దేశీయ స్టాక్ మార్కెట్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్ల నష్టంతో 71072 వద్ద నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21616 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అపోలో హాస్పటిల్స్, దివీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగియగా.. కోల్ ఇండియా, హీరోమోటో కార్ప్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి.
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మార్కెట్ ర్యాలీ విపరీంగా ఉన్న సమయంలో మదుపర్లలలో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా షేర్లు కొనుగోలు జరిగే సమయంలో ప్రతికూల వార్తలు ఇబ్బందే పెట్టే అవకాశం ఉందని భావించే ఇన్వెస్టర్లు కొనుగోలు, అమ్మకాల సమయాల్లో ఆచితూచి వ్యవహిరస్తుంటారు. ఫలితంగా ఫిబ్రవరి 12న మార్కెట్లు నష్టాలతో ముగిశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment