2024 ప్రారంభం నుంచి లే ఆప్స్ సాగుతూనే ఉన్నాయి. గత నెలలో (జనవరి) మాత్రమే 32వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు.. లేఆఫ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi డేటా ఆధారంగా తెలిసింది. అయితే ఈ నెలలో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 'నైక్' (Nike) కంపెనీ ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది.
కంపెనీ లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, ఖర్చులు ఆదా చేయడంలో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది (1600 కంటే ఎక్కువ) సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలగింపులు ప్రక్రియ కూడా రెండు దశల్లో ఉంటుందని సమాచారం.
2023 మే 31 నాటికి నైక్ కంపెనీలో దాదాపు 83,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 12000 మంది కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ తొలగించనున్న ఉద్యోగులలో స్టోర్ ఉద్యోగులు, స్టోర్ మేనేజర్‌లు లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు ఉండనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు..
మూడవ త్రైమాసికంలో ఉద్యోగుల ఖర్చుల ఖర్చులు 400 మిలియన్ డాలర్ల నుంచి 450 మిలియన్ డాలర్ల వరకు పెరిగింది. నైక్ కంపెనీ ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల ఉద్యోగుల తొలగింపుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంస్థ రానున్న రోజుల్లో లాభాలు ఆర్జించడానికి కావాల్సిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment