
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్ తాజాగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(క్యూఎస్‌ఆర్) విభాగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా సబ్‌వే ఇండియా ఫ్రాంచైజీలపై కన్నేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రోసరీ, ఈఫార్మసీ, ఫ్యాషన్ తదితర రంగాలలో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రెస్టారెంట్ల నిర్వాహక సంస్థ సబ్‌వే ఇంక్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సబ్‌వే దేశీ ఫ్రాంచైజీల కోసం 20–25 కోట్ల డాలర్లు(రూ. 1,500–1,860 కోట్లవరకూ) వెచ్చించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment