Tata Power Company
-
Tata Projects Case: పవర్‌గ్రిడ్‌కు సీబీఐ భారీ షాక్
న్యూఢిల్లీ: టాటా పవర్ ప్రాజెక్టుల అవినీతి కేసులో పవర్ గ్రిడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ఆరుగురు సీనియనర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఐదుగురు టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ ఈస్టర్న్ రీజినల్ పవర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై తాజా పరిణామం చోటు చేసుకుంది. పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ ఝా, ఎగ్జిక్యూటివ్ వీపీ దేశరాజ్ పాఠక్, అసిస్టెంట్ వీపీ ఆర్ ఎన్ సింగ్ సహా ఐదుగురు సీనియర్ టాటా పవర్ ప్రాజెక్ట్స్ అధికారులను లంచం ఆరోపణలపై సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఐదుగురు టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్‌లను పంచకుల కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా, ఘజియాబాద్‌లోని సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో గురుగ్రాంలోని ఝా నివాసంలో సీబీఐ 93 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అక్రమ చెల్లింపులకు ప్రతిఫలంగా ఝా వివిధ ప్రాజెక్టులలో టాటా ప్రాజెక్ట్‌లకు అనుకూలంగా వ్యవహరించారనేది ఆరోపణ. -
ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు
ముంబై: కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు దేశంలో ఏ ఇతర సంస్థ చేయలేని విధంగా దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ తెలిపింది. ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను మాల్స్, హోటళ్లు, రిటైల్ అవుట్ లెట్లు, పబ్లిక్ యాక్సెస్ ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ పేర్కొంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనలను ప్రోత్సహించడం కోసం దేశ వ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా దేశంలో దాదాపు 10,000 హోమ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇవి వాహన యజమానులకు ఈవీ ఛార్జింగ్ చేసుకునేందుకు సౌకర్యవంతంగా ఉన్నాయి అని కంపెనీ తెలిపింది. టాటా పవర్ ఈజెడ్ ఛార్జర్స్ ఎకోసిస్టమ్ ద్వారా ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తుంది. ముంబైలో మొదటి ఛార్జర్లను టాటా పవర్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 180 నగరాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న ఈ-హైవేల మీద 10,000కి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...!) -
భవిష్యత్తు మొత్తం ఈ వాహనాలదే!
ఒకప్పుడు రైలు బండ్లు బొగ్గుతో నడిచేవి, తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చాయి.. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ ఇంజన్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇక బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు దాదాపు అన్ని వాహనాలకు పెట్రోలు, డీజిలే ఆధారం. అయితే భవిష్యత్తులో ఇవన్నీ ఎలక్ట్రిక్ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎలా ఉంటుంది. ఈవీలకు సంబంధించి మౌలిక సదుపాయలకు సంబంధించి రాబోతున్న మార్పులపై టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయలు తెలిపారు. అందులో ప్రధాన విషయాలు మీ కోసం.. విస్తరిస్తున్న ఈవీ ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో అడుగు పెట్టాయి. రెండేళ్ల కిందటి నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈవీ టూవీలర్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాదు ఒకప్పుడు ఈవీ వెహికల్స్ ధరలు లక్షకు పైగానే ఉండేవి. ఇప్పుడు వాటి ప్రారంభ ధర రూ. 60,000ల దగ్గరకు వచ్చింది. ధరలే ముఖ్యం మిగిలిన దేశాలతో పోల్చితే భారతీయుల ఆలోచణ ధోరణి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఫీచర్లు, ఆప్షన్లు ఎన్ని ఉన్నా ధర ఎంత అన్నదే ప్రధానం. వస్తువు కొనుగోలులో ధర కీలకంగా మారుతుంది. పది లక్షల రూపాయల లోపు ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాగలిగితే పెను మార్పులు వస్తాయి. ఈవీ కార్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరుగుతాయి. ఆ దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. రాబోయే మూడునాలుగేళ్లలో మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు కూడా ఇదే తరహాలో విభిన్న శ్రేణిల్లో ఈవీ కార్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. టాటావే ఎక్కువ ఈవీ వెహికల్స్‌కి ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్య. ప్రస్తుతం ఈ సమస్యపై మార్కెట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మన దగ్గరున్న పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో టాటావే అధికం. వంద నగరాలతో పాటు జాతీయ రహదారుల వెంట టాటా ఆధ్వర్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంలో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు తేబోతున్నాం. అంతేకాదు షాపింగ్‌మాల్స్, కాఫీ షాప్స్, పార్కులు... తదితర జనాలు వచ్చి పోయే చోట్ల కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఛార్జింగ్ స్టేషన్లు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి దేశవ్యాప్తంగా 18,000 పెట్రోల్ బంకులలో ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను టాటా పవర్ నిర్మించబోతుంది. వీటికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఇక దేశవ్యాప్తంగా 75 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉన్నాయి. మిగిలిన కంపెనీలు కూడా ఇదే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా పబ్లిక్ ప్లేస్‌లలో ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సమస్య రానివ్వం మన దగ్గర పవర్ కట్ సమస్య ఉంది. ముఖ్యంగా రూరల్ ఇండియాలో కరెంటో కోత సర్వసాధారణమైన సమస్య. దీనిపై అవగాహన ఉంది. పవర్ కట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పని తీరుపై ప్రభావం పడకుండా అందుబాటులో కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తాం. పవర్ కట్ వచ్చినా ఛార్జింగ్ స్టేషన్ పని చేసేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం,. - సాక్షి, వెబ్‌డెస్క్ -
ఎల్అండ్టీ ఇన్ఫో- టాటా పవర్ జూమ్
ఈ నెలాఖరువరకూ నాలుగోసారి లాక్‌డవున్ పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్ 149 పాయింట్లు పుంజుకుని 30,345కు చేరింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు బలపడి 8,925 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సాప్ట్వేర్ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, విద్యుత్ రంగ కంపెనీ టాటా పవర్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఐటీ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 427 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 13 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 3012 కోట్లను తాకింది. ఐటీ సర్వీసుల కంపెనీ ఫలితాలు త్రైమాసిక ప్రాతిపదికన పోల్చి చూసే సంగతి తెలిసిందే. క్యూ4లో 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా గత ఏడాది చివరికల్లా మొత్తం 8 పెద్ద డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 15.5 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎల్అండ్టీ ఇన్ఫో షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1784 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1799 వరకూ ఎగసింది. టాటా పవర్ కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టాటా పవర్ కంపెనీ రూ. 475 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 172 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 6621 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 1.55(155 శాతం) డివిడెండ్ ప్రకటించింది. మార్పిడి రహిత బాండ్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1500 కోట్లను సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం టాటా పవర్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 34 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 35 సమీపానికి చేరింది. -
ప్రత్యామ్నాయ విద్యుత్‌కు బెస్ట్ ప్రయత్నాలు
ఒప్పందం ప్రకారం టాటా నుంచి సరఫరా కాని విద్యుత్ ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు కంపెనీలతో బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ చర్చలు ప్రారంభించింది. టాటా పవర్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెస్ట్‌కి విద్యుత్ సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బెస్ట్‌కు నగరంలో సుమారు 10 లక్షల మంది వినియోగదారులున్నారు. అందులో 8 లక్షల మంది సాధారణ ప్రజలు, 2 లక్షల మంది వ్యాపారులు ఉన్నారు. 932 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా టాట్ పవర్‌తో బెస్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ టాటా పవర్ యూనిట్ ఆరులో విద్యుత్ సెట్ మూతపడడంతో కంపెనీ కేవలం 550 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. దాంతో బెస్ట్‌కు 383 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ఈ కారణంగా బెస్ట్‌కు ఇతర కంపెనీల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇతర కంపెనీలతో చర్చలు. అవసరానికన్నా తక్కువ విద్యుత్ సరఫరా అవుతుండటంతో బెస్ట్ అధికారులు ఇతర కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. విద్యుత్ కొరతను పూర్తి చేయడం కోసం రాష్ట్ర గ్రిడ్, మహా వితరణ, ఇతర ప్రైవేట్ కంపెనీల వద్ద విద్యుత్ కొనుగోలు కోసం సిద్ధమయ్యారు. సంబంధిత కంపెనీలతో చర్చలు కూడా ప్రారంభించారు. వినియోగదారులకు అవసరమున్నంత మేరకు సరఫరా చేయవచ్చని, వేసవిలో కొరత ఉండబోదని అందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని అధికారులు తెలిపారు. -
ఏడేళ్లుగా ఏమిచేస్తున్నారు?
సాక్షి, ముంబై: గడచిన ఏడేళ్లుగా విద్యుత్ సరఫరాను ఎందుకు మెరుగుపరుచుకోలేదంటూ టాటా పవర్ కంపెనీని మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎంవీఆర్సీ) ప్రశ్నించింది. తన పరిధిలో ఇతర సంస్థలు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అనుమతించకూడదంటూ బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన ఎంవీఆర్సీ పై విధంగా స్పందించింది. విద్యుత్ నియమ నిబంధనలు, రెగ్యులేటరీ కమిషన్ విధానాలను ఆధారంగా చేసుకుని బెస్ట్ సంస్థ ఈ పిల్‌ను దాఖలు చేసింది. కాగా ముంబైకర్లకు బెస్ట్ సంస్ధ విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఈ విద్యుత్‌ను టాటా పవర్ కంపెనీ నుంచి బెస్ట్ కొనుగోలు చేస్తోంది. ఇదిలాఉంచితే ఇకనుంచి ముంబైకర్లకు తామే స్వయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని టాటా కంపెనీ ఇటీవల స్పష్టం చేసింది. దీనిని సవాల్‌చేస్తూ బెస్ట్ సంస్థ పిల్ దాఖలు చేసింది. బెస్ట్ ప్రజా సంస్థ కావడంతో గృహవినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. ఇతర సంస్థలకు విద్యుత్ సరఫరాకు అనుమతిస్తే చిన్నతరహా వినియోగదారులకు సబ్సిడీ మాటేమిటనే ప్రశ్న తలెత్తుతుందని తన పిల్లో బెస్ట్ పేర్కొంది. ఇలా చేయడంవల్ల విద్యుత్ చార్జీలు పెరగుతాయని వాదిస్తోంది. బెస్ట్ పరిధిలో 10 లక్షల మందికిపైగా విద్యుత్ వినియోగదారులున్నారు. భారీగా విద్యుత్ వినియోగించే వారు ఇతర కంపెనీల నుంచి కనెక్షన్ తీసుకుంటే బెస్ట్ వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బెస్ట్ అభిప్రాయపడింది. నగరవాసుల్లో అత్యధిక శాతం మంది బెస్ట్ సంస్థ వినియోగదారులే. అయితే టాటా కంపెనీ మాత్రం బడా కంపెనీలకే ప్రాధాన్యమిస్తోందని బెస్ట్ వాదిస్తోంది.