్మకాలు, ఆదాయాలు రెట్టింపు అయ్యాయో వాటి స్టాక్స్‌ను కొనుగోలు చేయడం ఇదే మంచి సమయం. ఆదాయాల్ని బట్టి స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. కాబట్టే కంపెనీని స‍్థాపించి మూడేళ్ల సమయం తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదని పెట్టుబడి దారులకు సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment