Petrol Diesel Prices Rise To New High On Oct 31: ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి పెంచాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసలు మేర పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 31, 2021) పెట్రోల్, డీజిల్‌పై పెంపుదల కనిపిస్తోంది.
►తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.34పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.98.07పైసలు వద్ద కొనసాగుతోంది.
►వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.115.15పై., డీజిల్ రూ.106.23కు చేరింది.
►కోలకత్తాలో పెట్రోలో రూ.109.79పైసలు, డీజిల్ రూ.101.19పైసలకు చేరాయి.
►హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.72కి చేరింది. డీజిల్ రూ.106.98 వద్ద కొనసాగుతోంది.
►విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.115.28 , రూ.107.94 గా ఉన్నాయి.
►చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.04, డీజిల్ రూ.102.25 గా ఉన్నాయి.
ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్‌ల ఆధారంగా ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాలో, పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.121 మార్కును దాటేశాయి.
Comments
Please login to add a commentAdd a comment