
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. గురువారం ఇక్క డ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రూపాయి విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగం. అందువల్ల ప్రపంచ పరిణామాల ప్రభావం మనపై కూడా తప్పకుండా ఉంటుంది. అయితే, డాలరు మారకంలో ఇతర దేశాల కరెన్సీల పతనంతో పోలిస్తే భారత కరెన్సీ మరీ అంతలా పడిపోలేదు. కొంత మెరుగైన స్థితిలోనే ఉంది’’ అని ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్)లో కూడా మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి కాస్త మెరుగ్గానే ఉందని పేర్కొనడం గమనార్హం.
కొత్త కనిష్టాల బాటలోనే..
రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టాల బాటలోనే కొనసాగుతోంది. గురువారం డాలరు మారకంలో రూపాయి మరో పైసలు నష్టపోయి 79.06 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 79.07ను కూడా తాకింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనల ప్రభావంతో డాలర్ ఇండెక్స్ బలపడుతుండటం, దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండటం, ముడిచమురు ధరల పెరుగుదల వంటివి రూపాయి పతనానికి కారణంగా నిలుస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ లేకపోవడం మేలు చేస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment