ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రికార్డు స్థాయిలో అంతర్జాతీయంగా ఒక బిలియన్ డాలర్ల సిండికేటెడ్ సోషల్ రుణ సమీకరణ జరిపింది.
ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం, ఆసియా పసిఫిక్ మార్కెట్‌లో ఒక వాణిజ్య బ్యాంక్ ఈ స్థాయిలో సేకరించిన అతిపెద్ద ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెర్స్) రుణం ఇది.
బిలియన్ డాలర్ల రుణ సమీకరణలో 500 మిలియన్ డాలర్లు ప్రైమరీ ఇష్యూ ద్వారా సమీకరించగా, అంతే సమానమైన మొత్తం గ్రీన్‌షూఆప్షన్ ద్వారా సమీకరించినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం, బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,200 కోట్లకు సమానం.
Comments
Please login to add a commentAdd a comment