ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవని కేంద్రం తెలియజేసింది. లోక్‌సభలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2020 ప్రారంభంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అమలు కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్ అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేదని లోక్‌సభలో ప్రకటించారు. సంస్థకు నిర్వహణకు ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సరిపోతుందని చౌహాన్ చెప్పారు. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన స్థిరాస్తులపై కూడా చౌహాన్ సమాధానమిచ్చారు.మార్చి 31, 2021 నాటికి భవనాలు, భూములు, టవర్లు, టెలికాం పరికరాలు , నాన్-టెలికాం పరికరాలతో సహా స్థిరాస్తుల విలువ ఆడిట్ చేయబడిన ఆర్థిక గణాంకాల ప్రకారం రూ. 89,878 కోట్లుగా ఉందని వెల్లడించారు.
డిసెంబర్ 31, 2021 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ సబ్‌స్క్రైబర్లలో 9.90 శాతంగా, వైర్డు బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల వాటా 15.40 శాతంగా ఉందని తెలిపారు. 2019లో బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 50ఏళ్లు పైబడిన వారికీ వీఆర్‌ఎస్‌ను అమలు చేసే ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలను చేశారు. దాంతో పాటుగా 4జీ సర్వీసుల కోసం సెక్ర్టంను కూడా కేటాయించారు. పలు చర్యల ఫలితంగా 2020-21లో బీఎస్‌ఎన్‌ఎల్ అపరేటింగ్ లాభాలు పాజిటివ్‌గా మారాయని చౌహన్ పేర్కొన్నారు.
చదవండి: బీఎస్‌ఎన్‌ఎన్‌లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..!
Comments
Please login to add a commentAdd a comment