పెట్రోలు ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పేరుతో మరోసారి ఆయిల్ కంపెనీలు సామాన్యులపై భారం మోపాయి. పెట్రోలు, డీజిల్‌లపై 35 పైసల వంతున ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర 112.27లకు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.46లుగా నమోదు అయ్యింది.
అక్టోబరు వచ్చినప్పటి నుంచి పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.105.96లు ఉండగా డీజిల్ ధర రూ.99.55గా ఉంది. అప్పటి నుంచి కేవలం ఆరు రోజులు మినహా దాదాపు ఇరవై సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఈ నెలలో లీటరు పెట్రోలు ధర రూ.5.31 వరకు పెరిగింది. డీజిల్‌కి సంబంధించి ధర రూ.4.91 వరకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment