Rupee Exchange Value
-
మన రూపాయి కాస్త బెటర్!
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. గురువారం ఇక్క డ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రూపాయి విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగం. అందువల్ల ప్రపంచ పరిణామాల ప్రభావం మనపై కూడా తప్పకుండా ఉంటుంది. అయితే, డాలరు మారకంలో ఇతర దేశాల కరెన్సీల పతనంతో పోలిస్తే భారత కరెన్సీ మరీ అంతలా పడిపోలేదు. కొంత మెరుగైన స్థితిలోనే ఉంది’’ అని ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో కూడా మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి కాస్త మెరుగ్గానే ఉందని పేర్కొనడం గమనార్హం. కొత్త కనిష్టాల బాటలోనే.. రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టాల బాటలోనే కొనసాగుతోంది. గురువారం డాలరు మారకంలో రూపాయి మరో పైసలు నష్టపోయి 79.06 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 79.07ను కూడా తాకింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనల ప్రభావంతో డాలర్ ఇండెక్స్ బలపడుతుండటం, దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతుండటం, ముడిచమురు ధరల పెరుగుదల వంటివి రూపాయి పతనానికి కారణంగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేకపోవడం మేలు చేస్తుంది! -
వారాంతాన బలహీనపడిన రూపాయి
ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కుదేలైంది. శుక్రవారం 20 పైసలు నష్టపోయి 70.23 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 70.32 వద్దకు పతనమైంది. గురువారం నాటి ముగింపు 70.03తో పోల్చితే చివరకు 20 పైసలు బలహీనపడింది. వరుసగా మూడు రోజులపాటు బలపడుతూ వచ్చిన భారత కరెన్సీ.. పెరిగిన ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా వారాంతాన మళ్లీ బక్కచిక్కిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. వారం మొత్తం మీద చూస్తే.. 31 పైసలు నష్టపోయి, వరుసగా రెండవ వారంలోనూ బలహీనతను నమోదుచేసింది. అమెరికా డాలరుతో ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడడం కూడా రూపాయిపై ఒత్తిడికి మరో కారణంగా నిలిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ఎగ్జిట్ పోల్స్, సాధారణ ఎన్నికల ఫలితాలు ఉన్నందున వచ్చేవారం రోజుల్లో భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అంచనావేశారు. -
రూపాయి రికవరీ బాట
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో 41 పైసలు లాభపడి 73.16 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 73.09 వరకు కూడా రికవరీ అయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చల్లబడడం రూపాయి విలువ రికవరీకి కారణమైనట్టు ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ఇరాన్‌పై నవంబర్ 4 నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రానుండడం కారణంగా, చమురు సరఫరాలో లోటు ఏర్పడితే దాన్ని తాము భర్తీ చేస్తామని సౌదీ అరేబియా ప్రకటించడం ధరలు తగ్గటానికి కారణమైంది. ఈ ప్రకటనతో బ్రెంట్ చమురు బ్యారెల్ 76 డాలర్లకు దిగొచ్చింది. చమురు ధరలు తగ్గడంతో విదేశీ నిధులు తరలిపోవడంపై ఆందోళనలు కొంత తగ్గాయి. అదే సమయంలో బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు డాలర్లను విక్రయించడం కూడా రూపాయి బలపడడానికి దారితీసింది. మంగళవారం రూపా యి 73.57 వద్ద క్లోజయిన విషయం తెలిసిందే. -
రేట్లకు రెక్కలు!!
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో వినియోగవస్తువుల నుంచి ఫోన్లు మొదలైన ఉత్పత్తుల దాకా అన్నింటి ధరలు పెరగనున్నాయి. దేశీ కరెన్సీ పతనం ఇదే తీరుగా కొనసాగితే ..ముడి చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోయి, పెట్రోల్, డీజిల్ మొదలుకుని వంట గ్యాస్ దాకా అన్నింటి రేట్లు ఎగియనున్నాయి. దిగుమతుల భారం పెరిగిపోతుండటంతో.. కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందుగానే రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి మారకం పతన ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు సోనీ, పానాసోనిక్, గోద్రెజ్ వంటి సంస్థలు తెలిపాయి. ‘డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 స్థాయిని దాటేయడం ముడివస్తువుల వ్యయాలపై మరింతగా ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే.. సమీప భవిష్యత్‌లో రేట్లు పెంచక తప్పక పోవచ్చు’ అని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నంది వెల్లడించారు. ఒకవేళ 70 స్థాయి దాటి రూపాయి కొనసాగితే.. పండుగలకు ముందే రేట్లను పెంచవచ్చని, ఆగస్టు ఆఖర్లోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అటు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే వినియోగ ఉత్పత్తుల రేట్లపై ఒత్తిడి తప్పదన్నారు. ప్రస్తుతానికి దేశీ కరెన్సీ తీరును పరిశీలిస్తున్నామని, టీవీల రేట్ల పెంపుపై ఇంకా నిర్ణయాలేమీ తీసుకోలేదని సోనీ ఇండియా హెడ్ ఆఫ్ సేల్స్ సతీష్ పద్మనాభన్ చెప్పారు. కొన్ని ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశాలు ఉండొచ్చని, ఇందుకు మరికాస్త సమయం పట్టొచ్చని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఎంట్రీ లెవెల్ ఫోన్లపై ప్రభావం.. రూపాయి పతనం కొనసాగితే ముడివస్తువుల ధరలూ పెరుగుతాయని, ఫలితంగా మొబైల్ ఫోన్లు.. ముఖ్యంగా ఎంట్రీలెవెల్ వేరియంట్స్ రేట్లు పెరగవచ్చని హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వెల్లడించాయి. ‘డాలర్ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మొబైల్స్ తయారీ వ్యయాలూ పెరుగుతాయి. ఫలితంగా హ్యాండ్సెట్స్ రేట్లూ పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఇంటెక్స్ టెక్నాలజీస్ (ఇండియా) డైరెక్టర్ నిధి మార్కండేయ చెప్పారు. కస్టమ్స్ సుంకాలు, ముడివస్తువుల రేట్ల పెరుగుదలతో హ్యాండ్సెట్స్ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని.. కోమియో ఇండియా సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. రూపాయి పతనం ప్రభావాలను సమీక్షిస్తున్నామని, రేట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంట్రీ లెవెల్ మొబైల్స్‌పై నేరుగా ప్రభావం పడొచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అయితే ఈ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడంతో రేట్ల పెంపుపై నిర్ణయం చాలా కష్టమైన వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. పెరిగే చమురు బిల్లు .. రూపాయి కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతుండటం చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల ముడిచమురు దిగుమతుల భారం ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 26 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడిచమురు దిగుమతుల భారం పెరిగితే.. తత్ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులే ఉంటున్నాయి. 2017–18లో 220.43 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 87.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం దిగుమతులు 227 మిలియన్ టన్నుల మేర ఉంటాయని అంచనా. ‘ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం రేటు 65 స్థాయిలో, ముడిచమురు బ్యారెల్ రేటు 65 డాలర్లుగా ఉంటుందనే అంచనాలతో.. దిగుమతుల బిల్లు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాం. కానీ ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి పతనం వల్ల పూర్తి ప్రభావాలు ఈ నెలాఖరులోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. రూపాయి పతనంతో ఎగుమతి సంస్థలతో పాటు దేశీయంగా చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ మొదలైన వాటికీ ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఇవి డాలర్ల మారకంలో బిల్లింగ్ చేయడం వల్ల వాటి నుంచి ఇంధనాలు కొనుగోలు చేసి విక్రయించే రిటైల్ సంస్థలు రేట్లను పెంచాల్సి వస్తుంది. ఒకవేళ చమురు రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉండి, రూపాయి 70 స్థాయిలోనే కొనసాగిన పక్షంలో ఇంధన ధరలు లీటరుకు 50–60 పైసల మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. రూపాయి మరింత పతనం తొలిసారిగా 70కి దిగువన క్లోజింగ్ 26 పైసలు డౌన్ ముంబై: రూపాయి విలువ శరవేగంగా కరిగిపోతోంది. రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ మరింత క్షీణించి కీలకమైన 70 మార్కు దిగువన తొలిసారిగా క్లోజయ్యింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే మరో 26 పైసలు తగ్గి 70.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 70.40ని కూడా తాకడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో రూపాయి పతనానికి కొంతైనా అడ్డుకట్ట పడిందని కరెన్సీ ట్రేడర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 69.89తో పోలిస్తే గురువారం ఫారెక్స్ మార్కెట్లో గ్యాప్ డౌన్‌తో ఏకంగా 70.19 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 70.40 స్థాయికి కూడా పడిపోయి చివరికి కొంత కోలుకుని 70.15 వద్ద క్లోజయ్యింది. పెరిగిపోతున్న ద్రవ్య లోటు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా–చైనా మధ్య వాణిజ్య భయాలపై ఆందోళనలు, డాలర్‌కు డిమాండ్ తదితర అంశాల నేపథ్యంలో దేశీ కరెన్సీ విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 10.5 శాతం మేర క్షీణించింది. వర్ధమాన దేశాల కరెన్సీల పతనానికి కారకమైన టర్కీ లీరా విలువ మాత్రం పెరిగింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 15 బిలియన్ డాలర్లు అందిస్తామంటూ కతార్ ముందుకు రావడంతో లీరా ర్యాలీ కొనసాగింది. మరోవైపు, రూపాయి క్షీణతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా 17 శాతం మేర పెరిగిన రూపాయి మారకం ప్రస్తుతం మళ్లీ సహజ స్థాయికి వస్తోందని పేర్కొన్నారు. -
ఏసీ, ఫ్రిజ్ ధరలకు రెక్కలు!!
ఏసీ, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్), మైక్రోవేవ్, ఇతర వంటింటి ఉపకరణాలు కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ఈ నెల్లో వీటి ధరలు 2–5 శాతంమేర పెరిగే అవకాశముంది. రూపాయి మారకం విలువ క్షీణించడం.. క్రూడ్ ధరల్లో పెరుగుదల.. స్టీల్, కాపర్ వంటి కీలకమైన ముడిపదార్థాల ధరలు ఎగబాకటం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. రూ.400–రూ.1,500 శ్రేణిలో పెంపు.. ప్రీమియం మోడళ్ల ధరల పెరుగుదల నికరంగా రూ.400 నుంచి రూ.1,500 శ్రేణిలో ఉండొచ్చని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్స్ చెప్పారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల కారణంగా మార్చి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. అందువల్ల డిమాండ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ధరలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపాయి. ‘జూన్ నుంచి ధరల పెంపు దశల వారీగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ల సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూసుకోవడం ప్రధానం. కొత్త సరుకు మార్కెట్లోకి రావడం కూడా పెంపునకు మరో కారణం’ అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. ప్రస్తుతమున్న పాత సరుకు వల్ల పరిశ్రమ గత రెండు నెలల నుంచి ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తోందని పేర్కొన్నారు. గోద్రెజ్ 2–3 శాతం శ్రేణిలో ధరలను పెంచనుంది. దేశీ అతిపెద్ద ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థ వోల్టాస్ తాజాగా ధరలను దాదాపు 3 శాతంమేర పెంచింది. వర్ల్‌పూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ డిసౌజా మాట్లాడుతూ.. పరిశ్రమ చర్యల ఆధారంగా తాము కూడా ధరలను పెంచొచ్చని తెలిపారు. అయితే ఎంతమేర పెంపు ఉంటుందనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎల్జీ, శాంసంగ్ ప్రొడక్టుల ధరలు 5% జంప్? దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను 5 శాతం మేర పెంచే అవకాశముంది. ఈ అంశాన్ని ఇప్పటికే తమ ట్రేడర్లకు ఇవి తెలియజేసినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అయితే ఈ సంస్థలు అధికారికంగా మాత్రం ఇంకా దీనిపై ఏమీ చెప్పలేదు. ధరల పెంపు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రమోషనల్ ఆఫర్లను అందించే ప్రయత్నం చేస్తున్నామని వోల్టాస్ ఎండీ ప్రదీప్ బక్షి తెలిపారు. పానాసోనిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. ‘‘కమోడిటీ ధరల పెరుగుదల వల్ల ఒత్తిడి బాగా పెరిగింది. కాబట్టి ధరలను ఎప్పట్లానే కొనసాగించలేం. రూపాయి మారకం విలువలో మళ్లీ క్షీణత మొదలైనా.. ఉత్పత్తి వ్యయాల పెరిగినా.. అప్పుడు ధరల పెంపు అనివార్యమవుతుంది’’ అని వివరించారు. రూపాయి దెబ్బ పరిశ్రమ తన ధరల వ్యూహాలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను 66 వద్ద బెంచ్‌మార్క్‌గా నిర్దేశించుకుంటుంది. కానీ ఇప్పుడు రూపాయి 67కు పైనే ఉంది. జనవరి నుంచి చూస్తే డాలర్‌తో రూపాయి 7%మేర క్షీణించింది. ప్రస్తుతం రూపాయి విలువ 67.11గా ఉంది. ఇక స్టీల్ ధరలు 7–8% పెరిగాయి. కాపర్ ధరలూ పెరిగాయి. ‘‘కాపర్‌ను ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని రసాయనాల ధరలు తగ్గడం కొంత ఉపశమనం. దీనివల్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. అయితే ఇది ఎక్కువ రోజులు సాధ్యపడదు’’ అని పలువురు ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. మరొకవైపు ధరల పెంపుపై రిటైలర్లు మిశ్రమంగా స్పందించారు. -
రూపాయికి 65–66 తగిన స్థాయే
మనీలా: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 65– 66 స్థాయిలో ఉంటే సముచితమైనదేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరెన్సీ పతనం ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన అక్కర్లేదని, రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముడిచమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల స్థాయిలో స్థిరపడుతుండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌ను (ఎఫ్‌పీఐ) ట్రెజరీ బిల్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించడం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ కొంతకాలం పాటు 66–67 స్థాయిలో ఉండొచ్చన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు. రూపాయి మారకం విలువ 64 స్థాయిలో ఉండటం సరైన ఎక్స్చేంజీ రేటుగా పరిగణించలేమని, ఈ స్థాయిలో ఉంటే ఎగుమతులకు ప్రతికూలమని చెప్పారాయన. ‘రూపాయి మారకం విలువ 64 స్థాయికి పెరిగినప్పుడు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. మళ్లీ 65– 66 స్థాయికి వస్తే సముచిత మారకం విలువగానే పరిగణించవచ్చు. దీని గురించి ఆందోళన అవసరం లేదు‘ అని గర్గ్ తెలిపారు. ఈ ఏడాది బాగా పతనమైన ఆసియా కరెన్సీల్లో రూపాయి రెండో స్థానంలో ఉంది. డాలర్‌తో పోలిస్తే గతేడాది 6.4 శాతం పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటిదాకా 2.4 శాతం మేర క్షీణించింది. భారత్ ఇంధన అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నందున... రూపాయి మారకం విలువ క్షీణిస్తే కరెంటు అకౌంటు లోటుపైనా ప్రభావం పడుతుంది. పుష్కలంగా విదేశీ మారక నిల్వలు: ఏడీబీ పుష్కలంగా విదేశీ మారక నిల్వలు ఉన్న భారత్... ప్రస్తుతం కరెన్సీ ఒడిదుడుకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. అయితే, రూపాయి క్షీణత వల్ల ఎగుమతుల రంగానికి ప్రయోజనం ఉన్నప్పటికీ.. ఎకానమీలో ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లు తలెత్తే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ఇప్పటికే 75 డాలర్లకు చేరిన ముడిచమురు బ్యారెల్ ధర మరింత భారీగా పెరగకపోవచ్చని యసుయుకి తెలిపారు. ఏప్రిల్ 6తో ముగిసిన వారాంతంలో భారత విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం గరిష్టమైన 424.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఐదు రోజుల్లో మొదటి పతనం! ముంబై: అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదురోజుల్లో తొలిసారి శుక్రవారం 23 పైసలు బలహీనపడింది. ఇంట్రాడే ఫారెక్స్ మార్కెట్లో 66.87 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీనత, క్రమంగా వెనక్కెళుతున్న పెట్టుబడులు, క్రూడ్ ధరల పరుగు, దీనితో క్యాడ్ భయాలు వంటి అంశాలు ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఏప్రిల్ 25వ తేదీన రూపాయి 14 నెలల కనిష్టస్థాయి 66.91 స్థాయిని తాకి అటు తర్వాత కొంత రికవరీ అవుతూ వచ్చింది. అయితే నేటి బలహీనతతో వారం చివరకు 21పైసలు బలహీనపడింది. క్రూడ్ ధరలు బెంబేలు.. మరోవంక ఈ వార్త రాసే సమయం రాత్రి 10.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలను చూశాయి. బ్రెంట్ బ్యారల్ ధర 75.06 డాలర్లను తాకింది. ఇక నైమెక్స్ ధర 69.97ను చేరింది. 70 డాలర్లు కీలక నిరోధం. దీనిని అధిగమిస్తే, తక్షణం 72 డాలర్లకు ఎగిసే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ. -
ఆరో రోజూ రూపాయి డౌన్
ముంబై: వరుసగా ఆరో సెషన్లోనూ రూపాయి మారకం విలువ క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే సోమవారం మరో 36 పైసలు తగ్గి 66.48 స్థాయికి పడిపోయింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2017 మార్చి 10 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు, క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగియడం మొదలైన అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. కొన్నాళ్ల క్రితం దాకా చౌక ముడిచమురు ధరలతో రూపాయి బలపడినప్పటికీ, ఇప్పుడు ఆ ర్యాలీకి అడ్డుకట్ట పడినట్లేనని ఫారెక్స్ ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే రిస్కును తెచ్చిపెట్టిన క్రూడ్ ధరల పెరుగుదల మూలంగా.. విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం డైలమాలో పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు, బాండ్ ఈల్డ్‌ల పెరుగుదల తదితర అంశాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్లు భారత మార్కెట్ నుంచి దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 66.12తో పోలిస్తే సోమవారం ఒకింత బలహీనంగా 66.20 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత మరింతగా తగ్గింది. డాలర్ల కొనుగోళ్ల ఒత్తిడితో ఇంట్రా డేలో 66.49 స్థాయికి కూడా తగ్గింది. మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో డాలర్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ కొంత జోక్యం చేసుకున్నప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. చివరికి 0.54 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 66.48 వద్ద క్లోజయ్యింది. -
రూపాయి 6 నెలల కనిష్టానికి
ముంబై: రాజకీయ, భౌగోళిక పరిణామాలు ఆందోళనకరంగా మారడంతో పాటు వాణిజ్య లోటు పెరగడం తదితర అంశాలతో రూపాయి మారకం విలువ ఆరు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే సోమవారం 0.44 శాతం తగ్గి 65.49కి పడిపోయింది. గతేడాది అక్టోబర్ 3 నాటి 65.50 క్లోజింగ్ తర్వాత ఇదే కనిష్టం. సిరియాపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల దాడులతో డాలర్ బలపడగా .. కీలక ఆసియా దేశాల కరెన్సీల్లో అత్యధికంగా క్షీణించినది రూపాయే. ఆసియా దేశాల కరెన్సీల్లో చైనా యువాన్, సింగపూర్ డాలరు 0.1 శాతం, ఫిలిప్పీన్ పెసో, మలేషియా రింగిట్లు 0.2 శాతం మాత్రమే తగ్గాయి. సందేహాస్పద విదేశీ మారక విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను కూడా అమెరికా చేర్చడం.. ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడర్లు తెలిపారు. ఇక వాణిజ్య లోటు 13.69 బిలియన్ డాలర్లకు ఎగియడం, నాలుగు నెలల అనంతరం మార్చిలో ఎగుమతులు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్స్ నుంచి పెట్టుబడులు కొంత ఉపసంహరించడం వంటి అంశాలు కూడా దీనికి తోడయ్యాయి. -
రూపాయి, విదేశీ ఇన్వెస్టర్లే కీలకం
ముడిచమురు ధర కదలికలు కూడా... * ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా.. న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల కదలికలతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి... ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకం కానున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఇప్పటికిప్పుడు మన మార్కెట్లను అత్యంత ప్రభావితం చేసే కీలకాంశాలేవీ(ట్రిగ్గర్స్) లేకపోవడమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే కదలికలపై కూడా దేశీ మార్కెట్లు దృష్టిసారించనున్నాయని వారు చెబుతున్నారు. ఇక 2016 కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే సంస్కరణల పక్రియ, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లలో మొదలవుతాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వారం కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉందని.. దీంతో సూచీల కదలికలు అక్కడక్కడే ఉండొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్ ఇంకా పటిష్టంగానే కొనసాగుతోందన్నారు. మరోపక్క, డిసెంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలకు అనుగుణంగా సోమవారం ఆటోమొబైల్ స్టాక్స్ స్పందించే అవకాశం ఉంది. గత నెలలో అమ్మకాలు మెరుగైన స్థాయిలో నమోదైన సంగతి తెలిసిందే. ఇక సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) డేటా కూడా ఈ వారంలో విడుదల కానుంది. దీని ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండొచ్చని నిపుణులు చెప్పారు. ‘గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు, రూపాయి, ముడిచమురు రేట్లు సమీప కాలంలో మాన మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు భారత్‌పై ఎలాంటి ధోరణిని అనుసరిస్తారనేదే రానున్న కాలంలో మన మార్కెట్‌కు కీలకంగా నిలుస్తుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇక కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా స్వల్పకాలికంగా కీలకమైన అంశమేనని చెప్పారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల లాభాలు పుంజుకోవచ్చన్న విశ్వాసం మెండుగా ఉన్న నేపథ్యంలో మార్కెట్లు క్రమంగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. దీనికి ఆర్థిక వ్యవస్థ పటిష్టత ప్రధానంగా దోహదం చేయనుంది’ అని కోటక్ సెక్యూరిటీస్ సీఈఓ కమలేష్ రావు పేర్కొన్నారు. గత వారం మార్కెట్... దేశీ మార్కెట్లు గత వారం కూడా లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు ఎగబాకి 26,161 వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 7,963 వద్ద ముగిసింది. గడిచిన ఏడాది(2015) మొత్తంమీద చూస్తే సెన్సెక్స్ 1,382 పాయింట్లు(5 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే. బాండ్లలో పడిపోయిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గతేడాది దేశీ డెట్ మార్కెట్లో(బాండ్లు) చేసిన నికర పెట్టుబడులు భారీగా దిగజారాయి. 2015 మొత్తంలో కేవలం 7.4 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.45,856 కోట్లు) మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. 2014లో ఈ పెట్టుబడుల విలువ 26 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.6 లక్షల కోట్లు) కావడం గమనార్హం. ఇక స్టాక్స్‌లో కూడా అత్యంత తక్కువ స్థాయిలో నికరంగా 17,806 కోట్లను మాత్రమే గతేడాది ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం మూడేళ్లలో వరుసగా దాదాపు రూ. లక్ష కోట్ల చొప్పున ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమనం, చైనాలో స్టాక్ మార్కెట్ల పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటివి ఎఫ్‌పీఐల పెట్టుబడులపై ప్రభావం చూపాయనేది విశ్లేషకుల అభిప్రాయం. -
రూపీ.. మళ్లీ ‘లో’బీపీ!
* 69 పైసలు పతనం * 64.23 వద్ద ముగింపు * 20 నెలల కనిష్టానికి క్షీణత... * వరుసగా 5 సెషన్లలో 1.71% డౌన్ ముంబై: మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్న నేపథ్యంలో రూపాయి మారకం విలువ వరుసగా అయిదో సెషన్లోనూ క్షీణించింది. గురువారం డాలర్‌తో పోలిస్తే ఏకంగా 20 నెలల కనిష్ట స్థాయి 64.23కి పడిపోయింది. దిగుమతి సంస్థలు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ నెలకొనడం, ముడి చమురు ధరలు పెరగడమూ దేశీ కరెన్సీపై గణనీయంగా ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్ డీలర్లు వివరించారు. అయితే, అంతర్జాతీయంగా డాలర్ కాస్త బలహీనంగా ఉండటంతో రూపాయి నష్టాలకు కొంత బ్రేక్ పడిందని పేర్కొన్నారు. కనీస ప్రత్యామ్నాయ పన్నులపై ఆందోళనలతో విదేశీ నిధులు వెల్లువలా తరలిపోతుండటం, పన్నులపరంగా కీలకమైన సంస్కరణల ఆమోదానికి పార్లమెంట్లో జాప్యం జరుగుతుండటం తదితర అంశాలు రూపాయి.. 20 నెలల కనిష్టానికి పడిపోవడానికి దారితీశాయని డీలర్లు వివరించారు. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.54తో పోలిస్తే బలహీనంగా 63.78 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత 64 స్థాయి దిగువకి పడిపోయి ఒక దశలో 64.28కి కూడా క్షీణించింది. రోజంతా 63.69-64.28 శ్రేణిలో తిరుగాడిన రూపాయి.. చివరికి 69 పైసల నష్టంతో (1.09%) 64.23 వద్ద ముగిసింది. 2013 సెప్టెంబర్ 6 తర్వాత ఇంత బలహీన స్థాయి దగ్గర ముగియడం ఇదే ప్రథమం. అప్పట్లో 65.24 వద్ద క్లోజయ్యింది. గడిచిన అయిదు సెషన్లలో దేశీ కరెన్సీ 108 పైసలు (1.71%) క్షీణించింది. ఇకపై స్పాట్ మార్కెట్లో రూపాయి 63.80-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. మరింత కిందికే...! బుధవారం భారీగా అమ్మకాలకు దిగిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) గురువారం రూపాయిలను డాలర్లలోకి మార్చుకోవడం వల్ల దేశీ కరెన్సీ పతనం కొనసాగిందని పరిశీలకులు తెలిపారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడం వల్ల రూపాయి పతనానికి కొంత మేర అడ్డుకట్ట పడినట్లయిందని వివరించారు. 63.90 స్థాయి నుంచి బ్యాంకులు డాలర్లను విక్రయిస్తూనే ఉన్నప్పటికీ.. డాలర్లకు మరింత డిమాండ్ నెలకొందని పేర్కొన్నారు. ఎఫ్ఐఐలు భారత్ కన్నా మెరుగైన రాబడులిచ్చే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంతో ఇక్కడ తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే కొన్ని సెషన్లలో రూపాయి మారకం విలువ 64.50 స్థాయిని తాకవచ్చన్నారు. దేశీ స్టాక్‌మార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌తో పాటు క్రూడ్‌ఆయిల్ రేట్లు, యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగవచ్చన్న ఆందోళనలు రూపాయిపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. -
బ్లాక్ మండే
⇒ అమెరికా వడ్డీ రేట్ల ముందస్తు పెంపు భయాలు ⇒ తాజా షార్ట్ సెల్లింగ్ ప్రభావం ⇒ లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు ⇒ ఈ ఏడాది రెండో భారీ పతనం ⇒ సెన్సెక్స్ 604 పాయింట్లు డౌన్..28,845 వద్ద క్లోజ్ ⇒ నిఫ్టీ నష్టం 181 పాయింట్లు; 8,757 వద్ద ముగింపు ప్రపంచమంతా అంతే.. అమెరికాలో పటిష్టమైన ఉద్యోగ గణాంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ గణాంకాలు గత శుక్రవారమే వెలువడ్డాయి. ఆ రోజు అమెరికా మార్కెట్లు 1.5 శాతం తగ్గాయి. ఈ ప్రభావం సోమవారం అన్ని దేశాల మార్కెట్లపై పడింది. ఎగుమతి గణాంకాలు బాగా ఉండటంతో షాంగై కాంపొజిట్ మాత్రం లాభాల్లో ముగిసింది. ఈ చైనా షాంగై స్టాక్ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పతన బాటలోనే సాగాయి. యూరప్‌లో జర్మనీ మినహా మిగతా ప్రధాన స్టాక్ మార్కెట్లుకూడా నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీ బేర్... 3 శాతం పతనం స్టాక్ మార్కెట్ సూచీలతో సహా అన్ని ఇండెక్స్‌లు పతనబాటలోనే సాగాయి. అత్యధికంగా బ్యాకింగ్ ఇండెక్స్ 3 శాతం తగ్గింది. విద్యుత్ సూచీ 2.9 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.7 శాతం, రియల్టీ 2.5శాతం, లోహ సూచీ 2.4 శాతం, ఐటీ 2 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.6 శాతం, ఆటో 1 శాతం, ఎఫ్ఎంసీజీ 0.7 శాతం చొప్పున తగ్గాయి. అయితే హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రం .3 శాతం పెరిగింది. రూపాయి బలహీనపడడం, బాండ్ల రాబడులు పెరగడం వల్ల బ్యాంక్ షేర్లు తగ్గాయని నిపుణులంటున్నారు. బ్యాంక్ ఈల్డ్‌లు పెరగడం వల్ల బ్యాంక్ సెక్యూరిటీల మార్క్-టు-మార్కెట్ విలువ ప్రభావితం అవుతుందని కేఆర్ చోక్సి షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ దేవెన్ చోక్సి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో వివిధ సంస్థలు తమ పొజిషన్లను తగ్గించుంకుటున్నాయని ఆయన పేర్కొన్నారు. రూపాయిదీ నేలచూపే.. ముంబై: అనుకున్న దానికంటే ముందుగానే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్టానికి క్షీణించింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే 39 పైసలు క్షీణించి 62.55 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ పతనం కావడం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 62.16తో పోలిస్తే బలహీనంగా 62.60 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 62.73కి కూడా క్షీణించింది. ఈ ఏడాది జనవరి 8 తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఆ రోజున ఇంట్రాడేలో రూపాయి ఏకంగా 63.20 స్థాయికి పడిపోయింది. ఇక తాజాగాదేశీ కరెన్సీ 0.63 శాతం తగ్గుదలతో 62.55 వద్ద ముగిసింది. ఇక రూపాయి ట్రేడింగ్ శ్రేణి 62-63 మధ్య ఉండగలదని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనుకున్నదానికంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచుతుందన్న భయాందోళనలతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా పతనమైంది. దీనికి తోడు రూపాయి భారీగా క్షీణించడం, తాజా షార్ట్ సెల్లింగ్ కూడా జత కావడంతో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 604 పాయింట్లు క్షీణించి 28,845 పాయింట్లకు, నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 8,757 పాయింట్లకు పతనమయ్యాయి. సోమవారం స్టాక్ సూచీలు 2 శాతం వరకూ క్షీణించాయి. బ్యాంకింగ్, విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, లోహ, ఐటీ, ఆయిల్, గ్యాస్, వాహన, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా పడ్డాయి. ఫెడ్ ఆందోళనలు.. అమెరికాలో నిరుద్యోగం రేటు 5.5 శాతానికి పడిపోయిందని, 2008, మే తర్వాత ఇదే కనిష్ట స్థాయని అమెరికా కార్మిక విభాగం గత శుక్రవారం వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నదానికి ఇది చిహ్నమని, దీంతో అనుకున్నదానికంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే ఊహాగానాలు చెలరేగాయని, దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయని, స్టాక్ సూచీలు భారీగా క్షీణించాయని బ్రోకర్లు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అమెరికా బ్యాంక్ డిపాజిట్లు, డెట్ మార్కెట్ మంచి రాబడులను ఇస్తాయి. దీంతో రిస్క్ అధికంగా ఉండే భారత్ వంటి వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి నిధులు అమెరికా డెట్ మార్కెట్‌కు తరలుతాయని నిపుణులంటున్నారు. లాభాల స్వీకరణ కార్పొరేట్ రంగానికి అనుకూలమైన నిర్ణయాలు కేంద్ర బడ్జెట్లో ఉండడం, ఆశించిన విధంగా ఆర్బీఐ రేట్ల కోత విధించడం వంటి కీలకమైన అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవల రికార్డ్ స్థాయి ర్యాలీ జరిపాయి. షేర్లన్నీ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించి ప్రతికూల వార్త రావడంతో దేశీయ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని నిపుణులు పేర్కొన్నారు. కరిగిపోయిన లోహ షేర్లు... గ్యాప్ డౌన్‌తో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29,317 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 29,321-28,800 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 604 పాయింట్లు నష్టపోయి 28,845 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంతకు ముందు ఈ స్థాయి భారీ పతనం ఈ ఏడాది జనవరి 6న సంభవించింది. ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 855 పాయింట్లు(3%)క్షీణించింది. నిఫ్టీ కూడా ఈ రోజు 251 పాయింట్లు పతనమైంది. సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ విలీనానికి పం జాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఇది ఆఖరి ఆమోదం. దీంతో ఈ రెండు షేర్లు రికార్డు స్థాయిలను తాకాయి (సన్ ఫార్మా రూ.1,049, ర్యాన్‌బాక్సీ రూ.826).చివరకు సన్ ఫార్మా రూ.1,041 వద్ద, ర్యాన్‌బాక్సీ రూ.818 వద్ద ముగిశాయి. బొగ్గు గనులను చేజిక్కించుకోవడానికి పలు లోహ కంపెనీలు ఎక్కువ మొత్తంలో సొమ్ములు వెచ్చిస్తున్నాయని, దీంతో వీటి లాభదాయకతపై ప్రభావం పడుతుందనే అంచనాలతో లోహ షేర్లు క్షీణించాయి. టీసీఎస్ గెడైన్స్ బాగా లేకపోవడంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. 4 సెన్సెక్స్ షేర్లకే లాభాలు... 30 షేర్ల సెన్సెక్స్ ఇండెక్స్‌లో 26 షేర్లు నష్టపోగా, 4 షేర్లే లాభాల్లో నిలిచాయి. వీటిలో హిందూస్తాన్ యూనిలివర్ 3.7 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.5%, సన్ ఫార్మా 0.4%, మారుతీ సుజుకీ 0.01% చొప్పున పెరిగాయి. 1,889 షేర్లు నష్టాల్లో, 977 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,610 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.18,432 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,48,485 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.838 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.35 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ‘స్పార్క్’ వెలుగులు సన్ ఫార్మా అనుబంధ సంస్థ అయిన సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ(స్పార్క్) షేర్ జోరుగా పెరుగుతోంది. సోమవారం ఈ షేర్ ఎన్ఎస్ఈలో 15 శాతం వృద్ధి చెంది రూ.544 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.564ను తాకింది. ఈ కంపెనీ ఇటీవలనే మూర్ఛ వ్యాధిలో ఉపయోగించే ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఆనుమతి పొందిన విషయం తెలిసిందే. ఈ షేర్ 3 సెషన్లలో రూ.412 నుంచి 34 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో రూ.187గా ఉన్న ఈ షేర్ ధర ఇప్పటివరకూ 200 శాతం ఎగబకడం విశేషం. -
రూపాయి 46పైసలు డౌన్
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలు వ గురువారం 45 పైసలు క్షీణించింది. బుధవారంతో పోల్చితే డాలర్‌తో రూపా యి మారకం విలువ 46 పైసలు(0.73%) తగ్గి రూ.61.86 వద్ద ముగిసింది. దాదాపు ఏడు వారాల తర్వాత రూపాయి ఒక్క రోజులో ఎక్కువగా క్షీణించడం ఇదే తొలిసారి.నెలాఖర్లో ఎగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్‌కు డిమాండ్ కూడా రూపాయి తగ్గడానికి ప్రధాన కారణమని ట్రేడర్లంటున్నారు. దీనికితోడు ఈ ఏడాదిలోనే వడ్డీరేట్లు పెంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ యోచిస్తుందన్న ఊహాగానాలతో డాలర్ మరింత బలపడిందని వారంటున్నారు.