
ముంబై: కేంద్ర బడ్జెట్ ఇచ్చిన బూస్ట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ, ఉద్యోగాల సృష్టికి మద్దతుగా బడ్జెట్‌లో మౌలిక రంగ వ్యయాలను భారీగా పెంచడం, కొత్తగా పన్నులు విధించకపోవడంతో మదుపర్లపై కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో భారీ లాభాల్లో మార్కెట్లు ముగిశాయి.
ముగింపులో, సెన్సెక్స్ 695.76 పాయింట్లు (1.18%) లాభపడి 59,558.33 వద్ద ఉంటే, నిఫ్టీ 203.20 పాయింట్లు(1.16%) పెరిగి 17,780 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.82 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఎక్కువ లాభ పడితే.. టెక్ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా షేర్లు అధికంగా నష్ట పోయాయి. బ్యాంకు, రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పిఎస్‌యు బ్యాంకు సూచీలు 1-3 శాతం లాభంతో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-1.5 శాతం పెరిగాయి.
(చదవండి: అటు బడ్జెట్ అయిపోగానే.. ఇటు 342 కోట్లు వచ్చిపడ్డాయ్!)
Comments
Please login to add a commentAdd a comment