ముంబై: కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు దేశంలో ఏ ఇతర సంస్థ చేయలేని విధంగా దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ తెలిపింది. ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను మాల్స్, హోటళ్లు, రిటైల్ అవుట్ లెట్లు, పబ్లిక్ యాక్సెస్ ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు టాటా పవర్ పేర్కొంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనలను ప్రోత్సహించడం కోసం దేశ వ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
దీనికి అదనంగా దేశంలో దాదాపు 10,000 హోమ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇవి వాహన యజమానులకు ఈవీ ఛార్జింగ్ చేసుకునేందుకు సౌకర్యవంతంగా ఉన్నాయి అని కంపెనీ తెలిపింది. టాటా పవర్ ఈజెడ్ ఛార్జర్స్ ఎకోసిస్టమ్ ద్వారా ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తుంది. ముంబైలో మొదటి ఛార్జర్లను టాటా పవర్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 180 నగరాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న ఈ-హైవేల మీద 10,000కి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది.
(చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...!)
Comments
Please login to add a commentAdd a comment