న్యూఢిల్లీ: దేశ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు తొలి త్రైమాసికానికి(ఏప్రిల్–జూన్) స్వల్పంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) క్యూ1లో 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అధిక వడ్డీ రేట్లు ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఫ్లక్స్ క్యూ1 పేరిట విడుదల చేసిన నివేదికలో రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది.
గతేడాది(2022–23) క్యూ1లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదైనట్లు తెలియజేసింది. అయితే నివేదిక ప్రకారం అంతక్రితం మూడేళ్లలో ఇంతకంటే తక్కువ పెట్టుబడులు నమోదుకావడం గమనార్హం! దేశ రియల్టీ రంగంలోకి 2022 క్యూ1లో 1.4 బిలియన్ డాలర్లు, 2021 క్యూ1లో 0.2 బిలియన్ డాలర్లు, 2020 క్యూ1లో 1.7 బిలియన్ డాలర్లు చొప్పున పీఈ పెట్టుబడులు ప్రవేశించాయి.
కాగా.. తాజా పీఈ పెట్టుబడుల్లో విదేశీ సంస్థల నుంచి 94 శాతం లభించడం గమనార్హం! దేశీ ఫండ్స్ వాటా 6 శాతమేనని నివేదిక వెల్లడించింది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ రూపేణా 94 శాతం నిధులు సమకూరినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment