Nike
-
మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు!
2024 ప్రారంభం నుంచి లే ఆప్స్ సాగుతూనే ఉన్నాయి. గత నెలలో (జనవరి) మాత్రమే 32వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు.. లేఆఫ్-ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi డేటా ఆధారంగా తెలిసింది. అయితే ఈ నెలలో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా 'నైక్' (Nike) కంపెనీ ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. కంపెనీ లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, ఖర్చులు ఆదా చేయడంలో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది (1600 కంటే ఎక్కువ) సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలగింపులు ప్రక్రియ కూడా రెండు దశల్లో ఉంటుందని సమాచారం. 2023 మే 31 నాటికి నైక్ కంపెనీలో దాదాపు 83,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 12000 మంది కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ తొలగించనున్న ఉద్యోగులలో స్టోర్ ఉద్యోగులు, స్టోర్ మేనేజర్లు లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు.. మూడవ త్రైమాసికంలో ఉద్యోగుల ఖర్చుల ఖర్చులు 400 మిలియన్ డాలర్ల నుంచి 450 మిలియన్ డాలర్ల వరకు పెరిగింది. నైక్ కంపెనీ ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల ఉద్యోగుల తొలగింపుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంస్థ రానున్న రోజుల్లో లాభాలు ఆర్జించడానికి కావాల్సిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
Layoffs 2023: వందలాది మందిని తొలగించనున్న మరో కంపెనీ..
కొత్త సంవత్సరంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు కంపెనీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో అంతర్జాతీయ కంపెనీ వందలాది మందిని తొలగించనున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కి భారీ షాక్! రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్.. వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను వెల్లడించింది. ‘ది గార్డియన్’ నివేదికల ప్రకారం.. లేఆఫ్‌ల అమలు, కొన్ని సేవలలో ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా 2 బిలియన్ డాలర్లు (రూ.16 వేల కోట్లకుపైగా ) ఆదా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరంలో అమ్మకాలలో తిరోగమనాన్ని ఎదుర్కొన్న నైక్, సంస్థాగత క్రమబద్ధీకరణ అవసరానికి అనుగుణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. తొలగిస్తున్న ఉద్యోగులకు చెల్లించే సీవరెన్స్ ప్యాకేజీల కోసం 450 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.3,742 కోట్లు)ను కేటాయించునుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో 700 మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత నైక్ చేపడుతున్న రెండో లేఆఫ్ ఇది. -
Interview Tip: ఆమె థింకింగ్ వేరె లెవల్.. జాబ్ కోసం ఇలా కూడా చేస్తారా?
ఒక పనిని ఒకే విధంగా చేయాలి అనే రూలేమీ లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ వినూత్న ఆలోచనతో పనిచేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చాలా స్మార్ట్‌గా ఆలోచించింది. అందులో భాగంగానే కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి.. కంపెనీకి పంపించింది. ఆమె చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ అనే మహిళ సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసింది. అనంతరం, ఆ కేక్‌ను ప్రముఖ సంస్థ ‘నైకీ’కి పంపించింది. ఈ సందర్భంగా ఆమె.. ఎందుకు ఇలా చేశానో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్ చేసుకోవడం లేదని తెలిపింది. అయితే, తన గురించి నైకీ కంపెనీలో ఉద్యోగం సాధించడమే తన టార్గెట్ అని పేర్కొంది. ఈ విషయం నైకీ టీంకి తెలియజేయడం కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఇలా చేసినట్టు చెప్పింది. అందుకే కేక్‌పై రెజ్యూమ్ ప్రింట్ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని తనను తాను సమర్ధించుకుంది. కాగా, ఆమె చేసిన కేక్ రెజ్యూమ్ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొంతమంది ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. కంపెనీ యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన కాన్సెప్ట్ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఆమె జిమ్మిక్స్ చేస్తుందంటూ కామెంట్స్ చేశారు. Did you like Karly's idea?https://t.co/tr4SAmwLD6 — IndiaToday (@IndiaToday) September 27, 2022 -
ఫుట్‌బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు..
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్‌బాలర్ మాసన్ గ్రీన్వుడ్ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది.సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాసన్ గ్రీన్‌వుడ్‌ను గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై బలవంతగా లైంగిక వేధింపులకు దిగినట్లు వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది. అయితే మాంచెస్టర్ యునైటెడ్ మొదట మాసన్ గ్రీన్వుడ్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. చదవండి: ఫుట్‌బాల్ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ తాజాగా అతనిపై వచ్చిన సెక్స్ ఆరోపణలు నిజమేనని తెలియడంతో ఫుట్‌బాల్ క్లబ్ కూడా గ్రీన్‌వుడ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. తక్షణమే గ్రీన్‌వుడ్‌ను క్లబ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తన తప్పు లేదని నిరూపించుకునేవరకు గ్రీన్వుడ్ ఏ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడకుండా ఫుట్‌బాల్ సమాఖ్యకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనికి తోడూ అన్ని ఎండార్స్మెంట్ల నుంచి గ్రీన్‌వుడ్‌ను తొలగిస్తున్నామంటూ తమ అధికారిక వెబ్సైట్లో అతని పేరు తొలగించిన పేజ్‌ను విడుదల చేసింది. ఇక గ్రీన్‌వుడ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నైక్ కంపెనీ తమ స్పాన్సర్సిప్ను రద్దు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ''మాసన్ గ్రీన్‌వుడ్‌పై వస్తున్న ఆరోపణలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. అందుకే తాత్కాలింకగా అతనితో స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం.'' అంటూ తెలిపింది. ఇక హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ గత ఆదివారం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. -
అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
ట్రెండ్స్, సరికొత్త స్టైల్స్‌కు ఖ్యాతిగాంచిన భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటెయిలర్ అజియో జూలై 1, 2021 నుంచి జూలై 5, 2021 వరకు ఫ్యాషన్ శ్రేణి అమ్మకం బిగ్ బోల్డ్ సేల్ నిర్వహిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ అజియో బిగ్ బోల్డ్ సేల్ ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ, బోల్డెస్ట్ సేల్. 2500పైగా బ్రాండ్లకు చెందిన 6,00,000 స్టైల్స్‌పై 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దేశంలోని ప్రతీ కస్టమర్ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు చూడని ధరలు, ప్రతీ గంటకు స్పెషల్ డీల్స్, రివార్డులు, పాయింట్లను అజియో బిగ్ బోల్డ్ సేల్ అందిస్తోంది. ప్రపంచ ఖ్యాతిగాంచిన బ్రాండ్లు నైకీ, ప్యూమా, అడిడాస్, లివైస్, యూనైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్కు చెందిన స్టైల్స్ అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఈ మెగా ఈవెంట్ ద్వారా ఫ్యాషన్ ప్రపంచపు సుందరి సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్స్ గురు రణధావ, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, మౌనీ రాయ్ అమ్మకాలను ఉత్తేజితం చేస్తారు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందించేలా పాపులర్ శ్రేణులైన టీ-షర్ట్స్, జీన్స్, కుర్తాలు, స్నీకర్స్పై 50 నుంచి 90 శాతం వరకు ఆఫ్ సహ అన్ని స్టైల్స్‌పై తగ్గింపు ధరలను చూడవచ్చు. ధరల తగ్గింపు మాత్రమే కాదు ఈ సేల్ సందర్భంగా అనేక ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను అజియో ప్రారంభిస్తోంది. దేశంలోని ఫ్యాషన్ ప్రియులకు సరైన వేదికగా నిలుస్తున్న అజియో, స్త్రీలు, పురుషుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్స్ అందిస్తోంది. చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
స్మృతి మంధాన ఆస్తుల విలువెంతో తెలుసా..?
స్మృతి మంధాన క్రికెటర్‌గా ఎదిగారు. బిజినెస్ ఉమన్‌గా తారస్థాయికి చేరుకున్నారు. తాజాగా నైకీ ఒప్పందంతో మరింత పైకి చేరుకున్నారు. ఇప్పుడామె ప్లేయర్ మాత్రమే కాదు. ధనలక్ష్మి కూడా. సంపాదనలో స్మృతి బౌండరీలు దాటి సిక్సర్లకు చేరుకోబోతున్నట్లే ఉంది ఆమె ‘డీల్స్’ చూస్తుంటే! స్మృతితో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నైకీ ఆమెకు ఎంత ముట్టచెబుతానని మాట ఇచ్చిందో అంతగా ప్రాధాన్యం లేని సంగతి. నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి రావడం.. అదీ గొప్ప. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్‌కు ప్రచారం ఇవ్వాలన్నా ఏడాదికి కనీసం 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటారని వినికిడి. ఆ లెక్కన నైకీ ఆమెకు రెట్టింపే ఇవ్వొచ్చు. స్టార్డమ్ నెట్‌వర్త్ డాట్ కామ్ అంచనా ప్రకారం చిన్న వయసులోనే అమిత సంపన్నురాలైన మహిళా క్రికెట్ ప్లేయర్ 24 ఏళ్ల స్మృతీ మంధాన. స్మృతి ప్రస్తుత ఆస్తుల విలువ 22 కోట్ల రూపాయలని ఆ సంస్థ ఇటీవల వెల్లడించింది. ప్లేయర్‌గా ఆమెకు వచ్చే జీతం కూడా కలుపుకుని ఆ విలువ. అది కాక, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు బీసీసీఐ నుంచి జీతంగా ఏడాదికి 50 లక్షల రూపాయలు అందుతాయి. ‘ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్’లో కనిపించినందుకు మరికొంత మొత్తం లభిస్తుంది. క్రికెటర్‌గా వచ్చే ఈ రాబడి కాకుండా.. మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో ‘ఎస్.ఎం.18’ అని ఆమె ఒక కేఫ్ నడుపుతున్నారు. స్మృతి తలపైకి లాభాల గంపను ఎత్తుతున్న ఆమె తొలి వెంచర్ అది! ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్.. వీటినుంచి వచ్చే ప్రచార ధనం ఎటూ ఉంది. స్మృతి మంధాన ఎందుకింత పాపులర్ అయ్యారు? మొదటిది ఆమె ఆట. రెండోది సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల 70 వేల మంది స్మృతిని ఫాలో అవుతున్నారు. ఇక క్రికెట్లో ఆమె విశ్వరూపం తెలియనిదెవరికి?! టీమ్ ఇండియా తరఫున 51 వన్డేలు ఆడారు. 2025 పరుగులు చేశారు. నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశారు. 71 టి20 ఇంటర్నేషనల్స్ ఆడి 1716 పరుగులు తీశారు. అందులో 15 హాఫ్ సెంచరీలు. ఆడిన టెస్ట్ మ్యాచ్‌లు రెండే కానీ అసాధారణమైన ప్రతిభ కనబరిచి తొలి టెస్ట్‌లోనే హాఫ్ సెంచరీ చేశారు. స్మృతి మంధాన ఆట, సంపాదన ఒకటిని మించి ఒకటి పైపైకి ఎదుగుతున్నాయి. ఈ తరం అమ్మాయిలకు స్ఫూర్తి.. స్మృతి. -
మారిపోనున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ప్రఖ్యాత స్పోర్టింగ్ కంపెనీ ‘నైకీ’ 15 ఏళ్ల బంధం అధికారికంగా ముగిసింది. టీమిండియా కిట్ అండ్ మర్కండైజ్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్ అపెరల్ అండ్ యాక్సెసరీస్‌తో బీసీసీఐ తాజాగా ఒప్పం దం కుదుర్చుకుంది. ఇ–స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ అయిన మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)కు చెందినదే ఈ ఎంపీఎల్ స్పోర్ట్స్. ఇకపై భారత సీనియర్ పురుషుల, మహిళల జట్లు, అండర్–19 టీమ్‌ల జెర్సీలపై ‘ఎంపీఎల్’ లోగో కనిపిస్తుంది. నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా... 2023 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలానికి ఎంపీఎల్–బీసీసీఐ భాగస్వామ్యం కొనసాగుతుంది. టీమిండియా అధికారిక జెర్సీలతో పాటు ఇతర క్రీడా సామగ్రిని అమ్ముకునేందుకు కూడా ఎంపీఎల్‌కు హక్కులు లభిస్తాయి. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఈ గేమింగ్ కంపెనీలో గరిమెళ్ల సాయి శ్రీనివాస్ కిరణ్, శుభమ్ మల్హోత్రా భాగస్వాములు. ఐపీఎల్ తర్వాత... 2006 జనవరి 1 నుంచి ‘నైకీ’ టీమిండియాకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. కాలానుగుణంగా ఈ ఒప్పందం రెన్యువల్ అవుతూ రాగా... గత నాలుగేళ్ల కాంట్రాక్ట్‌లో ‘నైకీ’ భారత జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌కు రూ. 85 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు రాయల్టీగా మరో రూ. 30 కోట్లు బోర్డుకు చెల్లించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో తాము ఇంత చెల్లించలేమని, ఆ మొత్తాన్ని తగ్గిస్తే కిట్ స్పాన్సర్‌గా కొనసాగుతామని ‘నైకీ’ కోరగా భారత బోర్డు అందుకు అంగీకరించలేదు. కొత్తగా బిడ్లను ఆహ్వానించగా, ఎవరూ ముందుకు రాలేదు. దాంతో చివరి తేదీని మళ్లీ పొడిగించాల్సి వచ్చింది. ఆ తర్వాత అడిడాస్, ప్యూమావంటి టాప్ కంపెనీలతో పాటు డ్రీమ్ 11 స్పోర్ట్స్, రాంగ్, వాల్ట్ డిస్నీ కూడా టెండర్లు కొనుగోలు చేశాయి. కానీ మ్యాచ్‌కు ఇవ్వాల్సిన మొత్తంపైనే వెనక్కి తగ్గిన వీరు టెండరు దాఖలు చేయలేదు. చివరకు నిబంధనలు మార్చి మరీ ఇప్పుడు ‘ఎంపీఎల్’కు బీసీసీఐ కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఎంపీఎల్ ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు రూ. 65 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఏడాదికి రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ. 9 కోట్లు అదనంగా రాయల్టీ కింద అందజేస్తుంది. ఈ మూడేళ్ల కాలంలో భారత జట్టు కనీసం 142 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్–2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఎంపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. -
బాక్స్ ఓపెన్ చేస్తే..
-
బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి
న్యూయార్క్ : అప్పుడప్పుడు నకిలీ ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతుంటాం. ఒక్కోసారి ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు రాళ్లు, ఇతర పనికిరాని వస్తువులు వచ్చాయని వార్తల్లో చూశాం. కానీ, ఓ అమెరికా వినియోగదారుడికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. నైక్ కంపెనీనుంచి వచ్చిన దుస్తుల ప్యాక్‌ను విప్పి చూడగా, పురుగులు బయటపడ్డాయి. ఒక్కసారి కంగుతిన్న అతడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వివరాలు.. న్యూయార్క్‌కు చెందిన బెంజమిన్ స్మితీ ఆన్లైన్లో నైక్ కంపెనీ బట్టలను బుక్ చేశాడు. డెలివరీ బాయ్ బాక్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఉత్సాహంగా బాక్స్ ఓపెన్ చేసిన స్మితీ ఆశ్చర్యపోయాడు. బట్టలపై పురుగులు పారుతుండడం గమనించాడు. ప్యాక్లోపల కూడా ప్రతి బట్టపై పురుగులున్నట్లు గుర్తించాడు. తన ఆవేదనను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. అనంతరం మళ్లీ ఒక పోస్ట్ పెట్టాడు. నైక్ ఎలైట్ కస్టమర్ సర్వీస్ టీం సభ్యుడితో మాట్లాడానని, అతడు తన డబ్బును వాపస్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు. -
‘కిట్’ స్పాన్సర్ వేటలో...
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కిట్ స్పాన్సర్‌ను వెతికే పనిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పడింది. ప్రముఖ సంస్థ ‘నైకీ’తో బోర్డు కాంట్రాక్ట్ వచ్చే నెలతో ముగియనుంది. దాంతో కొత్త అపెరాల్ భాగస్వామిని ఎంచుకునేందుకు బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఆగస్టు 26 వరకు సంస్థలు పోటీ పడవచ్చు. విజేతగా నిలిచే బిడ్డర్ టీమిండియా ప్రధాన జట్టుతో పాటు ఇతర అనుబంధ (మహిళా, యువ) జట్లకు కూడా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. భారత క్రికెట్ కు సంబంధించి జెర్సీలు, క్యాప్‌లు తదితర అపెరాల్స్‌ను అధికారికంగా అమ్ముకునే హక్కులు వారికి లభిస్తాయి. గత నాలుగేళ్ల కాలానికి ‘నైకీ’ రూ. 30 కోట్ల రాయల్టీ సహా రూ. 370 కోట్లు బోర్డుకు చెల్లించింది. 14 ఏళ్ల అనుబంధం... ఈ బిడ్‌లో ప్రస్తుతానికి చూస్తే నైకీ కూడా మళ్లీ పాల్గొనేందుకు అర్హత ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అది సందేహమే. ఈ ప్రఖ్యాత సంస్థకు భారత క్రికెట్‌తో 14 ఏళ్ల అనుబంధం ఉంది. తొలిసారి 2006 జనవరి 1న బీసీసీఐతో జత కట్టింది. నాడు అడిడాస్, రీబాక్‌లతో పోటీ పడి ఐదేళ్ల కాలానికి 43 మిలియన్ డాలర్లు (అప్పట్లో) చెల్లించి అపెరాల్ హక్కులు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలం నేపథ్యంలో స్పాన్సర్షిప్ మొత్తాన్ని కాస్త తగ్గించి తమనే కొనసాగించాలని నైకీ కోరగా... బోర్డు అందుకు అంగీకరించలేదని సమాచారం. పైగా కోవిడ్–19 కారణంగా ఈ ఏడాది పలు సిరీస్‌లు రద్దయిన విషయాన్ని కూడా నైకీ గుర్తు చేసినా లాభం లేకపోయింది. ఒక వేళ ఇప్పుడు కూడా నైకీ బిడ్‌లో పాల్గొన్నా తాము అనుకున్న తక్కువ మొత్తానికే కోట్ చేస్తే... ఇతర కంపెనీలు దానిని వెనక్కి తోసి అవకాశం దక్కించుకోవచ్చు. -
స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఒకవైపు చైనాకు చెందిన పలు యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మాత్రం వివో సహా ఇతర చైనా కంపెనీలను స్పాన్సర్లుగా కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది. ప్రధానంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్‌కు కేంద్ర గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తరుణంలో టైటిల్ స్పాన్సర్ అయిన వివోను కొనసాగిస్తూనే బీసీసీఐ ముందుకెళుతుంది. సాంకేతికపరమైన అడ్డంకులు ఉండటం కారణంగానే బీసీసీఐ ఇలా వ్యవహరిస్తున్నా విమర్శలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి. భారత్‌లో చైనా యాప్‌లను నిషేధిస్తారు.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన వివోను మాత్రం బీసీసీఐ కొనసాగిస్తుంది ఆంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే, తాజాగా జట్టు కిట్ స్పాన్సర్ కోసం బీసీసీఐ కొత్త బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటివరకూ కిట్ స్పాన్సర్‌గా ఉన్న నైకీ గడువు వచ్చే నెలతో ముగిసిపోవడంతో ఆ స్థానంలో కొత్త స్పాన్సర్షిప్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లకు పిలిచింది. అదే సమయంలో అధికారిక సామాగ్రి భాగస్వామ్య హక్కుల బిడ్లకు ఆహ్వానించింది. భారత క్రికెట్ జట్టుతో 2020 సెప్టెంబర్ వరకు కాంట్రాక్ట్ ఉన్న ‘నైకీ’... అందుకోసం గత ఏడాది బోర్డుకు రూ. 370 కోట్లు చెల్లించింది. మొత్తంగా తమ బ్రాండ్‌ను ధరిస్తున్నందుకు కాంట్రాక్ట్ అమల్లో ఉన్న సమయంలో జరిగే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు నైకీ దాదాపుగా 87 లక్షల 34 వేలు రూపాయలు బీసీసీఐకి చెల్లించింది.(ధోనితో పోలికపై రోహిత్ స్పందన) ఆటగాళ్ల ఫిర్యాదే కారణమా..? ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉన్న ‘నైకీ’ 2006 నుంచి భారత క్రికెట్ టీమ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.అయితే 2016లో మరొకసారి ఒప్పందం చేసుకున్న తర్వాతే అసలు కథ మొదలైంది. అధికారిక అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ తమకు అందజేస్తున్నకిట్లపై ఆటగాళ్లు అసంతృప్తిగా వ్యక్తం చేసినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ప్రధానంగా తమకు అందించే జెర్సీలు నాసిరకంగా ఉన్నాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు పలువురు ఫిర్యాదు చేశారనేది ప్రధాన సారాంశం. దీనిలో భాగంగానే మధ్యలో ఒప్పందం రద్దు చేసుకోవడం కుదరదు కాబట్టి దానితో బీసీసీఐ కటీఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (నా గులాబీకి గులాబీలు: హార్దిక్) -
'ఎన్ని వైరస్లు వచ్చినా మేం భయపడం'
ఒరెగాన్ : కరోనా వైరస్ మహమ్మారి దాటికి విశ్వవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే మెళ్లిగా ఇప్పుడిప్పుడే అన్ని రకాల క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఆట ఏదైనా సరే జనాలు మైదానంలోకి గుంపులుగా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత స్పోర్ట్ అడ్వర్టైజింగ్ కంపెనీ నైక్ కరోనా వైరస్‌కు బయపడేది లేదంటూ తన ట్విటర్ ద్వారా ఒక ఉత్తేజపరిచే వీడియోతో మన ముందుకొచ్చింది. దాదాపు 1.39 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అన్ని రకాల క్రీడలతో పాటు 36 మంది పాతతరం, కొత్తతరం స్టార్ ఆటగాళ్లను కలిపి చూపించారు. రఫెల్ నాదల్, జొకొవిచ్, టీమిండియా క్రికెట్ మహిళల టీం, క్రిస్టియానో రొనాల్డొ, సెరెనా విలియమ్స్, లెబ్రన్ జేమ్స్, కొలిన్ కెపెర్నిక్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు కనిపిస్తారు. ('నాకు కరోనా వచ్చి మేలు చేసింది') 'వీ ఆర్ నెవర్ ఎలోన్..' అంటూ సాగే వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'కరోనా లాంటి ఎన్ని వైరస్లు వచ్చినా మేం బభయపడం. అథ్లెట్స్‌గా మేం ఎప్పుడు ఒంటరివాళ్లం కాదు.. మేమంతా ఐక్యంగా ఉంటూనే ఏ విషయమైనా కలిసే పోరాడుతాం. మా ఆటలే మమ్మల్ని ఈరోజుకు ఐక్యంగా ఉండేలా చేశాయి. కరోనా వైరస్ ఆటకు మమ్మల్ని దూరం చేసినా.. తిరిగి మళ్లీ అదే శక్తితో కలసికట్టుగా వస్తున్నాం' అంటూ ఫీమేల్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో కొనసాగుతుంది. ఈ వీడియోకు అమెరికన్ సాకర్ ప్లేయర్ మేడన్ రాపినో వాయిస్ ఓవర్ అందించారు. యూ కాంట్ స్టాప్ స్పోర్ట్.. యూ కాంట్ స్టాప్ అస్ అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం నైక్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే దాదాపు 13 మిలియన్ల మంది వీక్షించారు. Nothing can stop what we can do together. You can’t stop sport. Because #YouCantStopUs. Join Us | https://t.co/fQUWzDVH3q pic.twitter.com/YAig7FIL6G — Nike (@Nike) July 30, 2020 -
ఆపిల్, నైక్, సోని ఆఫీసుల మూసివేత
బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే 36 కరోనా (కొవిడ్–19) వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇక్కడ ఒక్క రోజే ఇంతమందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడ ఇప్పటివరకు వైరస్ బాధితుల సంఖ్య 87కు పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధి వల్ల మృత్యువాత పడే అవకాశం ఉందంటూ ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ గురువారం దేశ పౌరులను హెచ్చరించారు. వైరస్ విస్తరించకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’) ఈ నేపథ్యంలో లండన్‌లోని తమ ప్రధాన కార్యాలయాలను నైక్, సోని పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలు మూసివేశాయి. ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా సోని కంపెనీ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. బెల్ఫాస్ట్లోని ఆపిల్ స్టోర్‌లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం కార్యాలయాన్ని, ఆ కార్యాలయం ఉన్న మైఫేర్ భవనాన్ని పూర్తిగా శుద్ధి చేశారు. ఇవాళ్టి (గురువారం) నుంచి కొంతకాలంపాటు తమ స్టోర్‌ను మూసివేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. (అమెజాన్, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ ) లండన్‌లోని డిలాయిట్ ఉద్యోగికి, గోల్డ్స్మిత్స్ యూనివర్శిటీలో ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లయితే వారు వెంటనే సంబంధిత ఆస్పత్రిని సంప్రతించాలని, మొదటి రోజు నుంచే సిక్ లీవుకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని కూడా బ్రిటన్ అధికారులు ప్రకటించారు. సాధారణంగా ఉద్యోగులు నాలుగు రోజులు జబ్బు పడితేనే నాలుగవ రోజు నుంచి మాత్రమే సిక్ లీవుకు చెల్లింపులు అమలు చేస్తారు. (పడకేసిన పర్యాటకం..కుదేలైన వాణిజ్యం) -
ఆ షూస్ ధర రూ. 3 కోట్లు!
నైక్ షూ కంపెనీ చరిత్రలో అతి పెద్ద రికార్డు నమోదయింది. 1972 సంవత్సరంలో తయారు చేసిన ఒక జత బూట్లను వేలం వేయగా.. అవి రూ. 3 కోట్లకు పైగా ధర పలికాయి. వేలంలో రికార్డు సృష్టించిన ఈ బూట్లను 'మూన్ షూ' పేరిట 1972లో ఒలింపిక్ ట్రయల్స్‌లో రన్నర్లు ధరించడానికి రూపొందించారు. 12 జతలు మాత్రమే తయారు చేసిన ఈ బూట్లలో మొట్టమొదటి జతను మైల్స్ నాదల్ అనే వ్యక్తికి అమ్మారు. కెనడాలోని టొరంటోకు చెందిన ఆయనకు ఒక మ్యూజియం ఉండేది. ఈ మ్యూజియంలో కార్ల సేకరణతో పాటు బూట్లను సైతం ప్రదర్శించాలని అభిరుచి ఉండేది. ఈ క్రమంలో 'మూన్ షూస్'ను కొనడానికి ఒక వారం ముందు సోథెబైస్ అనే ఆన్లైన్ నిర్వహించిన వేలంలో 99 ఇతర జతల బూట్లు కూడా కొన్నాడు. వీటన్నింటికి కలిపి కోటి పది లక్షల రూపాయలు వెచ్చించాడు. ఇక మూన్ షూ రికార్డు వేలం పట్ల మైల్స్ నాదల్ స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు తయారు చేయబడిన అరుదైన జత స్నీకర్లలో ఐకానిక్ షూ నైక్ 'మూన్ షూస్' అని క్రీడా చరిత్ర , పాప్ సంస్కృతిలో సరికొత్త చరిత్ర సృష్టింది’ అని ఆనందం వ్యక్తం చేశాడు. తాను ప్రారంభంలో కొనుగోలు చేసిన 99 జతల బూట్ల పట్ల తనకు సంతృప్తి ఇవ్వలేదన్నాడు. మూన్ షూకు ఇంత ధర పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. -
ఫెడరర్ శుభారంభం
లండన్: తొమ్మిదో సారి వింబుల్డన్ టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన దిగ్గజ ఆటగాడు, టాప్ సీడ్ రోజర్ ఫెడరర్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. టోర్నీ తొలి రోజు సోమవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–1, 6–3, 6–4తో డ్యుసాన్ లజోవిక్ (సెర్బియా)ను చిత్తు చేశాడు. కేవలం 79 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ముందు లజోవిక్ నిలవలేకపోయాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా విజయం సాధించి ముందంజ వేశాడు. సిలిచ్ 6–1, 6–4, 6–4తో నిషియోకా (జపాన్)ను ఓడించాడు. మహిళల విభాగంలో తొలి రోజే పెద్ద సంచలనం నమోదైంది. నాలుగో సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. క్రొయేషియాకు చెందిన డోనా వెకిక్ 6–1, 6–3తో స్టీఫెన్స్‌ను చిత్తుగా ఓడించింది. రెండో సీడ్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–3తో వర్వరా లెప్చెంకో (అమెరికా)ను చిత్తు చేసి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–5, 6–3తో అరాంటా రుస్ (నెదర్లాండ్స్)ను ఓడించి ముందంజ వేసింది. వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–7, 6–2, 6–1తో జొహన్నా లార్సన్ (స్వీడన్)పై గెలిచి తర్వాతి రౌండ్లోకి ప్రవేశించింది. భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో థామస్ ఫాబియానో (ఇటలీ) 2–6, 6–3, 6–3, 6–2తో బాంబ్రీని ఓడించాడు. 2 గంటల 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో యూకీ తొలి సెట్ గెలుచుకోగలిగినా... ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఏడాదికి రూ. 200 కోట్లు! రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత ‘నైకీ’ సంస్థతో కొనసాగించిన అనుబంధాన్ని ఫెడరర్ ముగించాడు. కొత్తగా జపాన్‌కు చెందిన ‘యునిక్లో’తో ఒప్పందం కుదుర్చుకున్న అతను, తొలిసారి వింబుల్డన్ మ్యాచ్‌లో ఆ సంస్థకు చెందిన కిట్‌తో బరిలోకి దిగాడు. పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం విలువ సుమారు 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 వేల కోట్లు) వరకు ఉందని సమాచారం. నైకీ ఇస్తున్నదానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. కాంట్రాక్ట్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఫెడరర్ ఆటగాడిగా రిటైర్ అయినా అతనికి అంతే డబ్బు లభిస్తుంది. అయితే ఫెడరర్ సొంత బ్రాండ్ ‘ఆర్ఎఫ్’ హక్కులు మాత్రం ఇంకా నైకీ వద్దనే ఉన్నాయి. అయితే తన పేరుతో ఉన్న బ్రాండ్ కాబట్టి ఇప్పుడు కాకపోయినా... మరి కొద్ది రోజుల తర్వాత దాని హక్కులు తనకే దక్కుతాయని ఈ స్విస్ స్టార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
‘నైకీ’ నచ్చడం లేదు!
∙ టీమ్ కిట్‌పై భారత ఆటగాళ్ల ఫిర్యాదు ∙ కొత్త దుస్తులు పంపించిన నైకీ ముంబై: మైదానంలో అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తమకు సంబంధించిన ఒక కొత్త ఫిర్యాదును ముందుకు తెచ్చింది. అధికారిక అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ తమకు అందజేస్తున్న కిట్లపై ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉన్న ‘నైకీ’ 2006 నుంచి భారత క్రికెట్ టీమ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలలుగా వివిధ మ్యాచ్‌లలో తాము ధరిస్తున్న జెర్సీలు ‘నాసిరకంగా’ ఉన్నాయని కెప్టెన్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు బీసీసీఐకి తెలియజేశారు. భారత క్రికెట్ జట్టుతో 2020 సెప్టెంబర్ వరకు కాంట్రాక్ట్ ఉన్న ‘నైకీ’... అందుకోసం గత ఏడాది బోర్డుకు రూ. 370 కోట్లు చెల్లించింది. మొత్తంగా తమ బ్రాండ్‌ను ధరిస్తున్నందుకు కాంట్రాక్ట్ అమల్లో ఉన్న సమయంలో జరిగే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు నైకీ దాదాపుగా రూ. 87 లక్షల 34 వేలు బీసీసీఐకి చెల్లిస్తోంది. భారత ఆటగాళ్ల ఫిర్యాదు గురించి తెలుసుకున్న ‘నైకీ’ వెంటనే స్పందించింది. తమ బ్రాండ్‌కు చెందిన కొత్త జెర్సీలు, ఇతర దుస్తులను బెంగళూరు నుంచి హడావిడిగా పంపించింది. పల్లెకెలె మైదానంలో మంగళవారం క్రికెటర్ల ఆప్షనల్ ప్రాక్టీస్ సమయానికి కిట్లు మైదానం చేరుకున్నాయి. నలుగురు సభ్యుల ‘నైకీ’ బృందం టీమిండియా ఆటగాళ్లు, అధికారులతో కూడా అక్కడే చర్చించింది. ధోని, రోహిత్ శర్మలు కొత్త జెర్సీలను పరిశీలించిన తమ అభిప్రాయాలు, సూచనలు వారికి తెలియజేశారు. కోహ్లి కోసమేనా... భారత కెప్టెన్‌గా, నంబర్‌వన్ ఆటగాడిగా శిఖరాన ఉన్న విరాట్ కోహ్లి ఇప్పుడు ఏం చేసినా, చెప్పినా అది చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కోచ్‌గా కుంబ్లేను తొలగించడం అలాంటి పరిణామమే. తాజాగా ‘నైకీ’ గురించి ఆటగాళ్లు గళమెత్తడం వెనక కూడా కోహ్లినే కారణమని వినిపిస్తోంది. బయటికి నాణ్యతాలోపం గురించి చెప్పినా అసలు విషయం కోహ్లి బ్రాండ్ ‘పూమా’కు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అంతర్గత సమాచారం. ‘పూమా’తో గత ఫిబ్రవరిలో కోహ్లి రూ. 110 కోట్ల భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవలే అది అమల్లోకి వచ్చింది. అయితే ఉసేన్ బోల్ట్ సహా పలువురు స్టార్ ఫుట్‌బాలర్లు ‘పూమా’కు అంబాసిడర్లుగా ఉన్నా...నైకీ, అడిడాస్‌లతో పోలిస్తే ఆ బ్రాండ్ మార్కెట్ భారత్‌లో చాలా తక్కువ. దానిని పెంచుకునే ప్రయత్నంలోనే అది కోహ్లిని ఎంచుకుంది. భారత్‌లో ఎక్కువ మందికి చేరువ కావాలంటే క్రికెట్‌తో జత కట్టాల్సిన అవసరాన్ని ‘పూమా’ గుర్తించింది. నంబర్‌వన్ బ్రాండ్‌ను పదేళ్లకు పైగా వాడుతున్న తర్వాత జెర్సీల నాణ్యత గురించి ఆటగాళ్లు ప్రశ్నించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ సాకుతో ఒప్పందంలో ఉన్న ‘అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయవచ్చు’లాంటి క్లాజ్‌ను ఉపయోగించించి ఇప్పుడు నైకీని కూడా పక్కన పెడతారా, ఆ తర్వాత కోహ్లి కోరితే పూమాను ముందుకు తెస్తారా అనేది చూడాల్సిందే. -
కొత్త జెర్సీలో టీమిండియా చమక్ చమక్!
-
కొత్త జెర్సీలో టీమిండియా చమక్ చమక్!
టీమిండియా ఆటగాళ్లకు నూతన సంవత్సరం కానుకగా కొత్త జెర్సీని తీసుకొచ్చారు. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు, మహిళా ఆటగాళ్లు నూతన జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. భారత జెర్సీలో స్వల్ప మార్పులు చేసిన నైకీ సంస్థ, బీసీసీఐతో కలిసి నూతన కిట్ ను గురువారం ఆవిష్కరించింది. ప్రస్తుతం టీమిండియాకు నైకీ సంస్థ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, అజిక్యా రహానేలతో పాటుగా మహిళా టీమ్ ప్లేయర్స్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లను ఈ ఫొటోలో చూడవచ్చు. టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొత్త కెప్టెన్ తో పాటు కొత్త జెర్సీతో ఈ ఏడాది ప్రారంభించబోతోంది. గతంలో ప్లాస్టిక్ రీసైకిల్ చేసిన ప్రొడక్ట్స్ తో 2015లో చివరిసారిగా జెర్సీని ప్రవేశపెట్టారు. భుజాల పక్కన భారత త్రివర్ణ పతాక రంగులతో చారలను ప్రింట్ చేశారు. ఈ 15న కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ తో తలపడనున్న టీమిండియా నూతన జెర్సీతో బరిలోకి దిగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ జెర్సీలో 4డీ క్విక్ నెస్, ట్యూన్డ్ బ్రీతబిలిటీ, జీరో డిస్ట్రాక్షన్ ఫీచర్లు ఉన్నాయని.. ఎండ వేడిమిని తట్టుకునేందుకు జెర్సీ చాలా సౌకర్యంగా ఉంటుందని నైకీ సంస్థ తెలిపింది. -
నష్టాల దెబ్బకు.. నైక్ విలవిల
దేశంలో 30% స్టోర్ల మూసివేత * భాగస్వాముల సంఖ్య కూడా కుదింపు * బ్యాట్స్ స్పాన్సర్‌షిప్‌పై పునరాలోచన ప్రపంచ దిగ్గజ స్పోర్ట్స్వియర్ తయారీ కంపెనీ ‘నైక్’ తాజాగా భారత్‌లో దాదాపు 35 శాతం స్టోర్లను మూసివేసింది. నష్ట నివారణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి దేశంలో 200 స్టోర్లు ఉన్నాయి. ఈ అంశాల గురించి నైక్ ఇండియా ప్రతినిధిని సంప్రదిస్తే.. అయన ఎలాంటి సమాధానమివ్వలేదు. నైక్ కంపెనీ దేశంలో తన భాగస్వాముల సంఖ్యను కూడా తగ్గించుకుంటునట్లు తెలుస్తోంది. తన కార్యకలాపాలను 3-4 భాగస్వాముల ద్వారా నిర్వహించే అవకాశముంది. కాగా కంపెనీకి ఇది వరకు 20 వరకూ భాగస్వాములు ఉన్నారు. నైక్‌కు ఎస్‌ఎస్‌ఐపీఎల్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. దీని తర్వాతి స్థానంలో ఆర్జే కార్ప్ ఉంది. ఈ మధ్యకాలంలో చాలా నైక్ స్టోర్లు మల్టీబ్రాండెడ్ ఔట్లెట్స్గా మారాయి. రూ.541 కోట్ల నష్టాలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గణాంకాల ప్రకారం.. 2014-15లో నైక్ మొత్తం నష్టాలు రూ.541 కోట్లుగా నమోదయ్యాయి. కాగా నైక్ ప్రత్యర్థులైన అడిడస్ నష్టాలు రూ.68 కోట్లుగా, రీబాక్ నష్టాలు రూ.2,198 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2015తో ముగిసిన ఏడాదిలో ప్యూమ లాభాలు రూ.47 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాట్స్ స్పాన్సర్షిప్ ఉంటుందా? ఇండియన్ క్రికెటర్లకి బ్యాట్స్ని స్పాన్సర్షిప్ చేసే వ్యూహాన్ని నైక్ పునఃసమీక్షించుకుంటోంది. నైక్ సంస్థ అజింక్య రహానే, అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్ వంటి పలు క్రికెటర్లకు కిట్స్, బ్యాట్స్‌ను అందించడానికి ఏడాదికి రూ.60 కోట్ల వరకూ వెచ్చిస్తోంది. ఒక కంపెనీ ఎక్కడైనా క్రికెటర్‌కు బ్యాట్‌ను స్పాన్సర్ చేయాలంటే రూ.25 లక్షల నుంచి రూ.8 కోట్ల వరకూ ఖర్చవుతుంది. కోహ్లి.. బ్యాట్ స్పాన్సర్షిప్ రూ.8 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం వల్ల నైక్‌కు నష్టాలు పెరిగాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కంపెనీ రిటై ల్ మార్కెట్ విస్తరణ ప్రణాళికలు కూడా సరిగ్గా లేవని పేర్కొన్నారు. దీంతో చాలా స్టోర్లు మూతపడ్డాయని తెలిపారు. -
భారీగా మూతపడుతున్న నైక్ స్టోర్స్
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ నైక్ దేశంలో భారీ ఎత్తున తన దుకాణాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించిందట. ఇటీవలి భారీ నష్టాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ మేకర్ అమెరికాకు చెందిన నైక్ దాదాపు 35శాతం స్టోర్లను మూసివేస్తున్నట్టు సమాచారం. భాగస్వాముల సంఖ్యను తగ్గించుకొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానించారు. గతంలో 20 మందిగా పార్టనర్ల సంఖ్యను రెండునుంచి మూడుకు తగ్గించే యోచనలో ఉందని తెలిపారు. పెట్టుబడులపై క్షీణించిన ఆదాయం, తప్పుడు మార్కెటింగ్ విధానాలే సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయని, రీటైల్ వ్యాపార విస్తరణ ప్లాన్ కూడా విఫలమైన కారణంగా దుకాణాల మూసివేతకు దారితీసిందని మరో పరిశ్రమ పెద్ద అభిప్రాయపడ్డారు. అలాగే క్రికెట్ పై సంవత్సరానికి దాదాపు 60 కోట్లకు పైగా వెచ్చించే నైక్...భారత క్రీకెట్ దిగ్గజాలకు కిట్ల స్పాన్సరింగ్ విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్టు సమాచారం. కాగా నైక్ ప్రస్తుతం సుమారు 200 దుకాణాలను నిర్వహిస్తున్న నైక్ అడిడాస్ , రీ బ్యాక్, ప్యూమా లాంటి ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా ప్రీమియం షూస్, దుస్తులు తదితర అమ్మకాల్లో పేరు గడించిన సంగతి తెలిసిందే. -
అనుకోకుండా అగాధంలోకి...
నిప్పులు చిమ్ముతు నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో వీరే... నెత్తురు కక్కుతు నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే... ఎప్పుడో మన శ్రీ శ్రీ రాసిన ఈ మాట ఇప్పుడు టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు అతికినట్టు సరిపోతుంది. టెన్నిస్ చరిత్రలో అత్యంత ‘ఖరీదైన’ క్రీడాకారిణిగా ఆకాశానికెత్తిన సమాజం... ఇప్పుడు డోపింగ్‌లో విఫలం కావడంతో విమర్శల వర్షం కురిపిస్తోంది. తెలిసి చేసినా, పొరపాటున చేసినా షరపోవా చాలా ఖరీదైన తప్పు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిన్నప్పుడు అమెరికా వెళ్లిన ఓ అమ్మాయి... 1200 కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచంలోనే ఎక్కువ సంపాదన ఉన్న క్రీడాకారిణిగా ఎదిగింది. ఇన్నాళ్లూ ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం. కానీ డోపింగ్ వివాదంతో ఆ పేరు పోగొట్టుకుంది. సాక్షి క్రీడావిభాగం: సాధారణంగా ఆట, అందం ఒకే చోట ఉండటం అరుదు. కానీ షరపోవాలో ఈ రెండూ ఉన్నాయి. అందుకే ఆమె కోట్లాది మంది టెన్నిస్ అభిమానులకు ఆరాధ్య దేవత. ఆట విషయంలో, మార్కెటింగ్ విషయంలోనూ ఆమె చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఏ రోజూ ట్రైనింగ్ షెడ్యూల్‌ను తప్పదు. డైట్ దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక తనని తాను మార్కెట్ చేసుకోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లు ఆమె కోసం క్యూ కట్టాయి. కానీ ఒకే ఒక చిన్న నిర్లక్ష్యానికి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. ఒక ఈ-మెయిల్‌ను తెరచి జాగ్రత్తగా చదవకపోవడం వల్ల ఇంత అనర్థం జరిగింది. తన కెరీర్‌నే అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాన్న సంకల్పం టెన్నిస్‌లో షరపోవా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో తండ్రి యూరీ పాత్ర ఎనలేనిది. 1987లో ఏప్రిల్ 19న రష్యాలోని న్యాగన్ పట్టణంలో యూరీ, యెలానా దంపతులకు షరపోవా జన్మించింది. అంతకుముందు ఏడాది చెర్నోబిల్ అణు కర్మాగారంలో సంభవించిన విస్ఫోటం వల్ల ఆ ప్రభావం తమ ఆరోగ్యంపై పడకూడదనే ఉద్దేశంతో షరపోవా కుటుంబం 1989లో సోచి పట్టణానికి మకాం మార్చింది. అక్కడే టెన్నిస్ కోచ్ అలెగ్జాండర్ కఫెల్నికోవ్తో యూరీకి పరిచయం ఏర్పడింది. 1991లో షరపోవాకు అలెగ్జాండర్ కఫెల్నికోవ్ ఒక రాకెట్ ఇచ్చారు. ఈ రాకెట్‌తో షరపోవా తన తండ్రితో కలిసి స్థానిక పార్క్‌లో టెన్నిస్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత తన కూతురిని మేటి టెన్నిస్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తండ్రి యూరీ వెటరన్ కోచ్ యూరీ యుట్కిన్ వద్ద శిక్షణ ఇప్పించారు. 1993లో మాస్కోలో దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నిర్వహించిన టెన్నిస్ క్లినిక్‌కు షరపోవా హాజరైంది. అక్కడే ఆరేళ్ల షరపోవా ఆటతీరును గమనించిన నవ్రతిలోవా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న విఖ్యాత నిక్ బొలెటరీ టెన్నిస్ అకాడమీలో చేర్పించాలని తండ్రి యూరీకి సూచించింది. తల్లికి దూరంగా... ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంగ్లిష్ భాష తెలియనప్పటికీ... తన కూతురు భవిష్యత్ బాగుండాలనే లక్ష్యంతో యూరీ అప్పు చేశాడు. 1994లో చేతిలో 700 డాలర్లు పెట్టుకొని యూరీ, షరపోవా అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అడుగుపెట్టారు. వీసా సమస్యల కారణంగా షరపోవా వెంట ఆమె తల్లి రాలేకపోయింది. రెండేళ్లు తల్లికి దూరంగానే షరపోవా ఉండాల్సి వచ్చింది. మరోవైపు తాము తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో యూరీ చిన్నా చితకా పనులు చేసి సంపాదించారు. చివరికి హోటళ్లలో ప్లేట్లు కూడా కడిగారు. కొంతకాలం స్థానిక రిక్ మాకీ అకాడమీలో శిక్షణ పొందిన షరపోవా కెరీర్ 1995లో మలుపు తిరిగింది. ఆమె ప్రతిభను గమనించిన ఐఎంజీ సంస్థ షరపోవాతో 1995లో ఒప్పందం చేసుకుంది. నిక్ బొలెటరీ అకాడమీలో ఉండి శిక్షణ పొందేందుకు ఏడాదికి అవసరమయ్యే 35 వేల డాలర్ల ఫీజును చెల్లించడానికి ఐఎంజీ సంస్థ అంగీకరించింది. దాంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో షరపోవా నిక్ బొలెటరీ అకాడమీలో చేరింది. అక్కడి నుంచి షరపోవాకు ఎదురులేకుండా పోయింది. 2000లో 13 ఏళ్ల ప్రాయంలో ఎడ్డీ హెర్ అంతర్జాతీయ టోర్నీలో షరపోవా అండర్-16 విభాగంలో టైటిల్ సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తన ఆటకు మరింత పదును పెట్టుకొని 14 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌గా మారింది. 2003 చివరికొచ్చేసరికి టాప్-50లోకి వచ్చింది. టెన్నిస్‌లో రష్యా విప్లవం ఒక్కో మెట్టు ఎక్కిన షరపోవా 2004లో మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ఏడాది వింబుల్డన్ ఫైనల్లో షరపోవా వరుస సెట్లలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. వింబుల్డన్ టైటిల్ గెలిచినందుకు వచ్చిన ప్రైజ్‌మనీతో షరపోవా తన తండ్రి పేరిట ఉన్న అప్పులను తీర్చేసింది. 2005 ఆగస్టులో ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగిన షరపోవా ఈ ఘనత సాధించిన తొలి రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2006లో ఆమె యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. షరపోవా విజయాల స్ఫూర్తితో రష్యాలో టెన్నిస్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు టెన్నిస్ క్రీడను కెరీర్‌గా ఎంచుకోవడం మొదలుపెట్టారు. 2007లో భుజం గాయంతో షరపోవా కొంతకాలంపాటు ఆటకు దూరమైంది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి ఫామ్‌లోకి వచ్చిన ఈ రష్యా స్టార్‌కు భుజం గాయం తిరగబెట్టింది. దాంతో పది నెలలపాటు ఆటకు దూరమైంది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకున్న షరపోవా లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. 2013లో అంతగా ఆకట్టుకోలేకపోయినా... 2014లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించి తనలో చేవ తగ్గలేదని నిరూపించుకుంది. 2015లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా... సెరెనా ధాటికి రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరిన షరపోవా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరమైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న షరపోవా ఈ టోర్నీ సందర్భంగా డోప్ టెస్టులో పట్టుబడింది. ఏం జరిగినా... ఇకపై మహిళల టెన్నిస్‌కు కొంత కళ తగ్గుతుందనేది వాస్తవం. షరపోవా కోసమే టెన్నిస్ చూసే అభిమానులు లక్షల్లో ఉంటారు. వాళ్లందరికీ నిరాశ తప్పదు. అయితే నాలుగేళ్ల తర్వాతైనా తిరిగి మళ్లీ వచ్చి కొంతకాల ఆడి సగర్వంగా వైదొలగాలనే షరపోవా ఆశ తీరాలనేది ఆమె అభిమానుల ఆకాంక్ష. -
హతవిధీ!
ఓ చిన్న తప్పు... టెన్నిస్ క్రీడకు మచ్చ తెచ్చింది. ఓ చిన్న నిర్లక్ష్యం... గొప్ప క్రీడాకారిణి కెరీర్‌కు కళంకం తెచ్చింది. తెలిసి చేసిందో... తెలియక చేసిందోగానీ.. చేసిన చిన్న తప్పిదానికి రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా భారీ మూల్యం చెల్లించింది. ఎండకు ఎండి... చెమటకు తడిచి నిర్మించుకున్న 15 ఏళ్ల ఉజ్వల కెరీర్‌కు ఊహించని రీతిలో బ్రేక్ పడింది! ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టులో షరపోవా విఫలమైంది. నిషేధిత ఉత్ప్రేరకం వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. షరపోవా డోప్ టెస్టులో విఫలమైన వార్తతో టెన్నిస్ ప్రపంచం ఉలిక్కి పడింది. * డోపింగ్ టెస్టులో విఫలమైన షరపోవా * మెల్డోనియం వాడినట్లు నిర్ధారణ * నాలుగేళ్లు నిషేధం పడే అవకాశం లాస్ ఏంజిల్స్ (అమెరికా): రష్యా టెన్నిస్ స్టార్, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత మరియా షరపోవా డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘మెల్డోనియం’ను వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో షరపోవాపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. ఇది ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 26న నిర్వహించిన డోప్ పరీక్షలో షరపోవా మెల్డోనియం వాడినట్లు తేలడంతో మార్చి 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. సోమవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రష్యా క్రీడాకారిణి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కేసు విచారణలో ఉండటంతో నిషేధం, జరిమానా ఎంత విధిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం అథ్లెట్లు ఉద్దేశపూర్వకంగా ఈ మందును తీసుకున్నారని తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం, తెలియక జరిగిన తప్పుగా భావిస్తే రెండేళ్ల నిషేధం, స్వల్ప జరిమానా విధించే అవకాశాలున్నాయి. అసలు కథ ఇది! వాస్తవానికి షరపోవా 2006 నుంచే మెల్డోనియంను వాడుతోంది. కానీ ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ డ్రగ్‌ను ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని అథ్లెట్లందరికీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ మెయిల్‌ను చదివిన షరపోవా కాస్త నిర్లక్ష్యపు ధోరణితో నిషేధిత డ్రగ్స్ జాబితాకు సంబంధించిన లింక్‌ను మాత్రం తెరచి చూడలేదు. దీంతో యధావిధిగా మెల్డోనియం ఉపయోగించడంతో డోపింగ్‌లో పట్టుబడింది. రక్త ప్రసరణ పెంచుతుంది తాను తరచుగా ఫ్లూ బారిన పడుతుండటం, కుటుంబంలో చాలా మందికి షుగర్ వ్యాధి ఉండటం, శరీరంలో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉండటం, గుండె సంబంధిత సమస్యల వంటి అనేక అంశాలతో గత పదేళ్ల నుంచి మెల్డ్రోనేట్ (మెల్డోనియం)ను వాడుతున్నట్లు షరపోవా తెలిపింది. అయితే మెల్డ్రోనేట్, మెల్డోనియం ఒకే రకమైన డ్రగ్ అనే విషయం తనకు తెలియదని చెప్పింది. మరోవైపు ఐషిమియా (శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం) వ్యాధిగ్రస్తుల్లో రక్త ప్రసరణ పెంచడానికి మెల్డోనియంను ఉపయోగిస్తారు. దీనివల్ల ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం పెరుగుతుంది. మెల్డోనియం తీసుకోవడం వల్ల అథ్లెట్లలో ఎక్స్‌ర్‌సైజ్ చేసే సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు మైదానంలో మెరుగైన ప్రదర్శనకు కారణం అవుతుందని వివిధ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్న ‘వాడా’ ఎస్-4 నిషేధిత జాబితాలో చేర్చింది. లాత్వియా దేశంలో తయారయ్యే ఈ మందును రష్యా, బాల్టిక్ దేశాల్లో మాత్రమే అమ్ముతారు. అమెరికా ఎఫ్‌డీఏతో పాటు యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీనికి ఆమోదం లేదు. మరికొంత మంది కూడా... ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ మందును వాడిన మరికొంత మంది అథ్లెట్లు కూడా డోప్ పరీక్షలో విఫలమయ్యారు. అబెబీ అర్గెవీ (మహిళల 1500 మీటర్లు), ఎండేషా నెగేస్సి (మారథాన్), ఓల్గా అబ్రామోవా, అర్టెమ్ టైచెంకో (ఉక్రెయిన్ బైఅథ్లెట్స్), ఎడ్వర్డ్ ఓర్గనోవ్ (రష్యా సైక్లిస్ట్), ఎకతెరినా (రష్యా ఐస్ డాన్సర్)లు డోపీలుగా తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. నైకీ బై బై డోపింగ్ ఉదంతం బయటకు రావడంతో వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు కుమ్మరించే స్పా న్సర్లు ఒక్కొక్కరుగా తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రముఖ క్రీడావస్త్రాల సంస్థ ‘నై కీ’... షరపోవాతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుం ది. స్విస్ వాచ్ కంపెనీ ‘టాగ్ హ్యుయేర్’ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి నిరాకరించింది. ‘నేను డోప్ పరీక్షలో విఫలమయ్యా. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. చాలా పెద్ద తప్పు చేశా. నా అభిమానులకు, టెన్నిస్‌కు తలవంపులు తీసుకొచ్చా. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టా. అప్పట్నించీ ఆటలోనే మునిగితేలా. ప్రస్తుత పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలుసు. నా కెరీర్‌ను ఇలా ముగించాలని అనుకోవడంలేదు. టెన్నిస్ ఆడేందుకు నాకు ఇంకో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా.’ - షరపోవా ప్రొఫైల్ పూర్తి పేరు: మరియా షరపోవా పుట్టిన తేదీ: ఏప్రిల్ 19, 1987 పుట్టిన స్థలం: న్యాగన్, రష్యా నివాసం: ఫ్లోరిడా, అమెరికా ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 59 కేజీలు ప్రొఫెషనల్‌గా మారింది: 2001లో అత్యుత్తమ ర్యాంక్: 1 (2005, ఆగస్టు) ప్రస్తుత ర్యాంక్: 7 కెరీర్ సింగిల్స్ టైటిల్స్: 35 కెరీర్ డబుల్స్ టైటిల్స్: 3 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్: వింబుల్డన్ (2004), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008), ఫ్రెంచ్ ఓపెన్ (2012, 2014), యూఎస్ ఓపెన్ (2006) గెలుపోటములు: 601-145 సంపాదించిన ప్రైజ్‌మనీ: 3,67,66,149 డాలర్లు (రూ. 247 కోట్లు) -
షరపోవాకు దెబ్బ మీద దెబ్బ!
లాస్ ఏంజిల్స్: డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. గత పదేళ్లుగా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడుతున్నట్టు షరపోవా స్వయంగా వెల్లడించడంతో.. ఆమెతో వేలకోట్ల రూపాయల వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు రాంరాం చెప్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ నైకీ షరపోవాతో కాంట్రాక్టు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ఆమెతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించుకోబోమని ప్రఖ్యాత గడియారాల కంపెనీ ట్యాగ్ హోయర్ తెలిపింది. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన మరియా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని షరపోవా స్వయంగా వెల్లడించడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. 2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా చెప్పింది. 28 ఏళ్ల షరపోవాపై ఈ నెల 12 నుంచి తాత్కాలిక నిషేధం అమల్లోకి రానుంది. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది. ఆరు అడుగులకుపైగా ఎత్తుతో ఉండే ఈ అందాల సుందరి తిరుగులేని ఆటతో కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను ఏలింది. అత్యద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అందంతోపాటు ఆట కూడా ఉండటంతో ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షరపోవాతో కుదుర్చుకున్న 70 మిలియన్ డాలర్ల (రూ. 472 కోట్ల) కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్టు నైకీ ప్రకటించింది. అదేదారిలో ఇతర కంపెనీలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు షరపోవా మళ్లీ టెన్నిస్ మైదానంలో అడుగుపెట్టడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నప్పటికీ, రష్యా తరఫున ఆమె బ్రెజిల్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశముందని ఆ దేశ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. -
'గే' లపై కామెంట్స్‌తో కాంట్రాక్ట్ పోయే..
మనీలా: స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా నీచం అని వ్యాఖ్యానించి తరువాత క్షమాపణలు చెప్పిన ఫిలిప్పీన్స్ బాక్సర్ ఫకియావ్తో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ కంపెనీ నైక్ ప్రకటించింది. పకియావ్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, ఇలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలను తమ సంస్థ ఏ మాత్రం సహించబోదని నైక్ ఓ ప్రకటనను విడుదల చేసింది. లింగవివక్ష ఎదుర్కొంటున్న కమ్యూనిటీకి తమ సంస్థ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన పకియావ్ ఓ టీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తరువాత బైబిల్ చెబుతున్న విషయాన్నే నేను చెబుతున్నానని సమర్థించుకున్నా ఆయనపై విమర్శల పర్వం ఆగలేదు. ప్రస్తుతం పకియావ్ ఫిలిప్పీన్స్‌లో సెనేటర్ స్థానం కోసం పోటీలో ఉన్నాడు.