న్యూఢిల్లీ: టాటా పవర్ ప్రాజెక్టుల అవినీతి కేసులో పవర్ గ్రిడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ఆరుగురు సీనియనర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఐదుగురు టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ ఈస్టర్న్ రీజినల్ పవర్ సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై తాజా పరిణామం చోటు చేసుకుంది.
పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ ఝా, ఎగ్జిక్యూటివ్ వీపీ దేశరాజ్ పాఠక్, అసిస్టెంట్ వీపీ ఆర్ ఎన్ సింగ్ సహా ఐదుగురు సీనియర్ టాటా పవర్ ప్రాజెక్ట్స్ అధికారులను లంచం ఆరోపణలపై సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఐదుగురు టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్‌లను పంచకుల కోర్టులో హాజరుపరచనున్నారు.
ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్‌లోని సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో గురుగ్రాంలోని ఝా నివాసంలో సీబీఐ 93 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అక్రమ చెల్లింపులకు ప్రతిఫలంగా ఝా వివిధ ప్రాజెక్టులలో టాటా ప్రాజెక్ట్‌లకు అనుకూలంగా వ్యవహరించారనేది ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment