సియోల్: ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో సంచలనాన్ని సృష్టించింది. టెస్లా తన కంపెనీ నుంచి సైబర్ ట్రక్ వాహనాలను కూడా ఉత్పత్తి చేయనుంది. కాగా తాజాగా టెస్లా, శాంసంగ్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సైబర్ ట్రక్ వాహనాల్లో కెమెరా మాడ్యూళ్లను అమర్చేందుకుగాను శాంసంగ్ కంపెనీతో సుమారు 436 మిలియన్ డాలర్ల(రూ. 3 వేల కోట్ల )తో టెస్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
శాంసంగ్ మొబైల్ నివేదిక ప్రకారం.. టెస్లా కార్ల తయారీ సంస్థకు కెమెరా మాడ్యూళ్లను సరఫరా చేసేందుకు డీల్ కుదిరిందని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.శాంసంగ్, టెస్లా కంపెనీలు డీల్‌ను కుదుర్చుకోవడం కొత్తేమి కాదు. గతంతో టెస్లా కంపెనీకు ఎలక్ట్రిక్ వాహానాలకు సంబంధించిన బ్యాటరీలను సరఫరా చేయడంలో శాంసంగ్ పాత్ర ఉంది. అంతేకాకుండా శాంసంగ్ తయారుచేసిన పిక్స్‌సెల్ ఎల్‌ఈడీ ల్యాంప్‌లను టెస్లా ఉత్పత్తి చేస్తోన్న ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించనుంది. కాగా సైబర్‌ట్రక్ వాహానాలకోసం ఇప్పటివరకు పదిలక్షలమంది తమ పేరును నమోదు చేసుకున్నారని టెస్లా ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment